“అర్జంటుగా ఇటు రండి” కేక వేసింది ఇంటావిడ.
హడావిడిగా వెళ్లి చూద్దును గదా రెండో ఫ్లోర్ బాల్కనీ లో ఉంది ఈవిడ
“ఏమయింది?”
వెనక అపార్ట్ మెంట్ చూపిస్తూ “ మూడో ఫ్లోర్ లో మీ ఫ్రెండ్ వెంకట్రావ్ ని చూడండి. నా కెందుకో అనుమానం గా ఉంది”
అప్పుడే గమనించాను. సాయంకాలం చీకటి మొదలవుతుంది.
వాడి ఫ్లాట్ లో వెనుక పోర్చ్ చివరి కొచ్చి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ముఖం లో విపరీతమయిన విసుగు.
మాట్లాడుతూ ఎదో ఎత్తు బల్ల ఎక్కాడు. అక్కడి నుండి కనీసం నలబై అడుగులు ఎత్తు. అక్కడి నుండి జారితే నేరుగా బయట అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ కి ఉన్న గేటు మీద నిలువుగా ఉన్న శూలాలు లాటి చువ్వలు మీదికి ..
“నా ఫోన్ తీసుకురా వాళ్ళ ఇంట్లో వాళ్లకి చెబుతాను .త్వరగా”
“ రేయ్ వెంకట్రావ్ .. ఏం చేస్తున్నావు?” పెద్దగా కేక పెట్టాను.
ఈ లోగా మా ఆవిడ ఫోన్ తెచ్చింది. వెంకట్రావు ఇంట్లో ల్యాండ్ నెంబరు కి ఫోన్ చేసాను. రింగ్ అవుతుంది.
“పాపం ఈ మద్య ఎవరో ఫైనాన్షియర్ మోసం చేశాట్ట.. ఎదిగిన ఆడపిల్ల ఉంది. ఏవో ఆర్ధిక సమస్యలు ఉన్నట్లు మొన్ననే చాకలమ్మాయి చెబుతుంది.” వెనక నుండి మా ఆవిడ ముక్కలు ముక్కలుగా చెబుతుంది.
“రేయ్. వెంకట్రావ్...” మళ్ళీ గొంతు పెగుల్చుకుని అరిచాను.
ఈ సారి వాడు నా వైపు చూసాడు. స్టూలు చివరికి వచ్చాడు. తనకి గోడకి మద్య అడుగు, అడుగున్నర మించి స్థలం లేదు.
ఫోన్ చెవి దగ్గర నుండి తీయకుండానే “ఏమిటి?” అన్నట్లు చూసాడు.
“రేయ్. తొందర పడకు... నీకు మేమున్నాం. నేను వస్తున్నాను. తొందర పడకు.” ల్యాండ్ లైన్ ఇంకా మోగుతూనే ఉంది. ఎవరూ లిఫ్ట్ చెయ్యలేదు.
ఒక్క నిమిషం ఫోన్ పక్కకి పట్టుకుని “అర్ధం కాలేదు” అని అరిచాడు.
చాలు. మాట్లాడితే చాలు ఇంకా వాడిని ఆపగలను.
"వెంకట్రావ్ ఆగు తొందర పడకు .. నీకు తోడుగా మేము ఉన్నాం. మన భాస్కర్ గాడు, శ్రీవాత్వవ మేమంతా ఉన్నాం .. కూర్చుని మాట్లాడదాం. తొందరపడకు..”
..
..
..
..
..
..
..
..
“మీది కూడా BSNL నెట్ వర్కేనా?” వెంకట్రావ్ పెద్దగా అరిచి అడిగాడు.
..
..
..
..
..
..
..
..
“మీది కూడా BSNL నెట్ వర్కేనా?” వెంకట్రావ్ పెద్దగా అరిచి అడిగాడు.