సన్నటి
త్రోవలో కొద్దిదూరం నడిచి వెళ్ళి కొత్తగా కట్టిన మిద్దె కి నైరుతి మూల ఉన్న మెట్లు
ఎక్కి తే మేము కొత్తగా కిరాయి కి తీసుకున్న రుము. చిన్నదే. కానీ సౌకర్యం గాను
ప్రశాంతం గాను ఉంటుంది.
దారిలో
ఒక వైపు ఉన్న చిన్న రేకుల రూము లో ఒక
పెద్దావిడ ఉంటుంది. తరువాత రెండు పాడుబడ్డ ఇల్లు వెనుక బాగం; ఆ తరువాత మా అతిది
గృహం.
మాకు
అనుచర గణానికి లోటు ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటూనే ఉంటారు. మా వృత్తి
అలాటిది. ప్రతి ఉదయం ఒక కుర్రాడు వాటర్ బబూల్ (త్రాగటానికి అవే) తెచ్చి ఇస్తూ ఉంటాడు. ఖాళీది తీసుకెళ్తాడు.
ఒక
రోజు ఆ కుర్రాడిని పెద్దావిడ ఆపి ఏదో
మాట్లాడటం మేడ మీది నుండి టీ తాగుతూ నేను గమనించాను.
“రెండు
చెంబులు నీళ్ళు వంచయ్యా.. బోరు నీళ్ళు
త్రాగి వళ్ళు నొప్పులు గా ఉంటున్నాయి” అని అడిగిందట. మా కుర్రాడు ససేమిరా కుదరదని
చెప్పాడట.
వారం
లో ఒక రోజు ఆవిడకి కూడా ఒక బబూల్ నీళ్ళు తెప్పించి ఇవ్వటం మొదలెట్టాను.
ఆ
తర్వాత ఆ పెద్దావిడని తీరిగ్గా గమనించడం మొదలెట్టాను.
పెద్ద
వయసు కానీ ‘కాయ కష్టం’ చేసినావిడ. చిన్న పాటి ఇనప రేకుల కప్పు ఉన్న గదిలో స్వంతం గా వంట చేసుకుని తింటూ కాలం
గడుపుతుంది. పక్కనే ఒక చిన్న పాక లో నులక మంచం వాల్చి ఉంచుతుంది.
బబూల్
వ్యవహారం పూర్తి అయ్యాక తానే ఒక రోజు పలకరించింది. “ మోటారు బండి ఈ పాకలో
పెట్టుకొయ్యా . వానకి తడవకుండా ఉంటుంది.” అంది.
ఆ పూట నులక మంచం ఎత్తి గోడ వారగా
పెట్టి ఉంది.
“సరే
..మామ్మా” నేను కూడా సమాదానంగా చెప్పాను.
ఒకసారి
పొద్దు పోయాక ఇంటికి వస్తుంటే.. పెద్దావిడ బయట మంచం మీద కూర్చుని పమిట చెంగుతో
దోమలు విసురుకుంటూ కూర్చుని ఉంది. “మామ్మా ఇంట్లో ఫాను కింద కూర్చో కూడదూ ?” అని
అడుగుదామనుకున్నాను.
గదిలో
ఛార్జింగ్ లైటు వెలుగుతూ ఉంది. కరెంటు పోయినట్లుంది.
“దోమలు
రాకుండా ఉంటాయని ఈ నిమ్మ మొక్కలు తెచ్చి పెట్టానయ్యా.. కానీ వీటి బెడద
తప్పట్లేదు”. అంది పలకరింపుగా.
“పెద్దావిడ చూడండి ఎవరో దోమలు రావని చెప్పారట
ఎన్ని నిమ్మ మొక్కలు తెచ్చి గోడ వారగా పెట్టిందో” మా ఆవిడ నాతో అదే రోజు ఉదయం అంది.
నేనేం
మాట్లాడలేదు.
కొద్ది
సేపు తర్వాత “ అటు నుండి నడిచేటప్పుడు ముళ్ళు గుచ్చు కుంటున్నాయా?” అడి గాను.
***
ఆమె
చుట్టూ నలుగురు కొడుకులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. “ఓపిక ఉండి
వండుకుంటే సరి. లేనప్పుడు ఏదో ఒక కొడుకు దగ్గరకి పోయి గిన్నె లో కొంచెం పచ్చడో..
కూరో తెచ్చుకుంటుందట.” అంది మా ఆవిడ ఒక
రోజు.
“ఆమె పని ఉత్తమం. నలుగురు కొడుకులు కోడళ్ళు చుట్టూతా ఉన్నారు. చక్కగా
అందర్నీ చూసుకుంటూ శేష జీవితం గడిపేయ్యొచ్చు” మళ్ళీ తానే చెప్పింది.
నేను
నవ్వేసి ఊరుకున్నాను.
“నీకు
చాలా సార్లు చెప్పాను. కొన్ని విషయాల గురించి ఎక్కువ ఆలోచించ వద్దని. “
“ఏం? ఇప్పుడెమయిందట?”
“ముసలావిడ
ఉండే రూముకి కరెంటు గాని ఒక ఫాన్ గాని లేదు. నలుగురు కోడళ్ళు ఎవరి ఇంటి నుండి కరెంటు
ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. ఆవిడకి ఒక చిన్న వెలుతురు బల్బు, ఒక ఫాన్ ఉంటే బావుంటుంది”
తను
నోరు తెరుచుకుని నన్నే చూస్తూ ఉంది పోయింది. నిమ్మ మొక్కల ముళ్ళు ఆవిడ కి గుచ్చుకుని
ఉంటుంది.
17/09/17