హాల్లోకి ఎనిమిదేళ్ళ పాప బెరుకు లేకుండా వచ్చింది.
టేబుల్ మీద ఉన్న స్వీట్స్ ని చేయి చాచి అందుకో బోయింది.
వారిస్తున్న వారిని మందలిస్తూ దగ్గరకి తీసుకుని ముద్దు చేసాడు పురుషోత్తం.
“ఏం పేరు బుజ్జి?”
“నీరద”
"బావుంది." పాపని వళ్ళో కూర్చోబెట్టుకోబోతుంటే బార్య చిన్నగా దగ్గింది.
ట్రే లో కాఫీ కప్పులతో ‘సుజాత’ హాల్లోకి వచ్చింది.
అందరికి కాఫీ గ్లాసులు అందించి తండ్రి పక్కనే కూర్చుంది.
పురుషోత్తం కాఫీ చప్పరిస్తున్న కొడుకుని గమనించాడు.
అతని మొహం లో చిన్న సంతోషం.
కొద్ది క్షణాలు మౌనంగా దొర్లాయి.
పెద్ద వాళ్ళు ఏవో సంభందం లేని విషయాలు మాట్లాడుకుంటూ ‘ఇద్దరినీ’ గమనిస్తున్నారు.
“అబ్బాయితో ఏమయినా మాట్లాడాలంటే చెప్పమ్మా.” పురుషోత్తం సుజాత కట్టు కున్న చీర ని గమనిస్తూ పెద్దగా నవ్వుతూ అన్నాడు.
“నేను మీతో నే మాట్లాడాలి.”
ఒక్క నిమిషం అక్కడ నిశబ్దం.
“మాట్లాడమ్మా .. పెళ్ళయ్యాక అందరం కలిసే ఉంటాం. మాకు హైదరాబాదు లో కూడా ఇల్లు ఉంది. మీరు ఉద్యోగాన్ని బట్టి అక్కడయినా ఉండొచ్చు. మీ అత్తగారు నేను అప్పుడప్పుడూ వచ్చి .........”
“మీరు వరంగల్ జెడ్ పి స్కూల్ లో పని చేసారు కదా? “
పురుషోత్తం ఆశ్చర్యపోయాడు.
“అ వు ను”
“ఫిజికల్ సైన్సు చెప్పే వారు”
“నీ కేలా తెలుసు?”
“మా అమ్మాయి అక్కడే చదివింది.” సుజాత తండ్రి అందుకున్నాడు.
"ఓహ్ అలానా? మాస్టారిని ఇంకా మర్చి పోలేదన్న మాట ” మాస్టారి భార్య నవ్వింది. ..
“పసి పిల్లలని తాక కూడని చోట తాకి నరకం చూపించిన వీడిని అంత తేలిగ్గా మర్చిపోవటమా?” తమ్ముడూ.. ఇన్నాళ్ళు నేను పెళ్లి కి వప్పుకోక పోవటానికి కారణం అడిగేవాడివి కదా?”
పమిట మీది పురుగు ని విదిల్చుకుని నిలబడింది సుజాత.

3 comments:
ఇది కంబళిపూచ్చి తమిళ షార్ట్ స్టోరీ యూట్యూబు కత గాదూ?/
జిలేబి
బాగుందండీ... చాలా పదునుగా...
jilebi గారూ అవును. అదే.
Post a Comment