Thursday 2 February 2017

సలహా

కొత్తగా కొన్న రిఫ్రిజిరేటర్ కి దిగువ బాగాన ఉన్న కంప్రెసర్ లోనుండి చిన్న శబ్దం రావటం ఇంటావిడ గమనించింది. 
ఈ దరిద్రపు పోన్ లు వాట్స్ అప్ లు చచ్చాయిగా.. ఆఫీసులో ఉన్న మొగుడికి ఫోన్ చేసింది. 
“ఏదో శబ్దం అవుతుందండి.” 
“పవర్ ఆపి చూడు.”
ఆవిడ పవర్ ఆఫ్ చేసింది. అయినా ఏదో కదులుతున్న శబ్దం. 
“ఇంకా సౌండ్ వస్తూనే ఉంది.”
“ఇంకానా?, ఏ ఎలికో, పిల్లి కూనో దూరి ఉంటుంది చూడవే?”
“ఆవిడ వంగి చూసింది.”
కంప్రెసర్ వెనుక ఒక చిన్న పిల్లి కూన ఇరుక్కుని కూర్చుని ఉంది. సన్నటి కర్ర పుల్ల తో దాన్ని తరిమే ప్రయత్నం చేసింది. కానీ అది మొరాయింది. పైగా నేరుగా కర్ర దాని వద్దకి చేరటం కష్టంగా ఉంది.
మళ్ళీ మొగుడికి అప్డేట్ చేసింది.
“డైనింగ్ టేబుల్ ఫ్రిజ్ ముందుకి లాగి, జాగర్తగా వంచు.. అప్పుడు దాన్ని బయటకి లాగు.. ఉత్తినే ఫోన్ చేసి విసిగించకూ. పనిలో ఉన్నాను”
**
పది నిమిషాలకి ఫోన్.
“పిల్లిని తరిమేశాను.”
“ఇంకేమిట ట”
“మీ తెలివి తెల్లారినట్లే ఉంది. ఫిడ్జ్ ని వంచమని చెప్పేముందు. లోపల గిన్నెలు బయటకి తియ్యమని చెప్పొద్దూ?”
గయ్యిమంది ఆవిడ.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...