Wednesday 4 January 2017

అద్బుతం గా ఉండేది

“నిన్నటి వరకు అద్బుతం గా ఉండేది. ఈ రోజు ఏమి లేదు.” మళ్ళీ నిట్టూర్చాడు పార్కులో పక్కనే కూర్చుని ఉన్న అతను.
తనలో తానే గొణుక్కున్నట్లు గా ..
“ఎంత బావుండేది?.. కడుపునిండా తిండి, వారానికి రెండు మూడు సార్లు నాన్ వెజ్, మంచి రూము, పడక, ఫాను రోజు రెండు మూడు భాషల్లో పేపర్లు, టీవి, ఇంటర్నెట్. బొల్దన్ని పుస్తకాలు.రెగ్యులర్ గా విజిట్ చేసే డాక్టర్లు, మెడికల్ కవరేజి, నా బిల్డింగ్ బయట, సెక్యూరిటి, ఎక్కడికి వెళ్లాలన్నా పెద్ద కారు.. “
“తెల్లవారే సారీ ఏమి లేవు. బజార్లో  పడ్డాను. చేతిలో చిల్లీ గవ్వ లేదు, తింటానికి, ఉండటానికి ఏమి లేదు ..” మళ్ళీ నిట్టూర్చాడు అతను.
ఆశ్చర్యపోవటం నా వంతు అయింది. ఏమయి ఉంటుంది.
“విడాకులు? ఊహూ అయి ఉండదు. గాంబ్లింగ్? రేసులు? పేకాట?” ఊహూ నా వల్ల కాలేదు..
...
ఏమయింది?” అనునయంగా అడిగాను.
..
..
..
..
..

“నిన్ననే విడుదల చేశారు.” బావురు మన్నాడు. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...