“అబద్దాలు ఆడటం అనేది పిల్లలకి మనమే నేర్పుతాం. కాపీ పుస్తకం లో అబద్దం ఆడరాదు అని రాయిస్తాం. వెంకట్రావు అంకుల్ వస్తే మా నాన్న ఇంట్లో లేడు అని చెప్పమని కూడా మనమే చెబుతాం.”
బస్సులో పక్క సీటు అతనికి మాత్రమే చెబుతున్నాడు కానీ.
ప్రశాంతంగా సిటింగు మించని బస్సులో అందరికీ బోర్డు మీద వ్రాసి,
పాఠం చెబుతున్నంత కమాండింగా ఉన్నది అతని వాయిస్.
ప్రశాంతంగా సిటింగు మించని బస్సులో అందరికీ బోర్డు మీద వ్రాసి,
పాఠం చెబుతున్నంత కమాండింగా ఉన్నది అతని వాయిస్.
ఈపాటికే అమరావతి బోటు ప్రమాదానికి కారణాలు విశ్లేషించి,
నివారణకి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమేం చెయ్యాలో,
ప్రజానీకం ఎవరెవరి కాలర్లు పట్టుకుని ఎలా నిలదీయ్యాలో
ఒక పావుగంట పాటు చెప్పి ఉన్నాడు.
నివారణకి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమేం చెయ్యాలో,
ప్రజానీకం ఎవరెవరి కాలర్లు పట్టుకుని ఎలా నిలదీయ్యాలో
ఒక పావుగంట పాటు చెప్పి ఉన్నాడు.
సింగిల్ టీచర్ పిల్లలకి అన్నీ సబ్జెక్ట్లు చెప్పినట్లు మరో టాపిక్ లోకి వెళ్ళి ధారాళంగా మాట్లాడుతున్నాడు.
అప్పుడప్పుడే చిక్కబడుతున్న చీకటిని చీల్చుకుంటూ బస్సు..
చీమకుర్తి దాటి వెళ్తూ ఉంది.
చీమకుర్తి దాటి వెళ్తూ ఉంది.
చాలాకాలం సెలవు పెట్టి తిరిగి జాయిన్ అయ్యాక సిలబస్ మొత్తం చెప్పేయ్యాలి
అన్నంత ఆత్రంగా మాట్లాడుతున్నాడు.
అన్నంత ఆత్రంగా మాట్లాడుతున్నాడు.
“అసలు అబద్దం అనేది మన సంస్కృతి కాదు. ఒక అబద్దాన్ని కప్పిపుచ్చటానికి అనేక జిబి ల మెమొరీ వృదా చేసుకోవాలి. అంత జ్నాపక శక్తిని ఏదైనా పనికొచ్చే విషయం మీద కేటాయిస్తే బోలెడు ఉపయోగం. చిన్నదే కదా అని అశ్రద్ద చేస్తే అదే పెరిగి అబద్దం జన్మహక్కు అంటారే అలా అయిపోతుంది. వాడేవాడో చివర్లో ఉరిశిక్ష పడ్డాక చివరి కోరికగా తల్లి ని పిలిచి, చెవి కొరికి గోంగూర కట్ట దొంగిలించినప్పుడే ఎందుకు దండిచలేదు అని అడిగాడట.. అలా అవుతుంది.”
పక్క సీటు లో పెద్దాయన నోట్లో వక్క పొడి ఉందో లేదో కానీ, దవడలు ఆడిస్తూ ఉన్నాడు.
మద్య మద్యలో వింటున్నట్టు ఆతగాడి వైపు చూసి మొహమాటపు నవ్వు నవ్వుతున్నాడు.
ఇలాటి వాగుడు కాయ ల నుండి కాపాడుకోటానికయినా సరే దేవుడు చెవులకి రెప్పలు ఇచ్చి ఉంటే బాగుందనిపించింది.
మరో అరగంట కి తిరుమల వెంకన్న దర్శనం అయినట్లు ఒంగోలు చేరినట్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి కనిపించింది. బైపాస్ లో దిగటానికి లేచి బాగ్ తీసుకుంటుంటే...
వాగుడు కాయ కి ఫోన్ వచ్చింది.
“ఇంకా... చీమకుర్తి రాలేదే.. ఇంకో గంట పడుతుంది ఇంటికి వచ్చే సరికి “ అని చెప్పాడు. ఫోన్ లో గట్టిగా...
“ఇంకా... చీమకుర్తి రాలేదే.. ఇంకో గంట పడుతుంది ఇంటికి వచ్చే సరికి “ అని చెప్పాడు. ఫోన్ లో గట్టిగా...
“ఈ టీట్ణీలు నాదగ్గర కుదరదు.. నేరుగా ఇంటికి రా.. ఇవాళ కూడా తాగి వచ్చావో *%$” అటునుండి ఫోన్ లో ఆడగొంతు మొరటుగా వినబడింది.
వాగుడు కాయ పక్క సీటు ఆయన లేచి కిటికీ లోనుండి నోట్లో వక్క పొడి “థూ “ అని ఊచాడు.
బస్సు స్లో అయ్యింది.
బస్సు స్లో అయ్యింది.
6 comments:
వక్కపొడి థూ ! జిలేబీ
చక్కగ యెంచక్కగాను చమకుల్లదిరెన్
బక్కటి మనుజుడు కనబడ
లెక్కలు వల్లించునోయి లెస్సగ సుమ్మీ :)
జిలేబి
Lo. Jilebi is ready with paiku poem. Ee range lo Kasi teerchukuntunnavu endukamma.
జిలేబి కి థాంక్స్. :D
పైకూ పద్యముల జిలే
బీ గీరగనానిమస్సు బిత్తరు బోయెన్ :)
సోకుల్మాడగ వీడెవ
డే కిరికిరిరాయడమ్మ డేరా వేసెన్ :)
జిలేబి
Jilebi awards for the best paiku poems like the pandi awards announced.
లెజెండ్ అనే బుచికిముదనష్టం సినిమాకు అవార్డులా. కావాలంటే పంది అవార్డు ఇచ్చుకోమనండి. ముండమోపి జూరీని చెప్పులతో కొట్టాలి.
Post a Comment