Monday 9 January 2017

జామ కాయలు

కుమార్, నేను కలిసి 'చదలవాడ' జామ తోటలకి వెళ్ళాం.
కాయలు దోరగా ఉన్నాయ్. చెరో గంపా కొనుక్కున్నాం. రెండిట్లోను కాయలు సమానంగా ఉన్నాయి. 
నా గంపలో కాయలు కొంచెం పెద్దవిగా ఉన్నాయి. ఒక్కొక్కటి 5 రూపాయల లెక్క అమ్ముకోవచ్చు. 
కుమార్ గంప లోవీ కొంచెం చిన్నగా ఉన్నాయి. 10/- కి మూడు అమ్ముకోవచ్చు. 
తీరా మార్కెట్ వద్ద అమ్ముకుందా మనేసరికి, కనకం నుండి ఫోన్ వచ్చింది. 
కుమార్ కి ఏదో విదంగా అమ్మమని చెప్పి నా గంప కూడా ఇచ్చి నేను వెళ్లిపోయాను.
పదికి నేను అమ్ముదామనుకున్నవి 2, తను పదికి అమ్ముదామనుకున్న 3 మొత్తం కలిపి 5 కాయలు 20/- చొప్పున అమ్మేశాడు ట.
మర్నాడు ఉదయం మాట్లాడుకుంటుంటే తను ఎలా అమ్మాడో చెప్పాడు.
ఒక్క నిమిషం ఆలోచింది “ఇద్దరికీ కలిసి 70 రూపాయలు లాసు” వచ్చింది. అన్నాను.
ఒక్కో గంపలో ఎన్ని కాయలు ఉన్నాయంటారు?

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...