Saturday 6 August 2016

రెండు విషయాలు

'కృష్ణ మోహన్' అని స్వామి వారి దేవాలయానికి ఒక గొప్ప దాత అయిన యువకుడు ఉన్నాడు. 
స్వంత ట్రాక్టర్ ఉంది. దేవాలయానికి సంబందించి ప్రతి కార్యక్రమానికి అతను ట్రాక్టర్ పంపుతాడు. ఆయిల్, డ్రైవర్ ని అతనే ఏర్పాటు చేస్తాడు. 
ఈ రోజు తాను కూడానే ఉన్నాడు. నిలువెత్తు పూలమాలలు తీసుకు వచ్చాడు. 
మూడు గంటల పైగా ఊరేగింపు జరిగింది. దేవాలయం లో కార్యక్రమం మరో గంట. 
డ్రైవర్ ని దిగమని అతనే బండి తోలాడు. 400 కేజీ లు పై చిలుకు ఉన్న స్వామివారిని వాహనం నుండి దించి ఆలయం లోకి తీసుకు వస్తుంటే .. ఆలోచన లోని ఒకావిడ గ్రానైట్ మెట్ల మీద నీటిని వారుగా పోసింది. ముందు వరసలో ఉన్న వాళ్ళ కాళ్ళు మెట్లమీద జారాయి. అతికష్టం మీద తమాయించుకుని క్షేమంగా స్వామివారి బింబాన్ని లోపలికి తీసుకు వచ్చారు.
...
"జారీ పడి పోతానేమో నని భయం వేసిందండి. కానీ ఆయనే ఆపాడు. లేకపోతే నడుములు విరిగేవి ' అన్నాడు నా పక్కకి వచ్చి నిలబడి.
...
"ఈ మధ్య కాలంలో అయిదుగంటల పాటు సిగిరెట్టు తాగకుండా మీరు ఉండటం ఇదే చూడటం " నేను నవ్వుతూ గుర్తు చేశాను. అతను దాదాపు చైన్ స్మోకర్.
..
"అవును గుర్తే లేదండీ " అన్నాడు.
"నేను సిగిరెట్టు లేకుండా ఉండలేనేమో అని ఒక అపనమ్మకం. ఇప్పుడు నమ్మకం కుదిరింది. మానేస్తాను. లేదా ఖచ్చితంగా తగ్గిస్తాను." అన్నాడు.

-------------------------------------------------------------------------------------------------------------------------------
కొన్ని సంగతులు కాకతాళీయమో లేక దైవ సంకల్పమో తెలీదు కానీ 'జరుగుతుంటాయి' 
..
మేము స్వామివారి బింబాన్ని ఊరేగింపుగా తీసుకు వచ్చే ఏర్పాటులో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది 'గజ్జల శ్రీనివాస రెడ్డి' అనే మిత్రుడి నుండి. విజయవాడ లో ఉన్నాను మరో పావుగంటలో కార్లో ఒక్కడినే బయలు దేరుతున్నాను." అని .. ..
..
నేను సమాదానం చెప్పేలోగా మా ఓబులురెడ్డి మాస్టారు నాదగ్గరకి వచ్చి "గోపుర శిఖరం మీద కలశం ఇస్తానన్న దాత తను తేలేక పోయాడు, మీరు తెచ్చుకోండి. బిల్లు తీసుకురండి డబ్బులు ఇస్తాను అంటున్నాడు." ..
..
నేను ఫోన్ కి చెయ్యి అడ్డుగా ఉంచి " ఎక్కువ గా ఆలోచించొద్దు.. విజయవాడ లో కలశాలు దొరుకుతాయా ?" ..
..
'పోలవరం రాము అని ఒకతను ఉన్నాడు. అతని కార్డు నాదగ్గర ఉండాలి" అన్నాడు సారు. "చూడండి చూసి నెంబరు చెప్పండి."..
..
ఫోన్ లో వెయిట్ చేస్తున్న మిత్రుడికి" కారు ఆపుకుని కాఫీ తాగు. తాగే లోపు whats app లో ఏం చెయ్యాలో వివరాలు వస్తాయి " అని చెప్పాను...
..
ఈలోగా మాస్టారు విజిటింగ్ కార్డు తీసి ఇచ్చారు. వివరాలు చెబుతూ..
కార్డ్ ని ఫోటో తీసి" 30 అంగుళాల ఎత్తు, విష్ణు చక్రం ఉండే కలశం ఈ కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తి ని కలిసి తీసుకొచ్చేయ్. మేం .అతనికి ఫోన్ చేసి వివరాలు చెబుతాం ఈ లోపు. కాష్ against బిల్. ఇంతకీ డబ్బులున్నాయా?"
అటునుండి తను ' పర్లేదు 12 వేల దాకా ఉన్నాయి. సరిపోతాయా?' అని తిరుగు టపా ..
'లక్షణంగా' అని చెప్పి మా పనిలో పడిపోయామ్.
స్వామి వారి 'దాన్యాది వాసం' కార్యక్రమం చూసి ఇంట్లోకి వస్తుంటే శ్రీనివాస రెడ్డి నుండి ఫోన్ కలశాలు 'పాలిష్ చేసి రెడీగా లేవని, ఇప్పటిదాకా కూర్చుని పాలిష్ చేయించి. బిల్ చెల్లించి బయలదేరబోతున్నానని.'
'గుడ్ బయలు దేరి వచ్చెయ్ .. జాగర్త ..పొద్దుటే కలుద్దాం "
.
మాకేమిటండీ ? మా వానర సైన్యం ఉంది. ఏ ఆటంకం ఉండదు.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...