Wednesday, 3 September 2014

సిగిరెట్లు


కనీసం నాలుగు రోజులైనా పడుతుంది అనుకున్నా..
కానీ ఆ ఆదివారపు మధ్యాన్నం అమ్మ తవ్వ(లోహం తో చేసిన cylindrical vessel )
లోని జొన్నలు చాటలో దొర్లించింది.
 (గిద్ద అంటే సుమారుగా 125 g ,2 గిద్దలు అర సోల, 2 అర సోలలు ఒక సోల , రెండు సోలలు ఒక తవ్వ మనము 1000 g లేదా Kg అనుకోవచ్చు) .
 బయట కొచ్చి బుద్దిగా ? చదువుకుంటున్న నన్ను వాసు లోపలికిరా రా అంది.
 వణికే కాళ్లతో లోపలికి వెళ్ళాను.
 చాట వైపు చూపించింది.జొన్నల మధ్యలో తెల్లని బియ్యం.
 రైతుల వద్ద ఎపుడైనా జొన్నలు, రాగులు, సజ్జలు (పొలం లోకి పని కి వెళ్ళి వస్తూ ) 
తెచ్చి రొట్టెలు కానీ బూరెలు కానీ చేస్తుడేది అమ్మ. 
అప్పట్లో డబ్బు ఎపుడూ నడిచేది కాదు. 
చిల్లర కొట్లో జొన్నలు ఇచ్చి మారకపు విలువతో మనకి కావల్స్లినవి కొనుకున్నే వాళ్ళం.
 నేను బేసికల్ గా తెలివైన వాడిని కాబట్టి తవ్వలో జొన్నల పరిమాణం తగ్గకుండా 
మధ్యలో బియ్యం పోసి పైన కొంత జొన్నలు పోసి అప్డేట్ చేశాను. 
ఎప్పటికైనా విషయం తేలుతుందని తెల్సు గాని 
అంత త్వరగా వివాహ ఘడియలు వస్తాయని అనుకోలేదు...
ఎవరి పని ఇది ?” 
నేనే కొట్టుకి పోసాను”. తప్పులు చేసేవాడిని కానీ అబద్దం ఆడే వాడిని కాదు.
ఏమి కొన్నావు?
సిగిరెట్లు...
నాకు అంత వరకే గుర్తుంది. 
మిగిలింది. జంధ్యాల గారు బ్రతికి ఉంటే వారి చేత చెప్పించే వాడిని.
అప్పట్లో మా అమ్మ పొట్టు పొయ్యి వాడేది. 
రంపపు పొట్టు గోతం తలుపు వెనుక ఉండేది. 
చాలాసేపు దాన్ని బీన్స్ బాగ్ లాగా వాడుకున్నాను. శరీరం మీద యెర్ర టి వాతలు, చమట కి అంటుకున్న రంపపు పొట్టు, ఆ ఆనందం నాకు మాత్రమే స్వంతం. 
ఆ రోజు అమ్మ వాడిన వస్తువేదో నాకు గుర్తులేదు. 
మొన్నామధ్య అడిగాను కానీ మమ్మ చెప్పలేదు.
ఏమి చేశావు సిగిరెట్లు ? “ ఎంతో వేదన నిండిన గొంతు తో అడిగింధి అమ్మ.
రెండు తిన్నానమ్మా? ఇంకా రెండు ఉన్నాయి లాగు జేబులో చెయ్యి పెట్టి బయటకి తీశాను.
 చెమట పట్టిన చేతికి పిప్పర మెంటు సిగిరెట్టు కలరు ఆంటి ఉంది. ... 

ఒక వర్షపు సాయంత్రం


కొన్నేళ్ళ క్రితం ఒక వర్షం కురిసే సాయంత్రం లక్కవరం
 (తాళ్ళూరు మండలం, ప్రకాశం జిల్లా ) నుండి దరిశి (హోం) కి వెళుతున్నాను.
 ఎడతెరిపిరి లేని వర్షం.
 చిత్తడి నేల బజాజ్ m-80 బండి జారుతున్న నేల కళ్ళలో సూదుల్లా గుచ్చుతున్న వాన చినుకులు. 
జాగర్తగా ఇంటికి మరో (20 km) వెళుతుండగా చెయ్యెత్తి లిఫ్ట్ అడిగిన ఆగంతకుడు. 
యువకుడే కానీ అతని ముఖం లో ఆదుర్దా.... 
బండి ఎక్కించుకున్నాను. ఒక 10 km ప్రయాణం చేశాక 
తూర్పువీరాయపాలెం లో రోడ్డు కి అడ్డంగా వాగు... 
హటాత్తుగా పెరిగి తగ్గే గుణం ఉన్నది. 
దాదాపు నడుం లోతుగా ప్రవహిస్తుంది.
 (ఇప్పుడు బ్రిడ్జ్ వేశారు) .నేను అక్కడ ఆగి పోయాను. 
దిగితే బండి పూర్తిగా మునిగే లోతు... 
ఆలోచిస్తుండగా silencer కి గుడ్డ అడ్డం పెట్టి నెట్టుకుంటూ వెళదామా అని అతని సలహా. 
నిజానికి నేను బండి అక్కడే లోక్ చేస్తి ఏదైనా బస్ గాని లారీ గాని వస్తే ఎక్కి ఇంటికి వెళ్ళి పోదాం.
 బండి సంగతి రేపు చూసుకుందాం అని నా ఆలోచన..
 కానీ అతని పరిస్తితి బిన్నంగా ఉంది. 
చాలా తొందరలో ఉన్నాడు  భాహుశా ఏ రోగినో అటండ్ అవ్వాల్సి ఉంది గామోను .
అతని అవసరం నన్ను ఒప్పించింది. 
బండి నీటిలో దించాక కానీ ఎంత తప్పు చేశామో అర్ధం అవలేదు. 
కింధ పాకుడు రాళ్ళ మద్య కాళ్ళు జారీ ఇరుక్కు పోతున్నాయి. 
నీటి వేగం బండి తో సహ మమ్మల్ని బలంగా నెడుతుంది. 
వెనుక నుండి అతను బలంగా బండి ని తోస్తున్నాడు... 
వాగు సగం పైగా దాటాము. అప్పుడే వెనకానుండి ఒక మినీ లారీ వచ్చింది. 
మామీద నీళ్ళు చిమ్ముకుంటూ చిన్నగా మమ్మల్ని దాటింది. 
హటాత్తుగా జరిగింది ఆ సంఘటన. 
వెనక బండి నెట్టే అతను లారీ పట్టుకుని ఎక్కి వెళ్ళి పోయాడు. 
యేమి జరిగినదో అర్దమయ్యేలోపు నీటి ప్రవాహం నన్ను బండితో కలిపి పక్కకి నెట్టే సింది .
 నేను పడిపోయాను. 
తిరిగి నాకు తెలిసే సరికి గంట దాటింది. 
చీకటి పడింది ఒడ్డున ఉన్న వాళ్ళు గమనించి వచ్చి నన్ను బయటకు లాగారు.
 అక్కడే ఉన్న కాక హోటల్ లో కొంత సేపు refresh అయ్యాక అక్కడినుండి 
auto లో దరిశి బయలుదేరాను. చలి.. బండి వాగు లో కొట్టుకు పోయింది.
బండి బాక్స్ లో లంచ్ బాక్స్ తో పాటు విలువైన ఆఫీసు కాగితాలు.....
ఒక్క పావుగంట లో దరిశి చేరాను...
మరొక్క వాక్యం తో ఈ ఘటన ముగిస్తాను.
auto దిగి మా వీది వైపు నడుస్తుంటే మూల మీదున్న బార్ వద్ద 
నన్ను వాగులో వదిలి వచ్చిన మిత్రుడు యెక్కువగా  తాగటం వల్ల 
రోడ్డు మీద అయోమయంగా పడి దొర్లుతున్నాడు.
భగవంతుడా... వాడినైనా   లేదా కనీసం నన్నైనా మార్చు. if u dare can.

జొన్న దంట్లు


పెద కొత్తపల్లి ... నా బాల్యం లో ప్రధానమైన బాగం ఇక్కడే గడిచింది. 
ప్రారంభం లోనే ఒక గాలి గోపురం. 
మరో వైపు పెద్ద చెరువు. చెరువు కట్ట మీద ఎత్తైన చింత చెట్లు. 
సాగు త్రాగు నీరు సమకూర్చే చెరువు చాలా పెద్దది. 
రేవులోకి దిగడానికి మెట్లు. 
మెట్లు మీది దిగి నీళ్ళు ముంచుకునే స్త్రీలు
కావిడిలతో నీళ్ళు ముంచుకెల్లే ముఖం పుల్ల మగాళ్లు... 
ఉదయామ్ సాయంత్రం అంతా సందడి. 
..
రేవు కి దగ్గర్లో ఒక చింత్ చెట్టు ఉండేది . ..
చాలా పెద్దది. గొప్పగా ఉండేది. ముఖ్యంగా దాని తొర్ర....
స్కూలు వదిలాక నేరుగా అక్కడికొచ్చి తొర్రలో కూర్చునేవాడిని. 
చీకటి పడుతున్న భయం గా ఉండేది కాదు.
 చాలా సేపు కూర్చునేవాడిని. 
అమ్మ వచ్చి ఇంటికి లాక్కెల్లెదాకా..
..
అదేం ఆదృస్టమో గాని మేము ఎక్కడ.. ఉన్నా  దొడ్లో చింత్ చేట్టో 
లేదా ఇంటి ముందు జొన్నదంట్లు మేసే పశువులో ఉండేవి. 
పని నుండి వచ్చాక అమ్మ నన్ను ఇంటికి ఈడ్చుకెళ్లక ఖచ్చితంగా
 పై రెండిట్లో ఏదో ఒకటి వాడేది. వీటి సిగ తరగా రెండు చురుకే. 
జొన్నదంట్లు వీపుమీద చీలి చర్మం ఎర్రగా కంది ఉన్నపుడు
 పొంతలోని వేడి నీళ్లు తో స్నానం చేయించి పీటేసి
 రమ్ములక్కాయ కూర తో (టమోటా) అన్నం పెడితే.. 
ఒక వైపు ఒళ్ళంతా సమ్మగా ????...
 కడులోకి వేడిగా అన్నం తింటుంటే నిద్ర ముంచుకొచ్చేది. 
మిషిన్ (పగలంతా పని చేసి వచ్చిన అమ్మ రాత్రిళ్ళు బట్టలు కుట్టేది) కుడుతున్న అమ్మ 
ఎందుకు ఏడుస్తుందో తెలిసి చచ్చేది కాదు. 
అమ్మ ఏడవకుండా ఉండటం కోసం మరో రెండు కోటింగుల కయినా నేను సిద్దమే. 
కానీ అమ్మ కి ఆ ఆప్షన్ ఉందని అర్దమయేది కాదు. 
..
మగత నిద్రలో ఉన్న నన్ను నులక మంచం మీది ..
పాత గుడ్డలతో కుట్టిన మెత్తటి మెత్త మీద పడుకోబెడుతూ అమ్మ ఏదో అనేది. 
అది ఏ భాషో కూడా గుర్తులేదు.. 
కానీ దాని భావం మాత్రం నాకు ముగ్గురు పిల్లలు పుట్టాక అర్ధమయ్యింది.

ప్రారంభం


ఒక నాన్నాసి స్నానం చేస్తున్నాడు నడుం లోతు నీళ్ళలో... 
ఒక ఆకు మీద తేలుతూ ఒక తేలు. తేలు మునిగేలా ఉంది. 
సన్నాసి చేతితో పట్టి తేలును ఒడ్డుకి విసిరాడు. 
ఆ ప్రయత్నం లో తేలు అతన్ని కుట్టింది. 
..
పది నిమిషాల తర్వాత మళ్ళీ అదే తేలు.. ..
అదే విదంగా. సన్నాసి కూడా డిటో...
కొన్నిసార్లు ఈ తంతు ఇలా కొనసాగుతుండ గా ..
ఒడ్డున ఉన్న వాళ్ళు.. 
..
అరె బాబు దాని బుద్ది అది మాననపుడు నువ్వేందుకు తెలివిగా ఉండవు అంటే.. 
ఆ సన్నాసి దాని బుద్ది అది మాననపుడు నేను ఇంత తెలివిగలవాడిని 
నేను ఎందుకు నా బుద్ది మార్చుకుంటాను అన్నాడుట....
..
మనిషి మారడు .. ముసుగు మారుతుంది అంతే  :) 

ముందు మాట


హిందీ లో చిన్న సంఘటలని 'టిప్పణి' అంటారు.
ఇలాటివి వ్రాయటం నాకు సరదా..... 
అప్పట్లో V S P తెన్నేటి (ఎడిటర్, స్రవంతి , పల్లకి వార పత్రిక ) 
 గారు కొమెక  (కొస మెరుపు కధకుడు)  అని పిలుస్తుండేవారు.
..
ఇవన్నీ నేను నా పిల్లలకోసం ( ముగ్గురు) వ్రాస్తున్నాను. ..
..
ఎందుకంటే వాళ్ళలో రీడబిలిటీ పెంచడం కోసం. 
అంతే కాకుండా మాకు మా నాన్నగారు.(టీచరు) మంచి కధలు చెప్పేవారు.
నేను నా పిల్లలకి చెప్పలేక పోయాను. ..
..
చాలా సార్లు మా పాత విషయాలు 
ముఖ్యంగా బాల్యం గురించి చెప్పెటపుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ..
..
ఇవ్వన్నీ వాళ్ళకోసం. 
మిత్రులేవరి నైనా అలరిస్తే సంతోషం. 
కామెంట్  లేదా మీ లైక్ నన్ను ఖచ్చితంగా ఆనందిపచేస్తుంది.
(y)




www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...