“నాన్నా రాజా నేను అలుక్కున్నాం” అంది మా పెద్దమ్మాయి…
టైమ్ చూశాను 7.45 అయింది.
“వింటున్నారా?”
మళ్ళీ అడిగింది.
“ లేదు. నా సమస్యలు నాకున్నాయి. కారప్పొడి లో
అమ్మ ఇంకా నెయ్యి వేయలేదు” ఇడ్లీ ప్లేటు చూపిస్తూ చెప్పాను.
“నేనన్నది .. తింటున్నారా? అని కాదు”
“మరి?” ...“రమా
నెయ్యి కాగబెట్టటం ఎంతసేపు ?”
“ఎందుకు అలిగాను అని అడిగారా?”
“తప్పదా? ఎందుకు?”
“7.30 కి ఫోన్ చెయ్య మన్నాను. చేయలేదు.”
“ఫోను సైలెంట్ లో ఉంటుంది చూడు.”
తను ఫోన్ తీసుకుని సైలెంట్ నుండి ఆప్షన్
మార్చింది.
అప్పటికే నాలుగు మిస్ కాల్స్, వాట్స్ అప్ మెసేజ్ లు ఉన్నాయి.
భావనా నా వైపు చూసి నవ్వేలోగా పోన్ మోగింది.
వంట గది నుండి ఇప్పట్లో .. నెయ్యి వచ్చే
సూచనలు లేవు.
నేను కూడా అలిగాను..
No comments:
Post a Comment