Monday 25 December 2017

క్రిష్టమస్ తాత

వృత్తి జీవితం లో కొన్ని శిఖరాలు ఉంటాయి. శిఖరాలు అంటే కేవలం అవార్డులు, ప్రమోషన్లు మాత్రమే కాదు.
ఒక విడో. చెప్పుకోలేని అనారోగ్యం.
ఒకటే కుమార్తె. ప్రభుత్వం ఇచ్చిన చిన్న స్థలం లో ఒక పూరిల్లు.
వారం లో నాలుగు రోజులు కూలి పని. ..
మూడు రోజులు ప్రభుత్వ దవాఖానా మందులు.
ఎవరి దయాదాక్షణ్యాలు అవసరం లేకుండా ఒక కేంద్ర ప్రభుత్వ పదకం లో ఒక ఇల్లు మంజూరు.
2011 జనాబా లెక్కల్లో పూరి పాకగా నమోదు కారణం గా..
ఇల్లయితే మంజురయింది కాని. కట్టుకోటానికి కనీస పెట్టుబడి లేదు..
కట్టుకునే ఓపికా లేదు.
ఒక అటో డ్రైవర్ ఆమె ఆరోగ్యంగా ఉన్నంతవరకు .. తోడుగా ఉన్నాడు.
ఆమె కి భవిషత్తు మీద ఒక నమ్మకం.
పిల్లని నవోదయా స్కూల్ లో చదివిస్తూ ఉంది.
చలికి, వానకి ఎవరు ఆమెని తమ పంచలో తలదాచుకోనివ్వరు.
సాకులు అనేకం.
కధ లో మలుపు ఏమిటంటే,,
ఆ లభ్దిదారురాలు నా జ్యురిడిక్షన్బ్ లోకి వస్తుంది. 
బ్యాంకు బుక్, మట్టిపని కార్డు, లాటివి జెనరేట్ చేయించి ఆన్లైన్ లో ఎలిజిబుల్ చేసి ఉంచాను. స్థానిక పరిచయాలు, పలుకుబడులు వాడి ఇల్లు గోడల వరకు కట్టించాను. ఇక నావల్ల అవలేదు.
ఇంటి మొత్తానికి సరిపడే డబ్బు ప్రభుత్వం ఇవ్వదు. అప్పటికే పద్దెనిమిది వేలు ఖర్చు చేసి ఉన్నాను.
ఒక వారం క్రితం ఆ గ్రామం వెళ్లి ఆమెతో మాట్లాడి ఇంటి కప్పు వేసుకొమ్మని చెప్పాను. ఆమె నవ్విందో లేదో కాని అసహాయత ని చూడటం నా వల్ల కాలేదు.
ఆమెకి కప్పు వేస్తే ముపై వేల రూపాయలు బిల్లు చెయ్యగలను.
ఆ డబ్బులు దేనికి సరిపోవు.
అవి కుడా ఇల్లు పూర్తి అయ్యాక విడుదల అవుతాయి.
కొన్ని చిన్న సంఘటనలు డ్రమెటిక్ గా ఉంటాయి.
నేను అక్కడ ఉన్నప్పుడే ఆమె కుమార్తె (8వ తరగతి) స్కూల్ నుండి ఫోన్ చేసింది. “చలికి ఎలా ఉన్నావు. స్కూల్ లో పడుకోరాదు. అంటూ.. తల్లిని పరమర్సించింది.
" క్రిస్టమస్ సెలవులకి తీసుకెళ్ళు అమ్మా అని అడిగింది”
“క్రిస్టమస్ కి వచ్చి నువ్వు నాతో పాటు చలిలో చావటం ఎందుకు. అక్కడే ఉండు” అని తల్లి చెబుతుంది.
అప్పుడా అమ్మాయి. “ అమ్మా క్రిస్టమస్ తాత వచ్చి మన ఇంటి కప్పు వేస్తే బావుంటుంది కదా?” ఆశగా అడిగింది.
చైనా ఫోన్ లో పెద్దగా వినబడుతుంది ఆ సంభాషణ.
నేను మా వర్క్ ఇన్స్పెక్టర్ బాలు నాయక్ అక్కడినుండి బయలు దేరాం.
**
ఇరవయ్యవ తేది న హైదరాబాదు లో ఉన్నప్పుడు,
మా బాలు నాయక్ ఆమె ఇంటి వద్ద నుండి ఫోన్ చేసాడు.
“సర్ చౌడమ్మ స్లాబ్ అయిపొయింది. మీరు ఇచ్చిన యాబై వేలలో ఆరున్నర వెయ్యి మిగిలాయి”

“ఒకే, సిమెంటు, ఇనుము సరిపోయిందా?”
“ఆరు 8mm సువ్వలు, నాలుగున్నర కట్ట సిమెంటు మిగిలింది. కంకర అర ట్రక్ ఉంది “
“వర్కర్స్ కి బోజనాలు ఎలా చేసావ్? “
“హోటల్ లో వండించాను. 1400 వందల్లో అయిపొయింది.’
“గుడ్ .. వచ్చాక మాట్లాడుకుందాం”
***
ఈ రోజు ఆ ఉరు వెళ్ళాను. బాలు నాయక్ ని వెంటబెట్టుకుని.
ఒక పీపా లో స్టోర్ చేసుకున్న నీళ్ళ తో స్లాబ్ తడుపుతూ ఉంది.
చౌడమ్మ చైనా ఫోన్ లో కూతురికి ఫోన్ చేసి మాట్లాడింది.
“క్రిస్టమస్ తాత వచ్చి మన ఇంటి కప్పు వేసాడు” మమ్మల్ని గమనిస్తూ చెప్పింది.
పిల్లని పండక్కి తీసుకురమ్మని చెప్పి కొంత డబ్బు ఇచ్చి వచ్చాను.
క్రిస్టమస్ శుభాకాంక్షలు. _/][\_

6 comments:

Rajeswari said...

🎅🙏🙏

Anonymous said...

Congratulations - at least there are some people with heart in this world. Yes Santa will be watching over you when you will be in need - if at all - one day.

Anonymous said...

Is is fact or fiction. Photos say it is real.. You are a good writer and have a good heart too.

Anonymous said...

You have good writing skills and good heart too

jyothi said...

keep it up. pl copy and paste the above anonymous comments.

sam said...

dear sir nice telugu blog and good telugu articles
Latest Telugu News

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...