రమేశ్ వచ్చే సరికి ‘వెలుగొండయ్య’ తమ పాత కాలం నాటి మట్టి మిద్దె లో నులక మంచం పరుచుకుని నిద్ర పోతున్నాడు.
అది పూర్తిగా నిద్ర కూడా కాదు. చేయటానికి మరేం లేదు. మద్యాహ్నం ఒక కునుకు.
ఆయనకి ఒక అబ్బాయి, మరో అమ్మాయి. ఇద్దరు స్థిరపడ్డారు. చెరో చోట.
పాత మట్టిమిద్దేలో బోలెడు శూన్యం మిగిల్చి ఆర్నెల ల క్రితం బార్య వెళ్లిపోయింది. వృదాప్యం లో ఆసరాగా ఉంచుకున్న డబ్బు, కార్పొరేట్ ఆసుపత్రులు మింగేసాయి.
పాత మట్టిమిద్దేలో బోలెడు శూన్యం మిగిల్చి ఆర్నెల ల క్రితం బార్య వెళ్లిపోయింది. వృదాప్యం లో ఆసరాగా ఉంచుకున్న డబ్బు, కార్పొరేట్ ఆసుపత్రులు మింగేసాయి.
బార్య అంత్యక్రియయలకి కొడుకుని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. ఆమె వెళ్ళి పోయాక గాని ఆమె విలువ అర్ధం కాలేదు.
అబ్బాయి నెల్లూరు లో ఉంటాడు. వాడి కుటుంబం వాడిది. ఎంత సంపాదించినా లోటు బడ్జెట్. ఇద్దరు ఆడపిల్లలతో కుటుంబం నడుపుకోవటం అంతంత మాత్రం. అక్కడ పిల్లాడితో ఉండటం సాద్యము కాదు. ఇక తన కాలు చెయ్య ఆడేంత వరకు ఈ ఊర్లోనే ఉండి పోవటం తప్ప మరో మార్గాంతరం లేదు.
రమేశ్ , వెలుగొండయ్య అల్లుడు. చీరాల లో హాండ్ లూమ్స్ ఆఫీసులో చిన్న గుమాస్తా.. జగర్త పరుడు. తనపని తను చేసుకుపోయే రకం. ముభావంగా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడాడు. కుటుంబ విషయాలు పెద్దగా పంచుకోడు.
అల్లుడి రాక అతన్ని ఆశ్చర్య పరిచింది.
“రాయ్యా .. అమ్మాయి పిల్లలు బాగున్నారా?” లేచి ఇనుప కుర్చీ ఒకటి వాలుస్తూ పలకరించాడు.
చేతి లో కుర్చీ అందుకుని కూర్చుంటూ ..
“బానే ఉన్నారు? మీరేలా ఉన్నారు? బాగా తగ్గిపోయారు. వెంకాయమ్మ రోజు వస్తూ ఉందా లేదా?”
వెంకయమ్మ ఆ ఇంటి చాకలి. అత్తగారు పోయాక ఆవిడే రోజు వచ్చి గుప్పెడు బియ్యం వండి, పోతూ ఉంటుంది.
బట్టలు అవి ఉతికి పెట్టటం. ఇల్లు శుబ్రం చేయటం లాటివి చేసి పెడుతుంది.
“ఆ వస్తుంది.. నాకేమీ ఇబ్బంది లేదు. అన్నం తిన్నావా?” అల్లుడిని అడిగాడు.
“తిన్నానండీ. పరంధామయ్య గారితో పని ఉండి వచ్చాను.”
పరంధామయ్య చేయి తిరిగిన ఆరెంపి వైద్యుడు. ఒక మెడికల్ షాపు.
కూరగాయల నుండి, ఫాన్సీ అయిటం వరకు అమ్మే పెద్ద కిరాణా కొట్టు ఆయన కి ఉన్నాయి.
కూరగాయల నుండి, ఫాన్సీ అయిటం వరకు అమ్మే పెద్ద కిరాణా కొట్టు ఆయన కి ఉన్నాయి.
“పరంధామయ్య అంటే .. డాక్టరేగా?”
“అవును ఆయనే.. చాలా కాలం క్రితం కొంత డబ్బు చేబదులుగా ఇచ్చాను. ఇప్పటి వరకు ఇవ్వలేదు. నెల నెలా కొంత ఇస్తాను అంటున్నాడు. మీరు కావల్సిన సరుకులు అవి, అక్కడే తెచ్చుకోండి. అలా అయినా కొంత మొత్తం మనకి జమ అవుతుంది.”
పరంధామయ్య కి తన అల్లుడి వద్ద అరువు తీసుకోవాలసిన అవసరం ఏముందో వెలుగొండయ్య కి అర్ధం కాలేదు . అయినా మౌనం గా ఉన్నాడు.
చేతి సంచి లో నుండి రెండు ‘పంచలు’ తీసి మంచం మీద ఉంచాడు.
“మొన్న ఎవరో .. మా ఆఫీసులో పని ఉండి నేత పంచెలు తిచ్చి ఇచ్చారు. నాకు పంచలు కట్టటం రాదు కదా? అందుకే మీరు వాడుకోండి.”
“మొన్న ఎవరో .. మా ఆఫీసులో పని ఉండి నేత పంచెలు తిచ్చి ఇచ్చారు. నాకు పంచలు కట్టటం రాదు కదా? అందుకే మీరు వాడుకోండి.”
రమేశ్ బయలు దేరుతుంటే.. వీది మలుపు వరకు వచ్చాడు వెలుగొండయ్య.
“మరిచి పోకండి. పరంధామయ్య మనకి చాలా డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఏమి కావల్సినా అక్కడే తీసుకోండి. మందులు అవి అవసరం అయినా అక్కడే తీసుకోండి లెక్క వ్రాసి పెట్టమని చెప్పాను.” రమేశ్ గట్టిగా చెప్పాడు.
అల్లుడు అబద్దం చెప్పటం వెలుగొండయ్య కి బాగా అనిపించింది.
(ఈ నెల బ్లాగ్ లో ఏమి వ్రాయలేదు. బహుశా ఇంత గ్యాప్ రావటం ఇదే మొదలు)
No comments:
Post a Comment