Saturday 18 March 2017

లంగాలు

ఎర్రటి ఎండలో ఆఫీసు జీప్ లో దరిశి నుండి అద్దంకి వెళ్తూ ఉన్నప్పుడూ.
ముండ్లమూరు దాటాక ..
హటాత్తుగా డ్రైవర్ ని కారు ఆపమన్నాను. 
కూడా ఉన్న నా పై అధికారి (మా మద్య స్నేహం కూడా ఉంది) విస్మయంగా చూస్తుండగా నేను జీబు దిగి
ఎదురుగా సైకిలు మీద వస్తున్న ‘మాబు’ ని పలకరించాను. నన్ను చూసి నవ్వి అతను ఒక చెట్టు వారగా ఆగాడు. రెండు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడి తిరిగి జీపు ఎక్కి పోనియ్యమన్నాను.
“ఎవరతను?” మా తారక రామారావు (పై అదికారి) అడిగాడు.
“మాబు అని రమణాలవారిపాలెం.. మంచి మిత్రుడు.. వాళ్ళింట్లో ఫంక్షన్ కి పలావు వండితే మొదటి గరిటె నాకే” నేను నవ్వుతూ సమాదానం చెప్పాను.
“మా ఇంట్లో కూడా అతను బాగా పరిచయం . వ్యాపారం నిమిత్తం తాళ్ళూరు వచ్చినపుడు మా తోనే తింటాడు”
ఇంకొంచెం వివరించాను.
“అయినా లంగాలు అమ్ముకునే వాడితో నీకు స్నేహం ఏమిటి శ్రీను?” అన్నాడు గమత్తుగా..
నేనేం మాట్లాడలేదు.
“ఏం మాట్లాడవు?” తను మళ్ళీ అడిగాడు.
“మనిద్దరం హోదాలు పక్కనపెడితే సమాదానం చెబుతాను”
“సరే చెప్పు” అన్నాడు తారకరామారావు.
“మనిద్దరికి 15 వేలు దాటి జీతం వస్తుంది. (సుమారుగా 16 ఏండ్ల క్రితం) ఎవడన్నా వంద కాగితం ఇస్తాడేమో అని నక్కల్లా చూస్తుంటాము. మనం స్నేహించు కోటానికి లేని ఇబ్బంది. ఎర్రటి ఎండలో సైకిలు మీద వందకి మూడు లెక్కన అమ్ముకుంటే సాయంత్రానికి యబయ్యో, అరవైయ్యో మిగుతాయేమో. అతనితో స్నేహానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో నాకు అర్ధం కాలేదు.”
ఆయనేం మాట్లాడలేదు.
‘మనిషి హోదా అనేది డబ్బు తూనికరాళ్లతో కొలవకూడదేమో” అన్నాను.
చాలా సేపు మౌనం తర్వాత మళ్ళీ నేనే వాతావరణం తేలిక చేస్తూ.. “మళ్ళీ మన ముసుగులు వేసుకుందామా” అన్నాను.
****
మొన్ని మధ్య ఆయన రిటైర్మెంట్ వేడుకలో అందరి ముందు ఈ విషయం ప్రస్తావించాడు.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...