Thursday, 10 November 2016

41. ఉహించినట్లే.. ఆమె.


నా పరిస్థితి కుడితి లో ఎలుక మాదిరి అయ్యింది. 
ఈ ఉద్యోగం చేరను అంటే నాన్న ఎగిరి తన్నేట్టు ఉన్నాడు. అక్కడ ‘పహాడీ షరీఫ్’ లో ఎన్నో భాద్యతలు ఉన్నాయి. 
ఒక వారం తర్వాత జాయిన్ అవోచ్చా? అని నేను ఆఫీసులో అడిగాను.
" చేరొచ్చు ఒక్క సారి మద్దిపాడు AE గారికి కనబడండి. మీకు ఇచ్చిన సంతనూతలపాడు వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టు ఆయన పరిది లోకి వస్తుంది" అని చెప్పారు.
అతని పేరు అడిగాను. “మెతుకు రమేశ్ “ అని చెప్పారు.
అతని కేరాఫ్ టి కొట్టు వద్ద, రింగులు తిరిగిన నల్లటి జుట్టు మీసాలతో గుండ్రంగా ఉన్న అతన్ని కలిసాను. సి ఏం గారిని బంట్రోతు కలిసినట్లు ఉంది అతని వ్యవహారం.
అతనికి విషయం చెప్పాను. చేస్తున్న ఉద్యోగం లో చార్జెస్ అప్పగించి వస్తానని వారం వ్యవది కావాలని.
“వీలయినంత త్వరగా జాయిన్ అవ్వమని “ ఆతను చెప్పాడు. రాజ్ దూత్ బండి మిద వెళ్ళిపోయాడు.
నేను అదే రాత్రి హైదరాబాదు వెళ్లి పోయాను. అమ్మ చేత ఉతికించు కోవటానికి వస్తూ తెచ్చుకున్న బట్టలు ఇంటివద్దే వదిలేసాను.
వెళ్ళగానే కన్నడ శ్రీనివాస్ తోను, మణి మారిన్ తోను విషయం చెప్పాను. ఇద్దరు వెళ్లి పొమ్మనే చప్పారు.
మణి మారిన్ మాత్రం ఒక సౌది లో ఒక ఉద్యోగ అవకాశం గురించి చెప్పాడు, ఒక గ్లోబల్ కంట్రాక్టర్ వద్ద సైట్ ఇంజనీరు పని పద మూడు వందల రియాల్స్ జీతం (13.5 రూపాయలు ఒక రియాల్)
నేను ఒంగోలు వెళ్ళిన వారం రోజుల్లో నా తరఫున కుడా తనే అప్లై చేసానని దానికి వెళ్తే జాబు లో గ్రోత్ ఉంటుందని చెప్పాడు.
“చాయస్ నీదే” అన్నాడు. నేను మళ్ళి ఆలోచనలో పడ్డాను.
రోట్లో పచ్చడి, ఆకాశం లో పిట్ట?? ఏది??
పచ్చడే గెలిసింది. ఈశ్వర మణి గారిని కలిసి ఉద్యోగం మానుకోబోతున్న విషయం చెప్పాను.
అయన నన్ను ‘దోడ్డప్ప’ గారి వద్దకు తీసుకెళ్ళాడు. “ఇక్కడ వర్క్ అయిపోతుందని మీకు పని ఉండదని అనుకోవద్దు. శరవణ కన్స్ట్రక్షన్స్ లో మీరు రెగ్యులర్ ఉద్యోగి” అని నచ్చ చెప్పారు.
నేను నెపం మా నాన్న మిద, అమ్మ మిద వేసాను.
ఒక్క సారి నేను వెళ్ళటం ఖాయం అని తెలిసాక, MECON సర్టిఫికెట్లు పని మొదలయింది. కేబుల్ చానెల్ వర్క్ కి సంభందించి చాలా వాటికి ముందస్తు చెక్ మెజర్మెంట్ కాగితాలు మిద సంతకాలు అవలేదు.
నేను ఫీల్డ్ మానేసి ఆఫీసులో కుర్చుని, నేను రోజు వారి పుస్తకం లో నమోదు చేసుకున్న వివరాలు చూసుకుంటూ ఆ కాగితాలు తయారు చేయటం లో బిజీగా ఉండి పోయాను.
లాల్ జి “కంగారు లేదు. మీ వాళ్లకి జలక్ ఇస్తాను. ప్రశాంతం గా చెయ్యి, తప్పులు దొర్లకుండా చూడు. అన్నిటి మీదా సైన్ చేస్తాను. నీకు మంచి ట్రీట్ ఇస్తాను. కంపెని జీప్ లో హిమాయత్ నగర్ రా “ భరోసా ఇచ్చాడు.
నేను ఉద్యోగం వదిలి వెళ్తున్న విషయం సవారి కి తెలిసింది. బార్యా బర్తలిద్దరు నా క్వార్టర్స్ వద్దకి వచ్చారు. సంతోషం, దుఖం కలగలసిన క్షణాలు అవి. సవారి, నేను ఆ ఆర్నెల్లలో ఎంతో అనుబంధం పోగుసుకున్నాం. అతన్ని వదలి వెళ్లి పోవటానికి చాలా బాధ అనిపించింది. నా లజేజి అంతా శుభ్రం చేసి నా సూట్ సేసు లో సర్దారు. నా వద్ద మిగిలి ఉన్న డబ్బులోంచి రెండు వంద కాగితాలు సవారి భార్య కి ఇచ్చాను. ‘పిల్లలకి ఏమయినా కొనండి.’ అని.
ఆ రాత్రి బోజనాలయి నిద్రకి సిద్దమవుతుంటే .. మణి మారిన్ లోపలి వచ్చాడు “ రావ్. See ..some lady came to see you” అన్నాడు.
నేను టక్కున లేసి వరండా లోకి వచ్చాను. నేను ఉహించినట్టు గానే ఆమె .......

#33 Grade

No comments: