అయిదువేల
సంవత్సరాల క్రితం, ఉపనిషత్తుల కాలం లో ‘గార్గి’ అనే
ఒక మహిళ ఉండేది.
స్త్రీ
ల పట్ల ఇంత వివక్ష ఉండేది కాదు.
తాత్వికుదయిన
రాజు ప్రతి సంవత్సరం వివేకవంతులయిన పండితులని పిలిపించి పోటీ పెట్టేవాడు. గొప్ప జ్ణానులు
మాత్రమే పోటీలకి హాజరయ్యే వారు. వాళ్ళలో కపటం అనేది ఉండేది కాదు.
ఒక సంవత్సరం
రాజు వేయి ఆవుల బహుమతి ప్రకటించాడు. ఆవుల కొమ్ములకు రత్నాలు తాపడం చేసిన బంగారు తొడుగులు
ఉంటాయని చెప్పాడు.
ఆ రోజుల్లో
యజ్నవాల్యుడు సుప్రసిద్దుడు. విజయం పట్ల అనుమాత్రం కూడా సందేహం లేని వాడు. ఎక్కడ పోటీ
జరుగుతుందో అక్కడ తన తత్వ పరిజ్ననమ్ తో పోటీ గెలిచేవాడు.
ఆ స్తలానికి
వచ్చి వజ్రాలు, రత్నాలు తాపడం చేసిన కొమ్ములు ఉన్న ఆవుల గుంపుని చేసాడు. సూర్య కాంతి లో ఆ దృశ్యం ఎంతో అద్ద్బుతంగా ఉంది.
వస్తూనే
“వీటిని మన ఆశ్రమానికి తోలుకేళ్ళండి ఇవి అనవసరంగా ఎండలో బాధపడటం ఎదుకు? ఎటూ విజయం మనదే అని” శిష్యులని
పురమాయించాడు.
అక్కడున్న
జ్ణానులు ఎవరు ఆయన్ని నిలువరించలేక పోయారు. చివరికి రాజు గారు కూడా నిస్సహాయం గా ఉండిపోయాడు.
యాజ్ఞవల్యూడిని
జయించడం ఆసాద్యమ్ అని వాళ్ళకి తెలిసి పోయింది. విజేతగా ప్రకటించే సమయం లో ‘గార్గి’ ఆటల్లో పడి ఇంటికి రాని బిడ్డడిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది.
విజయానికి
ముందే ఆవులని తోలుకెళ్లటం తెలుసుకుంది.
ఆమె
చక్రవర్తి తో “మీరు ఆయన్ని విజేతగా ప్రకటించకండి. నేను నా బిడ్డ కోసం వచ్చాను. నా బిడ్డని
వెతకమని ఎవరినయినా పురమాయించండి. నేను యాజ్ఞవల్యూడి తో వాదనకు సిద్దంగా ఉన్నాను. ఆయన
చదువు కున్నవారు, పండితుడు కానీ పండితుడికి సత్యం అవగాహన కాదు” అంది.
అవి
గొప్ప రోజులు స్త్రీలు కూడా గొప్పగా సవాలు చేయగలిగిన రోజులు. చక్రవర్తి ప్రకటనే చేయకుండా
వాదన చేయటానికి అంగీకారం తెలిపాడు.
యాజ్ఞవల్యూడి
ని ఆమె ఒక సాధారణమయిన ప్రశ్న వేసింది. “ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించాడు?” అంది.
ఆమె
చిన్న ప్రశ్నకు బదులుగా యాజ్ఞవల్యూడు నవ్వాడు. చిన్న పిల్లల ప్రశ్నలు అడుగుతుంది. అనుకుంటూ
“దేవుడు సృష్టించాడు. ఎందుకంటే ఏదయితే ‘ఉన్నదో’ దాన్ని ఎవరో ఒకరు సృష్టించాలి కాబట్టి” అన్నాడు.
గార్గి
నెమ్మదిగా “ దేవుడు ఉన్నాడు కదా? ఆయన్ని ఎవరు సృష్టించాడు?” అని అడిగింది.
యాజ్ఞవల్యూడు
వలలో పడి పోయాడు. “దానికి సమాదానం గా మరో దేవుడు అని చెబితే తిరిగి ఆయన్ని ఎవరు సృష్టించాడు
అని అడుగుతుంది. సమాదానం గా మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తుంది”
యాజ్ఞవల్యూడు
తను ఇరకాటం లో పడి పోయినట్లు గ్రహించాడు. సహజం గానే ఆగ్రహం వచ్చింది. కత్తి దూశాడు.
గార్గి
“మహారజా అతన్ని బంధించి ఆవులని వెనక్కి రప్పించండీ” అని పిల్లవాడిని ఎత్తుకుని అక్కడి
నుండి వెళ్లిపోయింది.
........................
ఓషో కధ నా మాటల్లో ...
1 comment:
Don't think yagnavalkya gave such dumb answer. Instead gargi should have asked him to explain jilebi paiku poem meaning. He would have fainted.
Post a Comment