Sunday, 8 January 2017

లక్కీ !?

ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన పెళ్లికాని కార్తీక్ ని సాయంత్రం బోజనానికి ఇంటికి తీసుకెళ్ళాడు మేనేజర్ రఘుపతి .
ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మేనేజరు బార్య, సంతోషం గా ఎదురోచ్చి అతని చేతిలో బాగ్ అందుకుంది.
“మీ కోసమే చూస్తున్నా ఈ రోజు ఎందుకో మీరు ఎర్లీగా వస్తే బావున్ను అనిపించింది.” అంది. 
“ఇతను మా కొలీగ్. కార్తీక్. ఫ్రెషర్. భోజనానికి రమ్మన్నాను” పరిచయం చేశాడు. 
“ఎన్నాళ్లయింది సర్ మీ పెళ్ళయి?” అన్నాడు అతను విస్మయంగా..
“18 ఏళ్ళు” విప్పారిన మొహం తో చెప్పాడు అతను.
“యు ఆర్ లక్కీ సర్”
“అవును. పద చెరో పని అందుకుంటే అరగంటలో వంట అయిపోతుంది. తను టీవి సీరియల్ చూడటం కాగానే భోంచేద్దాం. ” చెప్పాడతను

No comments: