ప్లాస్టిక్ వ్యర్ధాలు .. ప్రస్తుత ప్రపంచపు సమస్య ..
తిరిగి ఉపయోగించలేని, భూమిలో కరగని ప్లాస్టిక్ వ్యర్ధాలు అనేక రకాలుగా చికాకులు కలిగిస్తున్నాయి.
వీది జంతువులు మరణాలు, డైనేజ్ వ్యవస్థ కి అడ్డంకులు, పర్యావరణానికి వీటిని కాల్చడం ద్వారా వచ్చే విష వాయులు, ఒకటేమిటి అనేకం. తెల్లటి హిమాలయాలనుండి, సముద్రగర్భాలవరకు అనేక చోట్ల ప్రకృతి ని నాశనం చేస్తున్న వ్యర్ధాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి.
తాత్కాలికంగా తిరిగి వినియోగించడం, లేదా కేరళ లాటి ప్రాంతాలలో బాటిల్స్ లో ఇసుక నింపి ఇటుకలుగా వాడటం మినహా ఈ రంగం లో పెద్దగా పురోగతి సాదించింది లేదని చెప్పాలి.
..
అయితే ఈ మధ్య కాలం లో ఈ సమస్యకి ఒక వినూత్నమయిన పరిష్కారం చూపిస్తున్న రంగం మాత్రం సివిల్ ఇంజనీరింగ్ విభాగమే. (సివిల్ ఇంజనీర్లు, కాలర్ ఎగరేసుకోండి)
..
వొకర్స్ వెస్సెల్స్ అనే డచ్ బెసేడ్ సంస్థ దీనికో పరిష్కారం కనుగొనింది.
(volkerwessels అనే భవన నిర్మాణ సంష్ట 1854 లో డచ్ కేంద్రంగా ప్రారంభమయింది. 1978 లో stevin group ను 1997 లో kondor wessels అనే గ్రూప్ ని కలుపుకుని చివరికి ప్రస్తుతం పిలవబ్డుతున్న volkerwessels గ్రూప్ గా 2002 లో మారింది. బిల్డింగ్ ప్రాపర్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, టెలికాం, మెరైన్ సర్వీసెస్ లో యూకే లోనూ కెనడా లోనూ స్తిరమయిన లాభాలతో నడుస్తున్న సంస్థ. )
..
టన్నుల్లో పెరుకున్న ప్లాస్టిక్ వ్యర్ధాలని, సేకరించి, చిన్న ముక్కలుగా చేసి కొన్ని ప్రత్యేక పద్దతులతో కరిగించి అచ్చులలో కి మార్చి, బ్లాక్స్ గా తయారు చేస్తున్నారు. మద్యలో హాలో గా ఉండే స్థలం ఉంటుంది.
(సింటెక్స్ డోర్స్ & పానెల్స్ పార్టిషన్ అవగాహన ఉందా?)
వీటన్నిటిని నిర్ణీత వెడల్పుతోనూ పొడవుతోనూ పోత పోసాక రోడ్డు అవసరమయిన చోటకి తరలిస్తారు.
మామూలు పద్దతులకి కొద్దిగా భిన్నగా, రోడ్డు నిర్మాణం జరిగే చేత ఒక వెడల్పాటి గోతిని ని ఏర్పాటు చేసి, ముందుగా దాన్ని కొంత ప్లాస్టిక్ కాంక్రీట్ తో ఒక లేయర్ వేసి కంప్రెస్స్ చేస్తారు.
తర్వాతే పోత పోసిన రోడ్డు ముక్కల్ని చదును చేసిన గోతిలో అమరుస్తారు. (వీడియొ చూడండి )

వీటి మధ్య రెండు పోరల్లా ఉండే భాగం లో కేబుల్స్, లాటివి అమర్చుకునే ఏర్పాటు ఉంటుంది. అదేవిధంగా వర్షం నీరు డ్రైన్ అవటానికి కూడా ఏర్పాట్లు ఉంటాయి. స్టాండర్డ్ సైజు బ్లాకుల తో జరిగిన నిర్మాణం కనుక రేపేర్లు కూడా సులభమే.
సాధారణ, తారు, సిమెంట్ రోడ్ల కన్నా, ఖర్చు, సమయము, ఆదా తో పాటు రెండు మూడు రేట్ల ఎక్కువ కాలం మన్నిక వీటి ప్రత్యకత.
ప్రస్తుతం నెదర్లాండ్స్ లో ఈ తరహా రోడ్ల నిర్మాణం ప్రయోగాత్మకంగా జరుగుతుంది.
ఈ విధానం విజయవంతం అయ్యి, ప్రపంచవ్యాప్తంగా ప్లాసిక్ రోడ్ల నిర్మాణం జరిగితే కానీ ఈ ప్లాసిక్ వ్యర్ధలకి ఒక మంచి పరిష్కారం దొరకదు.
ప్రస్తుతం నెదర్లాండ్స్ లో ఈ తరహా రోడ్ల నిర్మాణం ప్రయోగాత్మకంగా జరుగుతుంది.
ఈ విధానం విజయవంతం అయ్యి, ప్రపంచవ్యాప్తంగా ప్లాసిక్ రోడ్ల నిర్మాణం జరిగితే కానీ ఈ ప్లాసిక్ వ్యర్ధలకి ఒక మంచి పరిష్కారం దొరకదు.
No comments:
Post a Comment