Monday 25 December 2017

శారదా దేవి.


రామకృష్ణ పరమహంస శరీరం విడిచారు.
ఆయన బార్య అనేక సంవత్సరాలు గా వస్తున్న ఆనవాయితిని వ్యతిరేకించింది.
శిరోముండనం చేయించుకోలేదు. శ్వేతవస్త్రం ధరించలేదు. కంట నీరు కార్చలేదు.
ఆయన శరీరాన్ని శ్మశానం కి తీసుకెళ్ళాక, రోజు మాదిరిగానే ఆయనకి వంట చేసింది.
ఎప్పటి లాగే ఆయన కూర్చుని బోజనం చేసే బల్ల పక్క కూర్చుని విసనకర్రతో గాలి విసురుతు బోజనం వడ్డించింది.
సాయంత్రానికి పడక ఏర్పాటు చేసింది. చుట్టూ తెరలు కట్టింది. అంతా యధావిది గా ఉంది.
ఆమెకి పిచ్చి పట్టినట్లు శిష్యులు నిర్ధారణ చేసుకున్నారు.
“ఆయన చనిపోలేదు. కనీసం నావరకు. ఆయన భౌతిక శరీరం తో నాకు పనిలేదు. ఆయన సాన్నిద్యం, పరిమళం నాకు యధార్ధం. అవి నాతోనే ఉన్నాయి అవి ఉన్నంతవరకు గాజులు పగలగొట్టను. కురులు తీయను. ఆచారాలు పాటించను. ఆయన నాకు సజీవుడే” అనేది.
ఆయన మరణానతరం చాలా కాలం జీవించింది. ప్రతి రోజు రెండు సార్లు శుచిగా వంట చేసేది. బర్త తో కబుర్లు చెప్పేది. ఆయనకి సేవలు చేసేది. శిష్యులతో మాట్లాడేది. సందేహ నివృత్తి చేసేది.
హృదయం ఉన్న కొంత మంది ఆమె కి పిచ్చి లేదని అర్ధం చేసుకున్నారు. ఆమె చక్కటి సలహాలు, బోధనలు చేస్తూండేది.
ఆమె ఒక్కతే చిరకాల జీవన సహచరి. ఆయన దేహాన్ని కాకుండా మనసుని అంగీకరించినది. ఆమె చివరి శ్వాస వరకు ఆమె అలానే ప్రవర్తించింది.
ఒక రోజు ఆమె కి వేళ అయ్యింది.
అప్పుడామే రోదించడం మొదలయ్యింది.
పరమ హంస చనిపోయినప్పుడు దుఃఖించని ఆమె తీవ్ర దుఃఖం తో కదిలి పోయింది.
“ఆయన్ని ఎవరు చూసుకుంటారు? ఆయన సేవలు ఎవరు చేస్తారు?”
నిశబ్దాన్ని చేరుకునే పద్దతి అది.
ఎదురుచూసే హృదయ రీతి అది.
మరణం ఎలాటి ఆటంకాన్ని, దూరాన్ని కలిగించలేదు.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...