Sunday, 3 July 2016

హెల్మెట్

ఉదయాన్నే టిఫిన్ చేస్తూ రెగ్యులర్ గా తీసుకెల్లే బాడుగ కారు డ్రైవర్ కి ఫోన్ చేశాడు కళాసాగర్.
అతను అందుబాటులో లేనట్టు సమాచారం. 
నరసరావు పేట నుండి ఒంగోలు వెళ్లవలసిన పని. 
నెలలో రెండు సార్లు అలా వ్యాపారం పని మీద వెళ్తుంటాడు. 
ఒక ప్రభుత్వ సంస్తకి కావలసిన సానిటరి పైపులు సప్లి చేస్తుంటాడు అతను. 
వాటి తాలూకు బిల్లుల కోసం ఆదివారాలు ఇంజనీర్ల ని పట్టుకుని రికార్డ్ చేయించుకోవటానికి 90 కిలోమీటర్ల దూరం లోని ఒంగోలు కి ఒక టోల్ గెట్ దాటుకుని మరి వెళ్తుంటాడు.
**
ప్రతిసారి బాడుగ కారు ఎందుకు? బస్సుకి వెళ్లొచ్చుగా అంతగా అవసరం ఉంటే అక్కడ రోజు వారి ఆటో మాట్లాడుకుంటే చాలు గదా ? బార్య కౌటిల్యుడి సలహా ఇచ్చింది.
..
ఎలా అయితేనేం కళాసాగర్ బస్సెక్కాడు. లగ్జరీ బస్సులో గట్టి కునుకు వేసేసరికి ఒంగోలు వచ్చేశాడు. ఆటొ ఒకటి సాయంత్రం దాకా తనతో ఉండెట్టు మాట్లాడుకున్నాడు. అతను 800 అని ఇతను 400 అని. బేరం కుదర్లేదు...
..
అంతలో కళాసాగర్ కి మహత్తరమయిన ఆలోచన వచ్చింది. ..
స్థానికంగా ఉన్న మిత్రుడికి ఫోన్ కొట్టాడు. “ఈ రోజు టౌన్ లో తిరగటానికి బండి కావాలి సాయంత్రం వెళ్తూ ఇచ్చి వెళ్తాను”
..
నేను ఆల్రెడీ బయటకి వచ్చి ఉన్నాను. ఇంట్లో మా అమ్మాయి గెర్లెస్ బండి ఉంది ఫోన్ చేసి చెబుతాను వెళ్ళి తీసుకెళ్లు”..
..
ఆటో లో ఫ్రెండ్ ఇంటికే వెళ్ళి బండి తీసుకుని టౌన్ లోకి వెళ్ళాడు. తన పనులు అన్నీ చూసుకుని లంచ్ కి బయలు దెరుతుంటే చర్చ్ వద్ద ట్రాఫిక్ యంత్రాంగం బండి ఆపారు.
హెల్మెట్ ఏది?” కళాసాగర్ సమాదానం చెప్పేలోపు చలానా రాసి చేతిలో ఉంచారు.
బోజనమ్ చేసి మళ్ళీ మిగిలిపోయిన పని చూసుకుని బండి ఇవ్వటానికి వెళ్తుంటే సాయిబాబా గుడి వద్ద మరో మారు ట్రాఫిక్ ఎస్సై బండి ఆపేశాడు. ..
మళ్ళీ హెల్మెట్ చలానా రాస్తుంటే “ఇప్పుడే ఒక చలానా పే చేశాను” కళాసాగర్ జేబులో రశీదు తీసి చూపించాడు.
“ఆలానా అయితే మొబైల్ డ్రైవింగ్ కింద మార్చేద్దామ్”  చలానా పూర్తి చేసి చేతిలో పెట్టాడా అదికారి. 
..
బ్రతుకు జీవుడా అనుకుంటూ వీది మలుపులో పెట్రోల్ బంకు వద్ద ఆగి వంద కాగితం అతనికి ఇచ్చి బండి సీటు ఆన్లాక్ చేసి సీటు పైకి లేపేసరికి స్టోరేజ్ ప్లేస్ లో ప్లాస్టిక్ కవర్లో జాగర్త గా చుట్టి పెట్టిన హెల్మెట్ కనబడింది.


No comments: