Wednesday 3 September 2014

సిగిరెట్లు


కనీసం నాలుగు రోజులైనా పడుతుంది అనుకున్నా..
కానీ ఆ ఆదివారపు మధ్యాన్నం అమ్మ తవ్వ(లోహం తో చేసిన cylindrical vessel )
లోని జొన్నలు చాటలో దొర్లించింది.
 (గిద్ద అంటే సుమారుగా 125 g ,2 గిద్దలు అర సోల, 2 అర సోలలు ఒక సోల , రెండు సోలలు ఒక తవ్వ మనము 1000 g లేదా Kg అనుకోవచ్చు) .
 బయట కొచ్చి బుద్దిగా ? చదువుకుంటున్న నన్ను వాసు లోపలికిరా రా అంది.
 వణికే కాళ్లతో లోపలికి వెళ్ళాను.
 చాట వైపు చూపించింది.జొన్నల మధ్యలో తెల్లని బియ్యం.
 రైతుల వద్ద ఎపుడైనా జొన్నలు, రాగులు, సజ్జలు (పొలం లోకి పని కి వెళ్ళి వస్తూ ) 
తెచ్చి రొట్టెలు కానీ బూరెలు కానీ చేస్తుడేది అమ్మ. 
అప్పట్లో డబ్బు ఎపుడూ నడిచేది కాదు. 
చిల్లర కొట్లో జొన్నలు ఇచ్చి మారకపు విలువతో మనకి కావల్స్లినవి కొనుకున్నే వాళ్ళం.
 నేను బేసికల్ గా తెలివైన వాడిని కాబట్టి తవ్వలో జొన్నల పరిమాణం తగ్గకుండా 
మధ్యలో బియ్యం పోసి పైన కొంత జొన్నలు పోసి అప్డేట్ చేశాను. 
ఎప్పటికైనా విషయం తేలుతుందని తెల్సు గాని 
అంత త్వరగా వివాహ ఘడియలు వస్తాయని అనుకోలేదు...
ఎవరి పని ఇది ?” 
నేనే కొట్టుకి పోసాను”. తప్పులు చేసేవాడిని కానీ అబద్దం ఆడే వాడిని కాదు.
ఏమి కొన్నావు?
సిగిరెట్లు...
నాకు అంత వరకే గుర్తుంది. 
మిగిలింది. జంధ్యాల గారు బ్రతికి ఉంటే వారి చేత చెప్పించే వాడిని.
అప్పట్లో మా అమ్మ పొట్టు పొయ్యి వాడేది. 
రంపపు పొట్టు గోతం తలుపు వెనుక ఉండేది. 
చాలాసేపు దాన్ని బీన్స్ బాగ్ లాగా వాడుకున్నాను. శరీరం మీద యెర్ర టి వాతలు, చమట కి అంటుకున్న రంపపు పొట్టు, ఆ ఆనందం నాకు మాత్రమే స్వంతం. 
ఆ రోజు అమ్మ వాడిన వస్తువేదో నాకు గుర్తులేదు. 
మొన్నామధ్య అడిగాను కానీ మమ్మ చెప్పలేదు.
ఏమి చేశావు సిగిరెట్లు ? “ ఎంతో వేదన నిండిన గొంతు తో అడిగింధి అమ్మ.
రెండు తిన్నానమ్మా? ఇంకా రెండు ఉన్నాయి లాగు జేబులో చెయ్యి పెట్టి బయటకి తీశాను.
 చెమట పట్టిన చేతికి పిప్పర మెంటు సిగిరెట్టు కలరు ఆంటి ఉంది. ... 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...