Sunday, 22 November 2015

నన్న మగనే .. యు మూవ్డ్ మీ -27


మేము నుంచున్న దగ్గర కుడివైపున ఫ్లాట్ ఫామ్ మీద అమ్ముతున్న బూట్లు చూసి ప్రాణం లేచి వచ్చింది. సండే షాపుల శలవు కనుక  ఎలా కొనటమా?  అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒక ప్లాస్టిక్ కారి బాగ్ కాలికి సాక్స్ లాగా వేసుకుని అక్కడున్న బూట్ల సైజు చూసుకుంటుంటే మణీమారెన్ దగ్గరకి వచ్చి  ఎక్కువ మందికి ఎడమకాలు పెద్దదిగా ఉంటుంది . ఆ కాలుకి కంఫర్ట్ గా ఉండే బూటు ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాడు. నేను అతని సలహాతో మంచి గా అనిపించిన ఒక జత బూట్లు 80 రూపాయల ధరలో కనుక్కున్నాను.
మేమంతా తిరిగి ఛార్మినార్ చేరేసరికి ఏడు అయింది. కంపెనీ జీపు సిద్దంగా ఉంది. మా సైట్ కి వచ్చేశాం .కొత్త మిత్రులతో అలా సరదాగా ఒక రోజు గడపటం చాలా ఆనందాన్నిచ్చింది. నాలుగేళ్ల వయసు తేడాతో అందరం ఒకే ఈడు వాళ్ళం. వివిద ప్రాంతాలు, బాషలు , సంస్కృతుల నుండి వచ్చి ఒక చోట పని చేస్తున్నాం.
అంధరం ఫ్రెష్ అయ్యాక , మెస్ లో  బోజనమ్ చేసి వచ్చాను. మిత్ర్హులు కొందరు ఒక రూములో చేరి అక్కడే బోజనమ్ చేస్తున్నట్లు ఉంది. ఇంతలో మా రూమ్మేట్ కన్నడ శ్రీనివాస్ వచ్చి ఒక కాగితం ఇచ్చాడు అతని చేతి రాత తో  రాసిన ఆరోజు ఖర్చు . మొత్తం ఆటోలకి , బోజనానికి , సినిమాకి కామన్ గా పెట్టిన ఖర్చు వివరాలు ఒక్కొక్కరి షేర్ ఎంతో రాసి  ఉంది. నేను నా వాటా నలబై చిల్లర ఇస్తూ .. “మీరు .. మీజీవితం లోని ఒక మేజర్ బాద నుండి బయట పడలేక పోతున్నారు “ అని చెప్పాను స్పష్టంగా.
అతను సూటిగా నా కళ్లలోకి చూసి .. “ ఏం చిలక జోస్యమా? “ అన్నాడు.
తరువాత అతను వాళ్ళందరూ ఉన్న రూములోకి వెళ్ళి పోయాడు. ఆ రోజు tv చూడటానికి ఎవరూ రాలేదు. నేను కొద్ది సేపు చూసి తర్వాత నిద్ర పోయాను..
అర్ధరాత్రి ఏదో శబ్దానికి నాకు మెళుకువ వచ్చింది. దుప్పటి కప్పుకుని బొల్ల పడుకుని ఘాడ నిద్రలో ఉన్నాను.

సన్నటి ఏడుపు, శబ్దం అది. నేను చటుక్కున లేచాను .
పక్క మంచం మీద కన్నడ శ్రీనివాస్ మౌనంగా  కూర్చుని ఉన్నాడు. చాలా సేపటి నుండి అతనలాగే కూర్చుని ఉన్నట్టు ఆ భంగిమ చెబుతుంది. సన్నగా ఏడుస్తున్నట్టు నాకు అర్ధం అయ్యింది.
నేను లేవటం గమనించి “నన్న మగనే.. నన్ను కదిలించావు “ అన్నాడు.
నేను గమ్మున ఉండి పోయాను
ఎప్పటినుండో ముసుగేసిన దుఖం అతడిని కలియబెట్టింది.
అతను తనలో తానే మాట్లాడు కుంటున్నట్లు చెప్పటం మొదలెట్టాడు.
US లో MS చేరాను. చదువు మధ్యలో అమ్మకి బాలేదని తెలిసింది . ఒక్కడినే అవటంతో అమ్మ కి నా అవసరం బాగా ఉందని అర్ధమయింది. అక్కడ ఉండలేక మానుకుని వచ్చేశాను . వచ్చిన నెల రోజులకే ... అమ్మ ..”  అతను పూర్తిగా చెప్పలేక పోయాడు. చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు.

నేను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. అతను ఏడవటం చాలా అవసరం అని మాత్రం నాకు తెలుసు.

ఆరాత్రి మేమెప్పుడు నిధ్రపోయామే గుర్తులేదు. 

No comments: