Saturday, 28 November 2015

హైర్ కట్ -32

అలసిన సాయంత్రాలు కి ఆటవిడుపుగా TV లో వచ్చే బునియాద్ , బంకేష్ బక్షి లాటి సిరియల్స్ దురదర్శన్ ప్రైమ్ టైమ్ లో ఇరగదేసేవి. నా రూములో మంచం మళ్ళీ మళ్ళీ విరిగిపోయేది. మంచం విషయం ఏ‌ఓ ఆదినారాయణ గారితో చెప్పటం , ఆయన నన్ను ఎగాదిగా చూడటం ఎండుకని నేలమీద చాప వేసుకుని పడుకోవటం మొదలెట్టాను. .
పగలంతా పని చేసి ఒక్క ముద్ద తిని పడుకుంటే ప్రాణం ఎటో వెళ్ళి పోయేది.
..
ఎంత టోపీ వాడినా, తలంతా సిమెంటు /దుమ్ముతో నిండి పోయేది. రోజు చన్నీళ్లతో తల స్నానం చెయ్యటం లేదా ఓక్కోసారి చేయటానికి బద్దకించడం వల్ల జుట్టు రాలటం మొదలెట్టింది. 
..
యూనిట్ 1010 పని సాగుతూనే ఉంది. ఒక వైపు నుండి ప్రీ కాస్ట్ చేసిన మూతల తో కేబుల్ చానెల్ మూసి వేసి రెండు వైపులా మట్టి ని మిగిలిన గాడిలో పొయ్యటం సరయిన రీతిలో క్యూరింగ్ లాటివి చెయ్యటం జరుగుతుందేవి. సబ్ స్టేషన్స్ ని కలిపేటప్పుడు మాత్రం వర్క్ కొంత భిన్నంగా ఉండేది అక్కడ కొంత ఎక్కువ పర్యవేక్షణ అవసరం అయ్యేది. 
..
అనుకోకుండా సవ్యంగా సాగిపోయే పనిలో మరో ఇబ్బంది ఎదురొచ్చింది. యూనిట్1010 వర్క్ రెండు పూర్తి కావస్తున్న బిల్డింగ్ ల మధ్యగా వెళ్లాల్సి వచ్చింది. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు కానీ. యర్త్ వర్క్ చేసేటప్పుడు ఒక పెద్ద కొండ రాయి అడ్డుగా వచ్చింది. మాన్యువల్ గా పలగలకొట్టించడం వీలవనిది. బ్లాస్టింగ్ చేయటానికి రెండువైపులా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న బిల్డింగ్స్ (కిటికీలకి అద్దాల బిగింపు జరిగి ఉంది.) మీద బ్లాస్టింగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
అనేక చర్చల తర్వాత ‘కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేయాలని, అది ఒక ఆదివారం చేస్తామని మేకన్ వాళ్ళకి చెప్పాం. 
..
కంపెనీ లో మరో గొప్ప అలవాటు ఉండేది. సాయంత్రం 6 గంటల తర్వాత కాంక్రీట్ వర్క్ జరిగితే అదనపు బత్యం జీతం లో కలిపి ఇచ్చేవారు. ఆదివారాలు పని చేస్తే 100 రూపాయలు అదికంగా చెల్లించేవారు. 
..
రెండు నెలల కాలం లో సవారి నాకు అత్యంత ప్రియమయిన బంటు అయిపోయాడు. నేను నావద్ద రెగ్యులర్ గా పనిచేసే హమాలీలు సెలవు తీసుకున్న రోజు మస్టర్ వేసి కనీసం వారానికి రెండు కూలీలు(2x20రూ) అతనికి అదనంగా వచ్చే ఏర్పాటు చేస్తుండేవాడిని.
..
వాటర్ టాంక్ వర్క్ నేను టేక్ అప్ చేసినప్పుడు నేను పెట్టిన కండిషన్ నాతో బాటు సవారిని కూడా అక్కడికే తీసుకెళ్లి పని చేయించుకుంటానని. 
**
ఆరోజు ఉదయం మాకో విషయం తెలిసింది. ఎవరో ‘శరవణా ఇంజనీరు’ వర్కర్స్ కాలనీ వద్ద నెత్తురు గాయాలతో స్పృహతప్పి ఉన్నాడని. అప్పుడే మేము ఒక్కొకరం డ్యూటీ కి సిద్దం అవుతున్నాం. ఒక్క సారిగా ఎలా ఉన్న వాళ్ళం అలానే జీపు తీసుకుని బయలుదేరాం.
..
“హనుమంతప్ప ఎక్కడ ?” ఎవరో మరొకరిని అడుగుతున్నారు. 
..
కిలోమీటరు దూరం లోని వర్కర్స్ ఏరియాకి చేరం. తీరా చూస్తే కరుణాకర్ అనే మలయాళీ , బెల్ బాటమ్ ఫాంట్లు తప్ప మరోటి వెయ్యడు. ఎక్కడో జరిగిన బ్లాసింగ్ రాయి వచ్చి అతని నుదుటిని తాకింది. రక్తం కారిపోతూ ఉంది అతను కళ్ళు తేలేశాడు. 
అందరికీ కంగారు మొదలయ్యింది. 
మా సుపర్వైజర్ ఎవరో ఆఫీసు నుండి ఈశ్వరమణీ ఇంటికి ఫోన్ చేశారు. పదంటే పని నిమిషాలలో నైట్ ఫాంటు తో నే యెజ్ది బండి మీద ఒక RMP ని వెంటబెట్టుకుని ఆయన వచ్చాడు. 
..
వచ్చిన RMP ఫస్ట్ అయిడ్ చేశాక అతన్ని అదే జీపులో సిటీ కి పంపారు తోడుగా మరో మలయాళీ , ఒక స్థానిక సుపర్వైజర్ వెళ్లారు. ఈశ్వరమణీ డబ్బు ఇచ్చి పంపారు.
మాతో ఉన్న ఒక అటెండెంట్ ని చడామడా తిట్టటం మొదలెట్టాడు. 
..
“ హైర్ కట్ చేయించుకొటానికి ఇంజనీర్లు వర్కర్స్ కాలానికి వెళ్లాలా? ఇంక వీళ్ళ మాట వాళ్లెం వింటారు ? వీళ్ళు వాళ్ళ చేత ఏమి పని చేయిస్తారు. పోయి బార్బర్ ని ఇక్కడి కి పిలుచుకు రాలేవా ?ఇక నుండి వీళ్ళు అక్కడి కి వెళ్లారని తెలిస్తే ఊరుకొను “ అంటూ..
..
కనుణాకరన్ అక్కడికి పొద్దుటే ఎందుకు వెళ్లాడో , 
హనుమంతప్పతో పాటు ఈశ్వరమణీ గారికి కూడా తెలుసని మా అందరికీ తెలుసు. 
మా అందరి మర్యాద కాపాడటానికి ఆయన అలా మాట్లాడాడని అర్ధమయింది.
‘ఈశ్వరమణి’ అంటే గౌరవం కలగటానికి అదో కారణం.
#33grade

No comments: