Thursday, 10 November 2016

అమీనమ్మ -38

డ్యూటీ లోకి రాగానే వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి వర్క్ ప్రోగ్రెస్ చూసుకుంటుంటే ‘లాల్ జీ’ జీపు లో యూనిట్ 1515 వద్దకి వచ్చాడు. లిఫ్ట్ లో పైకి వచ్చి “క్యా బాయ్ హమే భూల్ గయే హో “ అంటూ పలకరించాడు. 
ఇద్దరం వాటర్ ట్యాంక్ గురించి, మధ్య మధ్య లో వ్యక్తి గత విషయాల గురించి మాట్లాడు కున్నాం. నేను లేని ఆ వారం రోజుల్లో జరిగిన విశేషాలు చెప్పుకొచ్చాడు. హిమాయత్ నగర్ mecon ఆఫీసు డ్రాఫ్ట్స్ ఉమన్ ఒకమ్మాయికి తను చాలా కాలం నుండి ‘బహుమతులు’ ఇస్తున్నట్లు, అవి ఎందుకు ఇస్తున్నాడో ఆమెకి స్పష్టంగా తెలిసినట్లు, కాని ఆమె తనని నిర్లక్షం చేస్తున్నట్లు చెప్పు కొచ్చాడు. 
‘It’s time to get married Lal jee “ నేను నవ్వుతు చెప్పాను. 
“హోగా .. వో భి హోగా” నిట్టూర్చాడు అతను. ముగ్గురు చెల్లెళ్ళ వివాహం కావాల్సి ఉందని గతం లో చెప్పి ఉన్నాడు. 
***
మద్యాన్నం భోజనం అయ్యాక క్వార్టర్స్ లో సిఎస్టా (మద్యాన్నపు కునుకు) లో ఉన్నప్పుడు, వర్క్ సూపర్వైజర్ వచ్చి ఈశ్వర మణి గారు రమ్మంటున్నాడు అని చెప్పాడు. “ఎక్కడున్నారు?”
“యూనిట్ 1818 వద్ద”
యూనిట్ 1818 అనేది RCI ప్రాజెక్ట్స్ లో అతి పెద్ద నిర్మాణం సుమారు 10 మీటర్ల ఎత్తు, 70మీటర్ల పొడవు, ౩౦ మీటర్ల వెడల్పు తో ఉంటుంది. పక్క పక్కనే అతికించి ఉన్న v ఆకారం లో 8 అంగుళాల మందం కలిగిన స్లాబు వేసి ఉంటుంది.(VVVVVVVVVV ఇలా folded roof ) చాలా ప్రిస్తేజియస్ నిర్మాణం. పోయిన నెలలోనే దాని స్లాబ్ వేసిన గుర్తు. ఇంకా పూర్తిగా సెంటరింగ్ తీయలేదు. 
“సరే పద” నేను షు లేసులు కట్టుకుని అటువైపు బయలు దేరాను. 
గేటు వద్ద ఒక సూపర్వైజర్ ఉన్నాడు. తలకి పెట్టుకునే సేఫ్టి టోపీ ఇచ్చి “సార్లు లోపల ఉన్నారు” అన్నాడు. 
నేను లోపలి వెళ్లాను. మూడు అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తయిన స్లాబు కింద ఉన్న సెంటర్రింగ్ ఇనుప రేకులు ఉడ దీయటానికి ఎత్తుగా తాత్కాలికంగా కదిలే మంచ ఏర్పాటు ఉంది. అక్కడ ఆ యూనిట్ ఇంచార్జ్ ఎ ఇ రామచంద్రన్, వర్క్స్ మేనేజర్ ఈశ్వర మణి ఉన్నారు. నన్ను చూడగానే మణి గారు పైకి రమ్మన్నట్టు సైగ చేసాడు. జిగ్ జాజ్ గా ఉన్న తాత్కాలిక మెట్లు ఎక్కుతూ నేను పైకి వెళ్లాను. 
రామచంద్రన్ ముఖం కంద గడ్డలా ఉంది. ఈశ్వర మణి ‘రావ్ అక్కడ చుడండి’ అన్నాడు.
కొద్దిగా తొలగించిన రేకు మీద స్లాబ్ కాకుండా కొంత హాని కుంబ్ కంకర (defective concrete) స్లాబ్, స్టీలు కనబడుతున్నాయి పైన మరో ఇనప రేకు 1x 0.5 మీటరు సైజు ది ఇరుక్కు పోయి ఉంది.
నాకు విషయం వెంటనే బోధపడింది. స్లాబ్ వేసే టప్పుడు చువ్వల మిద సౌకర్యంగా నడవటం కోసం కొన్ని రేకులు వేసుకుంటారు. కంకర వేసే కొంది వాటిని తీసివేస్తూ ఉంటారు. చాలాసార్లు రేకు సిమెంట్ పాలు తో కలిసి పోతుంది. గమనించక పోతే అది అలాగే ఉండి పోతుంది. కింద సువ్వలు మిగిలి పోతాయి. అదే జరిగింది. రాత్రిం బగళ్ళు వరుసగా పని చేసేటప్పుడు (సుమారు 2300 బస్తాల కాంక్రీట్ ) అలాటివి సహజం. సైట్ ఇంజనీరు జాగర్త గా ఉండాలి. 
దాన్ని ఎదో ఒకటి చెయ్యొచ్చు సమస్య అల్లా MECON వాళ్లకి తెలియకూడదు. తెలిస్తే క్వాలిటి సర్టిఫికేట్ ఇవ్వరు. లక్షల రూపాయల బిల్లు విడుదల కాదు. అది సమస్య. 
ఆదివారం రోజు mecon వాళ్ళు రాని శలవు రోజు దానిని పరిష్కరించాలని అనుకున్నాం. వారి కార్యాలయం లో నాకు మంచి రేపో ఉండటం వల్ల నన్ను అక్కడికి పిలిచి నట్లు నాకు అర్ధం అయ్యింది. ఎంత మెత్తగా టార్గెట్స్ కేటాయిస్తారో అనే దానికి ఇది మంచి ఉదాహరణ. 
సాయంత్రం ఒక్కడినే కేబుల్ చానెల్ వర్కు ఒక్కసారి చూసుకుని వెళ్తుంటే, అమీనమ్మ ఎదురయ్యింది. మా రెగ్యులర్ హమాలి ఆమె. ముగ్గురు పిల్లలు కుడా ఉన్నారు. విడో అని విన్నాను. ఆమె కి ఆ సమయం లో అక్కడ ఏమి పనో నాకు అర్ధం కాలేదు. “సబ్ సెంటర్లో చెప్పులు మర్చి పోయాను” అంది. కాని విషయం అది కాదు అని తెలుస్తుంది. ఉన్నంత లో శుభ్రంగా తయారయి ఉండటం, తను స్త్రీ అని ఇతరులు గమనించే టట్లు నడవటం నాకు వింతగా అనిపించింది.
#33 Grade

No comments: