Thursday 18 May 2017

పిల్ల మాంత్రికుడు

నరసరావు పేట లో నలబై ఏడు డిగ్రీలు టెంపరేచర్ నడుస్తుంది.
శ్రీకాంత్, కళా సాగర్ కి ఫోన్ చేశాడు. “ఎక్కడున్నావ్ ? ”
“షాపులో.. కూలర్ వేసుకుని కూర్చున్నాను. నీళ్ళల్లో ఇసు ముక్కలు వేయిస్తున్నాను.”
‘బిజీనా?”
“ఇంకెవరికయినా అయితే సమాధానం అదే.”
‘అర్జెంట్ పని బడింది. ఒకసారి మన 'డెన్' కి వస్తావా?”
“ఇప్పుడా?”
“ఇప్పుడే !!”
సూదుల్లా గుచ్చుతున్న ఎండలో బండి తీసి, తలకి టోపీ పెట్టుకుని బయలు దేరాడు. బస్ స్టాండ్ వద్ద మలుపు తిరుగుతుంటే.. రోడ్డు మీద ఒక సీసా కనబడింది. ఎవరయినా ప్రమాద వశాత్తు దాన్ని తొక్కితే పగిలి గాయం అవటం ఖాయం.
అతను బండి మీదే వంగి ఆ సీసా అందుకుని ముందు కవర్లో ఉంచుకున్నాడు.
శ్రీకాంత్ వద్దకి వచ్చేసరికి అతను ఎదురు చూస్తున్నాడు.
“ఏంటి విషయం?” కవర్లో సీసా విసిరేయ్యటానికి తీయబోతుంటే .. దానికి మూతగా ఉంచిన కార్క్ ఊడింది.
లోనుండి పొగ .. పిల్ల మాంత్రికుడు షరా మామూలే..
“డింబకా.. రెండు కోరికలు తీర్చేద హేమీ కావలెనో కోరుకొనుడు.” అని ఒక బాక్ గ్రౌండ్ లో వాయిస్సు...
“అదేంటి.. జనరల్ గా మూడు కోరికలు తీర్చాలిగా?” శ్రీకాంత్ లాజిక్ పీకాడు.
“ లాజిక్ కావాలా కోరికలు తీర్చాలా.. ఆ గడ్డం గీసుకుని ఎన్నాళ్లయింది ?. ఏమిటా అవతారం. రెండే రెండు .. కావాలా వద్దా అన్నట్టు నేను ట్రైనీ ని అధికారం లాటి పెద్ద కోరికలు వద్దు. మోయినమయినవి కోరుకోండి."
ఈ లోగా కళాసాగర్ బాగా ఆలోచించి .. “ఎంత వంపినా ఖాళీ అవని బీరు సీసా కావాలి” అన్నాడు.
అతని చేతి లోకి సీసా వచ్చి చేరింది.
దాన్ని చెరో మగ్గులో వంపుకుని ఖర్చు చేశారు. ఆశ్చర్యం సీసా మళ్ళీ నిండుగా ఉంది.
“రెండో కోరిక కోరు కొనుము. ఏదయినా ATM లో దూరి ఏ‌సి లో కూర్చుంటాను” తొందర పెట్టాడు. పిల్ల మాంత్రికుడు.
“ఇట్లాంటిదే ఇంకో సీసా పట్రా” కళా సాగర్ చెప్పాడు.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...