Thursday, 10 November 2016

42. చీకటి మింగేసింది.

అమీనమ్మ ..
ఆమె కళ్ళనిండా తడి. నేను విప్పరిన కళ్ళ తో ఆమెని చూస్తుండి పోయాను. 
తను ఉండే వర్కర్స్ కాలని నుండి రెండు కిలోమీటర్లు నడిచి అంత చీకట్లో ఎందుకు వచ్చినట్లు??
నాకేమి తోచలేదు. ఒక నడివయసు ప్రౌడ, 20 ఏండ్ల బక్క పిల్లాడి వద్దకి ఏమి ఆశించి వచ్చినట్లు?
“డబ్బులు ఏమయినా కావాలా?.. పిల్లలకి ఆరోగ్యం బానే ఉందిగా?” నేను పలకరించాలి కనుక ఎదో ఒకటి మాట్లాడాను.
“సారూ నువ్వెప్పుడు ఇంతే. నన్ను అర్ధం చేసుకుందే లేదు. పెనిమిటి పొయ్యాక నన్ను నోరారా పిలిచిన వాళ్ళే లేరు. ముగ్గురు పిల్లగాల్తో నేను బతికానా, పోయానా చుసినోల్లె లేరు. నీలాగా నాతొ మాట్లాడినోల్లు లేరు, పని దగ్గరకి పసి పిల్లల్ని తెస్తే కసురుకునే వాళ్ళే గాని, వాళ్ళ ని చుసినోల్లె లేరు. నువ్వు మంచాడివి. నాకు నచ్చావు. ని కోసం ఎన్ని రోజులు సబ్టేసన్ లో ఎదురు చూసాను.. నేను బిద దాన్ని నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమి లేదు. అందుకే నీ కోసం వచ్చాను. నువ్వు అర్ధం చేసుకున్నదే లేదు అంది”
నాకు మైండ్ బ్లాక్ అయి పోయింది. ఆమె భావం అర్ధం కానంత చిన్నాడిని ఏమి కాదు. ఆ రోజు సబ్ స్టేషన్ లో ఆమె చూపు లోని భావం ‘ఆహ్వానం’ అని నా కిప్పుడు అర్ధం అయింది. నా మిత్రులందరూ వారి గదుల్లోంచి ఇది వింటూనే ఉన్నారు.
‘ ఇవాళ నువ్వు వెళ్లి పోతున్నవని చెప్పారు. నేను వచ్చేస్తా నువ్వు పని చేయించే చోట కూలి ఇప్పించు. చేసుకుంటూ బతుకుతా .. ఆమె స్వరం ఏడుపు లోకి మారింది.
అసలు ఏమాత్రం ఉహించని పరిణామం. నాకు భయం వేసింది. నేను ఆమెతో ఆదరణగా మాట్లాడి తప్పు చేసానా? ప్రత్యకంగా ఆమెని ఏనాడు గుర్తించింది లేదు. అందరి తో మాదిరి గానే తనతో కూడా?? అంటే ఆ మాత్రం పలకరింపు కి కుడా ఆమె మొహం వాచీ ఉందా? అసలు అంత వయసు స్త్రీ ని మరో రకంగా ఉహించడం కుడా ఇబ్బందిగా ఉంది. ఒక ఉద్యోగి గా కంటే ఎక్కువ మానవత్వం ప్రదర్సించానా? నన్ను నేను చెక్ చేసుకో సాగాను.
మా మిత్రుల కొందరు ఈ సన్ని వేశాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కళ్ళతో ఆమెని కొలుస్తున్నారు.
ఇలాటి భయంకరమయిన, ఇబ్బంది కరమయిన సన్నివేశాన్నుండి సవారి భార్య నన్ను కాపాడింది. ఎలా చూసిందో కాని అమినమ్మ రావటం సవారి దంపతులు చూసారు. అమీనమ్మ మానసిక పరిస్థితి, సహచర స్త్రీ గా సవారి బార్య కి అవగాహన ఉండి ఉంటుంది. ఆమె పరుగు లాటి నడకతో అక్కడికి వచ్చింది.
“అమ్మి, పోదాం రా” అంది వచ్చి రావటం తోటే..
అప్పటికే ఆమె ఏడ్చి దుఖం నుండి తేలిక పడింది. నన్ను తన గాజు కళ్ళతో చూసింది. ఆ కళ్ళలో ఏ భావము లేదు. ఒక్క వీడ్కోలు తప్ప.
నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళిద్దరిని చీకటి మింగేసింది. 

#33 Grade

No comments: