నారాయణి దేవి కి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు.
రెండో కుమార్తె కుటుంభం పాటియాలా లో ఉంటుంది.
పెద్ద కుమారుడు బార్యా ముగ్గులు పిల్లలతో, చిన్న కుమారుడు బార్యా. కొడుకుతోను, విదవరాలయిన పెద్ద కుమార్తె తన 33 ఏండ్ల అవివాహిత కుమార్తె తో ఉమ్మడిగా మిద్దె మీది ఇంట్లో ఉంటారు.
గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మూడు స్వంత షాపుల్లో ఫ్లై వుడ్ వ్యాపారం నిర్వహిస్తుంటారు. బాగా ఖరీదయిన ప్రాంతం లో రద్దీ గా ఉండే చోట ఉన్న ఆ ప్రాపర్టీ వాళ్ళ స్వంతం.
ఎప్పుడో దశాబ్దం క్రితం చనిపోయిన తండ్రి సూచనల!! ప్రకారం వారి కుటుంబం నడుచు కుంటూ ఉంటుంది. అన్నీ ఆయన చెప్పిన ప్రకారమే జరుగుతుంది.
రెండో కొడుకు లలిత్ చురుకయినవాడు. అతని కి అనుకోని యాక్సిడెంట్ అవటం అతని గొంతు మూగ బోవటం దగ్గర ఈ కధ మొదలవుతుంది.
మనిషి మానసికంగా భాలహీనం అయ్యేది కష్టం వచ్చినప్పుడే. ఆతను వ్యాపార లావా దేవీలని కాగితం మీద వ్రాసి చూపించడం ద్వారా నిర్వహించేవాడు. అలా ప్రతి విషయం వ్రాయటం అతనికి అలవాటు అయ్యింది.
భగవంతుణ్ణి నమ్మటం. అతి విశ్వాసం. అందుబాటులో ఉన్న అన్ని మతాల నమ్మకాలని పాటించడం అతనితో పాటు అతని కుటుంబం మొత్తం ఆచరించేది.
లలిత్ ఏ దైవ అనుగ్రహమో కాని నోటి మాట వచ్చింది.
యావత్ కుటుంభం సంతోష పడింది. తల్లీ, అన్నా వదినా, అక్కా మేనకోడలు, కొడుకులు కూతుర్లు సంతోషం పట్టలేక పోయారు.
లలిత్ కొత్తగా మళ్ళీ వచ్చిన గొంతు తో “నాకు నాన్న కనిపించి మాట్లాడుతున్నాడు. ఆయనే నాకు మాట ఇచ్చాడు.”
అని చెప్పాడు. కుటుంబం సంతోషించింది.
“మా ఇద్దరినీ ప్లే వుడ్ వ్యాపారం చెయ్యమని చెప్పాడు.”
వ్యాపారం అభివ్రుది చెందాక ఆర్ధికంగా మరింత నిలదొక్కుకున్నాక లలిత్ మాటల మీద కుటుంబానికి విశ్వాసం పెరిగి పోయింది.
నాన్న రెండు రోజులు మౌనంగా ఉండమన్నాడు. ఎవ్వరితోను మాట్లాడ వద్దు అని చెప్పాడు.
వాళ్ళు పూర్తిగా అలాగే చేసారు. మనసా వాచా అదే ఆచరించారు.
వారి ఇంట్లో పూజలు, రక రకాల వ్రతాలు మొదలయ్యాయి.
‘నాన్న’ చెప్పినట్లే పిల్లలకి మంచి కళాశాలల్లో సీట్లు వచ్చాయి. వ్యాపారం పుంజుకుంది.
33 ఏండ్ల మేనకోడలి వివాహం నిశ్చయమయింది.
ఇక లలిత్ (నాన్న) చెప్పిందే వేదం. కుటుంబం మొత్తం గుప్పిట మూసింది. మర్రిచెట్టు ఊడల్లా వాళ్ళ విశ్వాసం మెదళ్ల లోకి బలంగా ఊడలయ్యింది.
&&&&&
మోక్షం అంటే? బంధాల నుండి విడిపోవటం. భగవంతునికి ప్రీతీ కలిగేలా జీవించి సహజ మార్గం లో ఆయన్ని చేరుకోవటం?
లేదా శ్రద్దగా, పరిపూర్ణ మయిన సమర్పణ భావం తో జీవితాన్ని అంకితం చేసుకోవటమా?
ఎప్పుడైతే జీవన భ్రాంతిలో పడి కర్మలు చేస్తున్నామో, వాటి ఫలాలు అనుభవించాల్సి వచ్చి మళ్ళీ మళ్ళీ జన్మలను పొందుతున్నాం..
ఈ కర్మ ఫలాలను అనుభవించటమే బంధం అంటే! ఈ జన్మ, కర్మల వలయంలో చిక్కుకోకుండా ఉండటమే మోక్షం అంటే.
.
అసలు ప్రాణం అంటే? 22 గ్రాముల మాయ?
ఎక్కడి నుండి వస్తుంది ఎటునుండి వెళుతుంది.
వచ్చినప్పుడు ఆహ్లాదంగా వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు ఎందుకు అలా కాదు.
పోతున్నప్పుడు సమర్పణ భావం తో పోగలిగితే అది మోక్షానికి దారి తీస్తుందా?
పోతున్న మార్గాన్ని చూడ కూడదా?
శారీరిక భాదని లక్ష పెట్టకూడదా?
అలా వీడ్కోలు పలికినన ప్రాణం తనతో పాటు ఆత్మ?!? ని తీసుకెల్తుందా? అక్కడ??
మోక్షం తో పాటు అనేక శక్తులని బహుమతులు గా ఇచ్చి పంపుతుందా?
తిరిగి భూమి మీదకి మాన జీవితం లోకి వచేస్తామా?
అలా వచ్చాక అంతా అనుకున్నట్లు జరుగుతుందా? భవిషత్తు తెలుస్తుందా? గమనాన్ని శాసిస్తామా?
అవును అనే చెబుతున్నాడు “నాన్న”
ఈ దైవ రహస్యాన్ని మూర్ఖుల తో పంచుకోకూడదు. ప్రస్తావించ కూడదు. ఈ సన్మార్గం లోని కి అందరికి ప్రవేశం లేదు.
ఇది నాన్న మనకి చూపిస్తున్న మార్గం. తోడుగా ఉండి మన ప్రయాణాన్ని సులువు చేయటానికి సిద్దంగా ఉన్నాడు
నాన్న దగ్గరకి వెళ్లి వద్దామా ?
&&&&
జూలై ఒకటి 2018
ఢిల్లీ లోని బురారి ప్రాంతం,
ఉదయాన్నే ఇంటింటికి పాలు సరఫరా చేసే వాన్ ఆ వీది మలుపులో ఆగింది. ఆ ఇంటి కింద ఉన్న షాప్ షట్టరు మూసి ఉంది. కుర్రాడు మేడ మీది ఉండే కస్టమర్ కోసం కాలింగ్ బెల్ నొక్కాడు.
ఎవరూ తొంగి చూడలేదు.
పాల పాకెట్లు తీసుకుని మెట్లు ఎక్కాడు.
11 కిటికీలు ఉన్న ఆ ఇంటి తలుపు లు బార్లా తెరిచే ఉన్నాయి. ఆశ్చర్యంగా అతను లోపలి తొంగి చూసాడు.
ముందు గది హాల్లో కి వేలుతురు రావటానికి స్లాబ్ సువ్వలకి కాంక్రీట్ వెయ్యకుండా ఉంచిన OTS (ఓపెన్ టు స్కై) నుండి ఉదయం వెలుగు ఆ గదిలోకి నేరుగా పడుతూ ఉంది.
మెత్తటి గుడ్డతో చుట్టిన వైరులకు వేలాడుతున్న మొత్తం 9 మంది శరీరాలు పూజ గది ముంది మరొకటి, లోపలిగదిలో మంచం మీద నారాయణీ దేవి తో పాటు మొత్తం 11 శరీరాలు వాటిలో పది వేలాడుతూ ...
క్షణాల్లో అందరూ పోగయ్యారు. పోలీసులు , మీడియా అంతా గుమి గూడారు.
క్లూస్ టీం ఇల్లంతా వెతికింది. డబ్బు నగలు అన్నీ క్షేమం.
అన్ని శరీరాలు ఒకే మాదిరిగా ఉన్నాయి.
కళ్ళకి గంతలు, వెనక్కి కట్టుకున్న చేతులు, నోటిలో తడి గుడ్డ, చెవుల్లో దూది.. ముఖాల్లో ప్రసాంతత. ఉమ్మడి ప్రయాణానికి ప్రయత్నపూర్వకంగా సిద్దమయినట్లు..
11 డైరీలు దొరికాయి. ఆ కుటుంబం లో ‘నాన్న’ చెప్పిన మాటలు వాస్తవాలు అవటం అనేక టెస్టిమోనియల్స్
లలిత్ (నాన్న) వ్రాసిన పుస్తకం లో ఎవరెవరు ఎక్కడెక్కడ వేలాడాలో స్కెచ్ గీసి ఉంది.
ఎవరు ఎటువైపు నిలబడాలో, ప్రయాణం లో ఎంత ప్రశాంతంగా ఉండాలో, ఎంత సమర్పణ తో ఉండాలో వ్రాసి ఉంది.
ఏ రంగు స్టూల్ మీద ఎవరెవరు నుంచోవాలో కూడా విపులంగా ఉంది. ఆరు రోజులు గా అందరూ సమిష్టిగా ఏర్పాట్లు చేసుకోవటం వీధి లో ఉన్న సి సి కెమెరాలలో రికార్డ్ అయి ఉంది.
ఇంటి వెనుక పరాయి స్థలం వైపు గోడ నుండి బయటకి బిగించిన 11 ప్లాస్టిక్ పైపులు, 11 డైరీలు, మేన కోడలి ఎంగేజ్మెంట్ అయ్యిన 11 వ రోజు ఈ సంఘటన జరగటం, మొత్తం ఏడుగురు స్త్రీలు (75,57,45,40,33,25,&23) నలుగురు పురుషులు (50,40,15 &) వెరసి 11 మంది అంతు పట్టని స్థితి లో మరణించి ఉండటం అన్నిటినీ క్రోడీకరించి మీడియా పరిశోధకులు, సమాజం మీదికి అపోహలని వదలటం ఇవన్నీ అప్పట్లో ఒక సంచలనం.
మన పోలిస్ యంత్రాంగం వాస్తవాలని పరిశోదించ కుండా, మీడియా మేధావులు బై పాస్ చేయటం లో సఫలీ కృతమైన ఒక నొక కేసు ఇది.
తొమ్మిది మంది వేలాడిన భగవాన్ కి రాస్తా ఈ ఫోటో లో కనిపించేది.
(పాటియాలా లో ఉండే సోదరి, ఆ పుస్తకం లోని వ్రాత తన అన్న లలిత్ ది కాదని, మరెవరో వ్రాసి ఉంటారని. చేతి వ్రాత లో అనేక మార్పు లు ఉన్నాయని, తమ కుటుంబం సంప్రదాయ మయిన హిందూ కుటుంబం అని, ఎలాటి క్రుద్ర శక్తులని పూజించే/నమ్మే వాళ్ళు కాదని. వారం క్రితమే తనూ కుటుంబం తో కలిసి కొన్ని రోజులు గడిపి వెళ్లానని, తమ ఫ్యామిలీ కి భిన్నమయిన అలవాట్లు జీవన విధానం ఏమీ లేదని, సమాజానికి క్షుద్రాన్ని అంటింది మీడియా వాళ్ళే అని మొత్తుకుని చెప్పింది. కాని ఆమె వాదన స్పైసీ గా లేదు కదా?.. నేను నమ్మట్లేదు. ఎందుకంటే నేను బుర్ర వాడటానికి ఇష్ట పడను కాబట్టి.. )
మరిన్ని వివరాలకి
తో పాటు మీకు కనిపిస్తాయి.