Sunday 12 March 2017

మూడో గొర్రే



ఒక ఊరు ఉంది. ఆ వూరి ప్రజలకి కావలసినవి అన్నీ ఆ ఊర్లో దొరుకుతాయి. ఎవరు బయటకి వెళ్ళేపని లేదు. మార్కెటింగ్ స్ట్రాటజీ లు పెరిగాయి.
కావల్సిన వస్తువుల సంఖ్య, కొత్త అవసరాలు కూడా పెరిగాయి.
బయట నుండి కొత్త వస్తువులు తెచ్చి ఇచ్చేవారు తయారయారు.
వారి మధ్య పోటీ కూడా ఉంది. సేవలు క్వాలిటీ పెరిగింది.
అయినా ప్రజలకి అసంతృప్తి., మరేదో కావాలని మరేదో లేదని..
ఒకరోజు వాళ్ళు కొన్ని గొర్రెలని చూశారు. వాటి మీద మెరిసే పేయింట్ తో అంకెలు వేసి ఉండటం గమనించారు.
అందరూ వాటిని చూశారు. 1 వ నెంబరు వేసిన గొర్రె, 2,4,5,6 వేసిన గొర్రెలు కనిపించాయి. కానీ ఎన్నిసార్లు చూసినా మూడో అంకె ఉన్న గొర్రె మాత్రం కనబడలేదు.
అందరికీ ఆసక్తి పెరిగింది. టెన్షన్ వచ్చేసింది. మూడో అంకె ఉన్న గొర్రె కోసం వెతకటం మొదలెట్టారు. పనిలేని వాళ్ళే కాదు, ఉన్నవాళ్ళు కూడా పని పక్కన పెట్టి వెతక సాగారు. కానీ గొర్రె కనిపించలేదు.
చివరికి ఆ గొర్రెలని ఊర్లో కి వదిలిన పెద్ద మనిషిని పట్టుకున్నారు.
మూడో గొర్రె విషయం నిలదీశారు.
“మనలో చాలా మందిమి ఉన్నదానితో సంతృప్తి పడము. కనబడని మూడో గొర్రె కోసం ఉన్నవి అనుభవించకుండా వెతుకుతూనే ఉంటాం. ఉన్న దానితో సంతృప్తి చెందకుండా లేని దాని కోసం చేతిలో సిద్దంగా ఉన్న ఆనందాన్ని పోగొట్టుకునే మూర్ఖులం.అసలు మూడో నెంబరు గొర్రే లేదు.” ముగించాడు ఆయన. (ఆధారం .. ఆంధ్ర జ్యోతి)

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...