Friday, 27 November 2015

పెరిగిన జీతం -31మా రూములో టి‌వి అయినా తీసేయాలి లేదా నా మిత్రులు నా మంచం మీద కూర్చోటం అయినా ఆపేయాలి.  పైగా టీవి చూస్తూ  తిన్న బజ్జి పోట్లాలు మా రూము ఒక మూల లో  ఉన్న అట్టపెట్టే దస్ట్ బిన్ లో వేసి వెళ్తారు. ఎప్పుడో వారానికి ఒకసారిమేము కేకలేస్తే గాని పనావిడ అట్ట పెట్టె లోని చెత్త బయట వెయ్యదు. మంచం తో పాటు కొన్ని కుర్చీలు కూడా కొంటె కానీ సమస్య తీరదు.
“టి‌వి చూసేటప్పుడు అందరం కూర్చుని, బరువుకి వంగి విరిగి పోయింది.” చెప్పాను.
ఆ రోజు ఒక వెల్డర్ వచ్చి దానికి మరో రాడ్డు ముక్క వేసి వెల్డింగ్ చేసివెళ్ళాడు. రూమ్ అటెండెంట్లు  మళ్ళీ నవారు అల్లారు .
**
యూనిట్ 1010 గాడిలో పడగానే నాకు మరో వర్క్ అదనంగా కేటాయించారు.
మూడు బార్ గ్లాసులు మూడు ఎత్తుల్లో నిలబెట్టినట్టు మూడు పిల్లర్ల మీద నిర్మాణం అది. ఒకటి డ్రింకింగ్ వాటర్ కి మరోటి, ఇండస్ట్రియల్ యుటిలిటీ కి, మరోటి క్వార్తెర్స్ కనెక్టివిటీ కి . చాలా అద్బుతమయిన డిజైన్. అన్నిటి కంటే ఎక్కువ ఎత్తు ఉన్న బార్ గ్లాస్ టాంక్ టాప్ నేల నుండి 58 మీటర్ల ఎత్తులో ఉంటుంది. (ఛార్మినార్ ఎత్తు 56 మీటర్లు )

మూడు మొఖాలు కలిగిన మూడు పిల్లర్లు అక్కడక్కడా బ్రేసెస్ తో కనెక్ట్ అవుతూ నిర్మాణం పైకి వెళ్లింది. క్రింద బాగాన నేలలో ఏర్పాటు చేసిన పెద్ద వాటర్ టాంక్, చుట్టూ ఆక్రో షా అనే కంపెనీ స్కేఫోల్డింగ్ ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. దాదాపు మొదటి బాటమ్  శ్లాబ్ దశలో ఉంది. ఆ యూనిట్ చూసే AE జాబ్ ఒదిలి వెళ్ళటం తో నా స్థాయికి  మించిన వర్క్ అయినప్పటికి నాకు కేటాయించడం జరిగింది. లక్కీ ఏమిటంటే దానికి కూడా ఇంచార్జ్ లాల్ జీ నే J గమ్మత్తుగా లాల్ జి అడ్డం తిరిగాడు. ఒక JE తో ఎలా వాటర్ టాంక్ చేయిస్తారు. పైగా QHPC (Quick Hardening Portland Cement) వాడ బోతున్నాం. సీనియర్ ఇంజనీరు ని నియమించండి . గట్టిగా చెప్పడతను.  

“ఓ సెవెన్ ఫిఫ్టీ వాలా క్యా కరేగా? కోయి నౌ సౌ వాలేకో లగాలో “  (AE లకి జీతం 900)
రెండు రోజులు చర్చల తర్వాత నా నెల  జీతం 900 కి పెరిగింది. లాల్ జి ఎత్తుగడ ఫలించింది.
ఒక నిలువయిన లిఫ్ట్ కాంక్రీట్ అందాకా తీసుకళ్ళటానికి బిగించి ఉంది. నేనా వర్క్ తీసుకునే సరికి గ్లాస్ లాటి షేప్ బాటమ్ షట్టరింగ్ వర్క్ జరుగుతుంది. లాల్ జి , నేను ఈశ్వరమణీ  గారు లిఫ్ట్ లో పైకి వెళ్ళాం . ఇనుప స్కాఫోల్డింగ్ పైన అడ్డంగా చక్కలు వేసి ఉంచారు. తలకి సేఫ్టీ టోపీ నడుము నుండి స్టీల్ పోస్ట్ కి హుక్ చేసిన సేఫ్టీ బెల్ట్ వేసుకున్నాం.

బాటం అర్ధచంద్రాకారం లో షట్టరింగ్ చేయటానికి శ్రమిస్తున్నారు.  ఇద్దరు ముగ్గురు వెల్దేర్స్ షేప్ కి అనుగుణంగా  ఐరన్ యాంగిల్స్ , వాటికి మందపాటి రేకులు కట్ చేసి వెల్డింగ్ చేస్తున్నారు. చాలా సంక్లిష్టమయిన పని అది.
అంత ఎత్తు నుండి ఒక్కసారి క్రిందకి చూస్తే కళ్ళు తిరిగినట్లు అనిపించింది. కింద నున్న పెద్ద వాటర్ టాంక్ పై నుండి చూస్తే చిన్న నీటి తొట్టిలాగా అనిపించింది.
బాటమ్ శ్లాబ్ వర్తులాకారం లో చేయాల్సి రావటం తో లోపల పక్క షట్టరింగ్ చేసే అవకాశం లేదు. కాంక్రీట్ వెయ్యటం, వైబ్రెట్ చెయ్యటం కావల్సిన షేప్ లోకి సరిచేయటం మూడు ఒకే సారి జరగాలి. వర్కర్లు , మేము , మేకాన్న్ వాళ్ళు అందరి సమీష్టి ఆర్గనైజేషన్ తో ముడిబడిన వ్యవహారం. బాటమ్ షేపు ఒక మట్టానికి వచ్చే వరకు QHPC వాడాలని మెకోన్ వాళ్ళ నిర్ణయం .
కొన్ని  సాంకేతిక విషయాలు ఈ పేరా లో చెబుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకొండి.
సహజంగా తయారయ్యాక సెల్లాస్ లో నిలవ ఉంచే సిమెంట్ లారీ లోకి లోడ్ అయ్యేటప్పుడు మాత్రమే దానిని దృడపరిచేందుకు అవసరమయిన జిప్సం లాటి పదార్ధాలని కలిపి లోడ్ చేస్తారు. ప్రధానంగా సిమెంట్ గట్టిపడటం అనేది జిప్సం రేషియో ని బట్టి ఉంటుంది. (అప్పట్లో 43 grade/53 grade సిమెంట్లు లేవు) QHPC లో అది మరి ఎక్కువ పరిమాణం లో ఉంటుంది. మిక్సర్ లోనుండి బయటకి వచ్చిన రెండు నుండి 5 నిమిషాల్లో నే ఇది గట్టి పడుతుంది. (ఇనీషియల్ సెట్టింగ్ టైమ్ అంటాం సాంకేతికంగా) అండర్ వాటర్ వర్క్స్ కి ఎక్కువగా వాడుతుంటామ్ దీనిని. మిల్లర్ లోంచి లిఫ్ట్ చేసి అచ్చులోకి పోయటం లేటయితే లిఫ్ట్ టబ్ లోనే కాంక్రీట్  గట్టిపడే ప్రమాదం ఉంది.
మేజర్ కాంక్రీటింగ్ జరిగేటప్పుడు ఆడా మగా తేడా లేకుండా శ్రమిస్తుంటారు, రాత్రింబగల్ల తేడా ఉండదు కింద ఉన్న సుపర్వైజర్ లు ఏమాత్రం పని సిక్ అవకుండా వర్కర్స్ ని మారుస్తుంటారు. పని పూర్తి అయ్యి సైట్ ఇంజనీరు చెప్పిందాకా టైమ్ అనేది ఎవరు చూడరు. చుట్టూ ఫ్లడ్ లైట్స్ వెలుగుతూ రాత్రిం పగళ్ళ తేడా తెలియనివ్వవు. ఒక పక్క ఆపి ఉంచిన టెంపోలో బస్తాలు (సారాయి), బన్నులు సిద్దంగా ఉంటాయి. కూలీలు బస్తానీ తీసుకుని చేతితో చాకచక్యంగా వత్తుతారు. ఒక్క చుక్క కూడా వృదా కాకుండా అది టాప్ మని తెరుచుకుంటుంది. ఒక్క గుటకలో దాన్ని మింగి  బ్రెడ్ ని నోట్లో కుక్కుకుని మళ్ళీ పనిలోకి దిగుతారు.  ఇదంతా ఒక వ్యవస్థ  ..
#33grade
Post a Comment