స్టేషన్ నుండి ట్రైన్ బయలుదేరిన రెండు నిమిషాలకి ఆ పిల్లాడు గేటు వద్ద నుండి లోపలి వచ్చి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్నాడు.
అతనికి దుఖం గా ఉంది. కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి.
“ఏమయింది బాబూ?” పక్కనే ఉన్న సాధువు ప్రశ్నించాడు.
ఆ పిల్లాడు తన కాళ్ళ వయిపు చూయించాడు.
ఒక కాలికి బూటు ఉంది. రెండో కాలికి మేజోడు ఒకటే ఉంది.
సాధువు మొహం లో ఇంకా ప్రశ్న ఉంది.
“ఏమయింది .. బాబూ?” మళ్ళీ అదే ప్రశ్న.
“రైలు ఎక్కుతుంటే ఒక బూటు జారి ఫ్లాట్ ఫారం మీద పడింది.
దిగి తీసుకునే లోపు ట్రైన్ కదిలింది.”
“ఎవరో పిల్లాడు కిటికీ వైపు చేత్తో బూటు పట్టుకుని పరిగెట్టడం చూసానే..”సాధువు అన్నాడు.
“అవును. కాయలు అమ్మే అబ్బాయి. బూటు నా వైపు విసిరాడు. నేను క్యాచ్ చెయ్యలేక పోయాను.”
పిల్లాడి దుఖం ఎక్కువయింది.
“ఆ కాయలబ్బాయి కి అసలు చెప్పులే లేవు గమనించావా?”
“అవును. వాళ్లకి ఉండవు. “
పిల్లాడు మళ్ళీ విచారం లోకి వెళ్లి పోయాడు.
“నీకు ఇంకో జత చెప్పులు లేవా? “
“ఉన్నాయి. ఇంకో జత బూట్లు కూడా. కానీ ఇవి కొత్తవి”
మరెందుకు బాధ పడుతున్నావు?
ఖచ్చితంగా బాధ పడతాను.
ఈ రెండో బూటు అతనికి అందేలా విసరనందుకు.
No comments:
Post a Comment