కాలు పాకుడు రాళ్ళ మద్య జారి పోయింది.
తిరిగి తీసుకోవటం వీలవలేదు. రెండు రాళ్ళ మద్య ఇరుక్కు పోయింది. ప్రవాహం నడుం లోతు
దాటింది. వాగు దాటటానికి సాయం గా తెచ్చుకున్న కర్ర సగానికి విరిగి పోయింది. బలంగా
లాగిన కాలు మెలిపడి బయటకి వచ్చింది. క్షణాల్లో వాపు.
రెండడుగులు వేసే లోపు విపరీతమయిన నొప్పి..
ప్రవాహం పెరుగుతూ ఉంది. చలి వణికిస్తూ
ఉంది. చీకటి కమ్ముకుంటుంది.
శక్తినంతా కూడదీసుకుని మరి కొద్ది
అడుగులు ...
ఒకటి .. రెండూ... మూడు... నా... నాలుగు
... అయ్ .. అబ్బా..
రెండో కాలికి బలంగా చుట్టుకున్న తామర
తూడు..
వాగులోకి జారి పోయిన శరీరం..ఉదృతం గా
ప్రవహించే నీళ్ళు...
ఉహూ కష్టం.. ఇక నావల్ల కాదు.. ఎప్పుడో
నను వీడి పోయిన నాన్న గుర్తుకొచ్చాడు.
తెల్లటి పంచె.. చేతిలో బెత్తం.. “వాసూ”
అంటూ అదే పిలుపు..
నాన్నా.. ఇక నా వళ్ల కాదు. నేను
వస్తున్నాను... వచ్చేస్తున్నాను..
**
ఎక్కడినుండో వెలుగు ..
రెండు కళ్ళ నుండి ధారాళంగా... వెలుగు చూపు..
చాచిన చేతుల నుండి ప్రసరిస్తున్న వెచ్చటి
స్పర్శ...
నేర్పుగా విసిరిన పాశం
ఒడ్డుకి లాగిన బలమయిన చేతులు...
స్పృహ తప్పుతుంటే.. దగ్గరగా వచ్చిన పరిచయం
అయిన మొహం..
“సాయీ ... నువ్వే నా..”