Sunday, 29 January 2017

‘విరక్తి’ ని మించిన సంతృప్తి లేదు.

ఒక విలువయిన ది బౌతికమయినది మనకి అందుబాటులోకి వచ్చినప్పుడు. సమాంతరంగా ఒక ‘భావం’ మనం పెంపొందించుకోవలసి ఉంటుంది. 
నా జీవితం లో అత్యంత ప్రియమయిన నా తండ్రి బౌతికంగా నన్ను వీడి పోతున్నాడని తెలిసినప్పుడు ఆ భావమే నన్ను ఆయన మరణానంతరం కాపాడింది. లేకుంటే నా గుండె పగిలి పోయి ఉండేది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. 
ఆ ‘భావమే’ ‘విరక్తి/నిరాశ’ 
జీవితం లో ఎంతో ప్రణాళిక చేసుకుని ఒక ఇష్టమయిన వస్తువు (car/మొబైల్/ఫ్లాట్) కొంటాము. దాని ఉపయోగం కంటే అది మనవద్ద ఉన్నది అనే భావన మనన్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది. దాని పట్ల విపరితమయిన ప్రేమ/ బిలాంగినెస్స్ పెంపొందించుకుంటాము. అలాటి ఒక బౌతీక వస్తువు లేదా వ్యక్తి పట్ల ఎంతో ప్రేమ ని మనం నిర్మించుకుంటూ వస్తాం. దాని/ వారి ఉనికి లేని జీవితాన్ని ఊహించుకోవటం కూడా కష్టం అవుతుంది.
ఒక దురదృష్టకరమయిన రోజు హటాత్తుగా అది మనన్ని విడిపోతే??
మన ప్రేమకి సమానమయిన నష్టం మనకి జరుగుతుంది. అది దుఖాన్ని మించినది. ‘వేదన’ అని అనొచ్చు.
గాలి నిండిన బెలూన్ లాటి మనసు మీద అది పదునయిన సూది తో పొడుస్తుంది. మనం ప్రళయ సమానమయిన కుదుపుకి లోనవుతాం. మెదడు మొద్దుబారి పోతుంది. మరే ఆలోచన మనకి తోచదు.
అలాటి ఆకస్మిక సంఘటనల నుండి కాపాడు కోవాలంటే మనం “నిరాశ’ ని సమాంతరంగా పెంపొందించుకోవాలి.
ఇది వస్తువు - దీనిని ఇంతగా ప్రేమించడం తగదు. ఇది డబ్బు- మనిషి సృష్టించుకున్నది. దాని విలువ కొంత పరిది దాటాక శూన్యం అయిపోతుంది. ఇతను నా బార్య/బర్త /బిడ్డ/ తల్లి /తండ్రి – ఏదో ఒక రోజు నన్ను వీడి నాటకీయంగా వెళ్ళి పోతాడు/తుంది. అనేదాన్ని మనం వీలయినంత లోపలికి తీసుకోవాలి.
ఒక నిరాశ ని సమాంతరంగా పెంపొందించుకోవాలి.
12 ఏండ్ల పిల్లాడు పిల్లాడికి ఐరన్ బాక్సు పట్టుకున్నప్పుడు షాక్ కొడుతుంది. అతడి చేతిలో ఆ వస్తువు ఇంకా అలానే ఉంటుంది. దాన్ని పట్టుకున్న పిల్లాడు చిగురుటాకులా వణుకుతూ ఉంటాడు.
అల్లారుముద్దుగా పెంచిన బిడ్డ. పాల బుగ్గల నునుపు ఇంకా మాయం కానివాడు.
మనమేం చేస్తాం. “అయ్యో ..నా బిడ్డ” అని కూలబడి పోతాం. లేదా మనం కూడా వాడి చెయ్యి పట్టుకుని గుంజుతాం.
రెండిటి వళ్ళా మనకు జరిగేది ఇంకా ఎక్కువ నష్టం.
వీలయినంత త్వరగా పరిస్తితి మనసులోకి తీసుకోగలిగేతే, మైన్ వద్దకి పరిగెత్తి ఆపటం లేదా ఏదయినా కర్ర సాయం తో పిల్లాడి చేతి మీద కొట్టటం చేయాలంటే.. మనం పెంచుకున్న ఈ నిరాశే/విరక్తే  మనని ప్రేరేపిస్తుంది. మనలని పూర్తి నష్టం నుండి కాపాడుతుంది.
ఇంట్లో గిద్ద బియ్యం వంటలో తగ్గించాల్సి రావటం అనేక కుటుంబాలని బజార్లో పడటం నాకే కాదు మీకు తెలుసు.
ఒక ప్రణాళిక లేకపోవటం, నా తర్వాత అనే ఆలోచన అన్నీ ఉన్నప్పుడూ చెయ్యక పోవటం. మనం చేసే ఆర్ధిక ఒడంబడికలు భాగస్వామితో పంచుకోక పోవటం. ఎక్కువగా మనం చేసే పొరపాట్లు.
అలాగే ఆరోగ్యం విషయాలు భాగస్వామితో చెప్పక పోవటం, క్రమమయిన జీవన విధానాలని అవలంబించక పోవటం కూడా మనం చేసే తప్పులు.
కుటుంబం లో సబ్యులు అందరూ తమ బాద్యతలు తెలుసుని ప్రవర్తించాలి. ఆరోగ్యమయిన స్వచ్చని అనుభవిస్తూనే కాలం తో పాటు గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.
 వాహనం లో బరువుని అన్నీ చక్రాలు సమంగా పంచుకుంటే ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది.
వస్తు ప్రేమ, వ్యక్తి ప్రేమ కి సమాంతరం గా ఒక 'వాస్తవం తో కూడిన ఆలోచన ' ని పెంపొందించు కున్నప్పుడే మన జీవితాలని తల్లకిందులు చేసే  కుదుపులు ఉండవు.
విరక్తి’ ని మించిన సంతృప్తి లేదు.

No comments: