Tuesday, 24 November 2015

సవారి -28


ప్రతి సోమవారం  పని ప్రారంభం అయ్యే లోపు ఒక చిన్న రివ్యూ లాటిది జరిగేది. వర్క్స్ ఇంచార్జ్ ఈశ్వరమణి నిర్వహణలో.
అయిదుభాషలు అనర్గళంగా మాట్లాడి , ఎలాటి డ్రాయింగ్ నయినా చూసి సునాయాసంగా  మా సందేహాలు తీర్చగల 4 అడుగుల 10 అంగుళాల  ఈశ్వరమణీ యైత్ క్లాస్ డ్రాప్ ఔట్ అంటే నమ్మటం చాలా కష్టం. Experience makes a man perfect కి సరయిన ఉదాహరణ .
ఆ వారం ఏమేం పనులు చెయ్యాలో , గత వారం చేసిన బిల్ల్స్ లో లోపాలు (కొంతమంది చిన్న మేస్త్రీలతో కుమ్మక్కయి ఎక్కువ యూనిట్లకి బిల్ చేసి తరువాత సొమ్ము చెరికాస్తా పంచుకుంటారట) లాటి వి బ్రీఫ్ గా మాట్లాడతాడు ఆయన.
నా వైపు తిరిగి మిస్టర్ రావు యువర్ హనీమూన్ పీరియడ్ ఓవర్. ఎందాకా వచ్చింది. మీ యూనిట్ 1010 అన్నాడు.
నేను బిత్తర పోయాను. జరిగింది చెప్పాను. వాళ్ళు అలానే అంటారు. మీరు వర్క్ మొదలెట్టండి. ఉన్న గ్రౌండ్ నుండి ఆరు అడుగులు తవ్వుకుంటూ పొండి . మద్యాహ్నం JCB

(బ్రిటిష్ మల్టీ నేషనల్ కార్పొరేషన్, UK వారి J.C. Bamford Excavators Limited అనే కంపనీ తయారు చేసే ఎస్కవేటర్ మెషీన్ , వాడుక బాషలో మనం JCB అని వినియోగించేది కంపెనీ పేరు. నిజానికి దానిని యస్కవేటర్ మెషీన్ అనాలి )  వస్తుంది మార్కింగ్ అయిపోవాలి ఈ పుట అన్నాడు.
వేడి మొదలయ్యింది. నేను అరగంట తర్వాత లాల్ జి తో సమావేశమయ్యాను. లాల్ జి అప్పటికే ఓరల్ గా అనుమతి SE గారి నుండి తీసుకుని ఉన్నాడు. నేను ఇవన్నీ చెప్పకుండా  ఈరోజు వర్క్ మొదలెడదాం అన్నాను. అతను నవ్వి షురూ కరో యార్. కూచ్ నహి బిగడ్తా అన్నాడు
నేను మైన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాక కొద్ది సేపటికి, మా సుపర్వైజర్ నారాయణ ఒక నడి వయసు  స్వామీజీ ని తన బండి మీద తీసుకువచ్చి సర్వే పరికరాలతో సహా దించాడు. మీకు ఒక మంచి వర్కర్ ని ఇస్తానని చెప్పానుగా ?” అన్నాడు నన్ను చూస్తూ.. అవును ఏడి ?  అన్నాను.
“ఇతనే ఆతను’’. అన్నాడు ఆ స్వామీజీ లాగా ఉన్నతన్ని చూపిస్తూ .
తల మీద జుట్టు, గడ్డం బాగా పెరిగి , పోషణ లేనందున ఉండలు కట్టి ఉన్న అతడిని చూసి
 ఇ  త  నా “  అనబోయి తమాయించుకున్నాను.
ఏమి పేరు ? ..      సవారి  

“స వా రా ? అలాటి పేరు ఇదే వినటం
నేను ఒక సారి ప్లాన్ అంతా కూలంకుషంగా చూసి ఉన్నాను కాబట్టి . ఒక అర  కిలో మీటరు మేర సెంటర్ లైన్ మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాను.
“ సవారి .. చాలా వింతగా అనిపించాడు. డంపీ లెవెల్ మోయటం నుండి సర్వే సిగ్నల్స్ నేర్చుకోవటం తెచ్చుకున్న కత్తి తో చెట్లు  నరికి గాతాలు వేసి మేకులు పాతటం. వాటికి తాడు కట్టి ముగ్గు పోయటం అతను చక చకా చేస్తుంటే ఆశ్చర్య పోవటం నా వంతు అయింది. కొద్ది సేపటికే నేనేమీ చెప్పే అవసరం లేకుండా అతను అల్లుకు పోయాడు. తీరా JCB వచ్చి మట్టి తవ్వకం మొదలెట్టేసరికి సాయంత్రం అయింది. ఉదయం సైటు కొచ్చే సరికి కొంత భాగం పూర్తి చేస్తానని JCB డ్రైవర్ నాతో చెప్పాడు.
రాత్రి మెస్ లో బోజనం చేస్తుంటే  సుపర్వైజర్ నారాయణ అడిగాడు ఏమేమి మెటేయల్స్ కావాలి అని
నాకు అవసరం అయినవి నేను చెప్పాను .
బోజనం అయ్యాక కొలిగ్స్ అందరూ మా రూము లో చేరారు. తఃకీకత్ అని ఒక అపరాధ పరిశోదన సీరియల్ చూడటం కోసం.

టి‌వి ఎదురుగా ఉన్న నా మంచం మీద నలుగురు అయిదుగురు కూర్చున్నారు. అన్నీ రూముల్లో ఉన్న ఫోల్డింగ్ ఇనుప కుర్చీలు తేప్పించుకుని మిగిలిన వాళ్ళు సర్దుకు కూర్చున్నారు.
మా వద్ద అటెండెంట్ గా ఉన్న పిల్లాడిని డబ్బులిచ్చి వర్కర్స్  కలానికి పంపారు. అక్కడ బస్తాల (?)’ కొట్టు పక్కన తయారయ్యే వేడి వేడి మిరపకాయ  బజ్జీలు తెప్పించారు. అవి తింటూ సరదాగా జోకులు వేసుకుంటూ అందరం బ్లాక్ & వైట్ టీవి చూడ సాగాము. మా అందరిలో హనుమంతప్ప అనే కళ్ళజోడు పెట్టుకునే ఏ‌ఈ లేకపోవటం నేను గమనించాను.
“వేర్ ఈజ్ హనుమంతప్ప?” కన్నడ శ్రీనివాస్ ని అడిగాను.
అతను నవ్వి “ ఈవెనింగ్స్ హి ఈజ్ బిజీ యార్. ఓ నహి మిల్తా “ అని నవ్వాడు.

మా మాటలు విన్న మిగిలిన వాళ్ళు కూడా సన్నగా నవ్వటం నేను గమనించాను. 

No comments: