Wednesday, 3 September 2014

జొన్న దంట్లు


పెద కొత్తపల్లి ... నా బాల్యం లో ప్రధానమైన బాగం ఇక్కడే గడిచింది. 
ప్రారంభం లోనే ఒక గాలి గోపురం. 
మరో వైపు పెద్ద చెరువు. చెరువు కట్ట మీద ఎత్తైన చింత చెట్లు. 
సాగు త్రాగు నీరు సమకూర్చే చెరువు చాలా పెద్దది. 
రేవులోకి దిగడానికి మెట్లు. 
మెట్లు మీది దిగి నీళ్ళు ముంచుకునే స్త్రీలు
కావిడిలతో నీళ్ళు ముంచుకెల్లే ముఖం పుల్ల మగాళ్లు... 
ఉదయామ్ సాయంత్రం అంతా సందడి. 
..
రేవు కి దగ్గర్లో ఒక చింత్ చెట్టు ఉండేది . ..
చాలా పెద్దది. గొప్పగా ఉండేది. ముఖ్యంగా దాని తొర్ర....
స్కూలు వదిలాక నేరుగా అక్కడికొచ్చి తొర్రలో కూర్చునేవాడిని. 
చీకటి పడుతున్న భయం గా ఉండేది కాదు.
 చాలా సేపు కూర్చునేవాడిని. 
అమ్మ వచ్చి ఇంటికి లాక్కెల్లెదాకా..
..
అదేం ఆదృస్టమో గాని మేము ఎక్కడ.. ఉన్నా  దొడ్లో చింత్ చేట్టో 
లేదా ఇంటి ముందు జొన్నదంట్లు మేసే పశువులో ఉండేవి. 
పని నుండి వచ్చాక అమ్మ నన్ను ఇంటికి ఈడ్చుకెళ్లక ఖచ్చితంగా
 పై రెండిట్లో ఏదో ఒకటి వాడేది. వీటి సిగ తరగా రెండు చురుకే. 
జొన్నదంట్లు వీపుమీద చీలి చర్మం ఎర్రగా కంది ఉన్నపుడు
 పొంతలోని వేడి నీళ్లు తో స్నానం చేయించి పీటేసి
 రమ్ములక్కాయ కూర తో (టమోటా) అన్నం పెడితే.. 
ఒక వైపు ఒళ్ళంతా సమ్మగా ????...
 కడులోకి వేడిగా అన్నం తింటుంటే నిద్ర ముంచుకొచ్చేది. 
మిషిన్ (పగలంతా పని చేసి వచ్చిన అమ్మ రాత్రిళ్ళు బట్టలు కుట్టేది) కుడుతున్న అమ్మ 
ఎందుకు ఏడుస్తుందో తెలిసి చచ్చేది కాదు. 
అమ్మ ఏడవకుండా ఉండటం కోసం మరో రెండు కోటింగుల కయినా నేను సిద్దమే. 
కానీ అమ్మ కి ఆ ఆప్షన్ ఉందని అర్దమయేది కాదు. 
..
మగత నిద్రలో ఉన్న నన్ను నులక మంచం మీది ..
పాత గుడ్డలతో కుట్టిన మెత్తటి మెత్త మీద పడుకోబెడుతూ అమ్మ ఏదో అనేది. 
అది ఏ భాషో కూడా గుర్తులేదు.. 
కానీ దాని భావం మాత్రం నాకు ముగ్గురు పిల్లలు పుట్టాక అర్ధమయ్యింది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...