Saturday, 2 July 2016

సైగ

మూడంటే  మూడు నెలల్లో రిటైర్ అవబోయే జోజప్ప మార్కాపురం నుండి పుల్లలచెరువు బస్సు దిగి ఆటో పట్టుకుని తాను పని చేసే తాసీల్దార్ కార్యాలయానికి వెళ్ళేసరికి 10.30 దాటింది.
వీకెండ్ అవటం తో, పనుల నిమిత్తం వచ్చే ప్రజలు పలచగానే ఉన్నారు.
ఏం యలమందా అయ్యగారు వచ్చారా?” ఆఫీసు అటెండర్ ని పలకరించాడు.
“ఇప్పుడే వచ్చారయ్యా” జోజప్పని ని విష్ చేస్తూ సమాదానం చెప్పాడతను.
రూము లోకి వెళ్ళి కూడా తెచ్చుకున్న బాగ్ లోనుండి ఒక స్వీట్ పాకెట్ తీసి
స్వీట్ తీసుకోండి సార్ . మా ఇద్దరికీ  వీసా మంజూరయింది” సంతోషం గా  చెప్పాడు జోజప్ప.
పొద్దుటే మంచి వార్త చెప్పారు అంటూ బజర్ నొక్కి “యలమందా మనాళ్లని అందర్నీ పిలువు. జోజప్ప గారు స్వీట్స్ తెచ్చారని చెప్పు”
పది నిమిషాల్లో అందరూ ప్రోగయ్యారు.  తలో ప్రశంస. అభినందనలు తో ఆయన్ని ముంచేశారు .
“మొత్తానికి మీ కోడలు కానుపు సమయానికి కెనడా వెళ్తారు. పోనీలెండి అంతా అనుకున్నట్లే జరుగుతుంది.” ఆర్ ఐ గోవిందు అభినందించాడు.
“ సార్ కేమిటి సార్. చక్కగా ఫారిన్ వెళ్ళి కొడుకు బిడ్డతో ఆడుకుని  రిటైర్మెంట్ కి వారం ముందు  వచ్చి జాయిన్ అయ్యారంటే చాలు. ఇక రిటైర్మెంట్. ఇప్పటినుండే అన్నీ పి ఎఫ్ కాగితాలు మూవ్  చేసుకున్నారు కాబట్టి వెంటనే ఆ 20 లక్షలు చేతికి వచ్చేస్తాయి. పిల్ల పెళ్లి చేసేసి హాయిగా కృష్ణా రామా అనుకుంటూ పెన్షన్ డబ్బుల్తో శేషజీవితం గడిపేస్తారు” ASO లలిత గారు ఆయన వర్తమానం మరియు బవిషత్తు క్లుప్తంగా చెప్పేసింది.
“అంతా భగవంతుని దయ. రిటైమెంట్ బెనిఫిట్స్ రాగానే మా ఆవిడకి హార్ట్ సర్జరీ చేయించాలి ఆ తర్వాతే అమ్మాయి వివాహం ”
 జోజప్ప నవ్వుతూ అభినందించిన  అందరికీ థాంక్స్ చెప్పాడు.
“డాల్డా స్వీటు తో సరిపెడితే కుదరదు మద్యాన్నం మంచి బోజనమ్ ఏర్పాటు చేయాలి మరి” తాసిల్దారు నవ్వుతూ అన్నాడు.
తప్పకుండా సర్.”
“ఆ వెంకట్రామయ్య అదేనయ్యా ఆ అసైన్మెంట్ లాండ్ కేసు కోర్టు నుండి క్లియర్  చేయించున్నాడే అతన్నిపాస్ బుక్ కోసం ఇవాళ  రమ్మన్నాను. పావలా బేడా  ఇస్తాడు ఇవాల్టి ఖర్చులకి వాడుకో” తాసిల్దారు బారోసా ఇచ్చాడు.
సీట్లో కూర్చున్నాడే గాని ఇంటి నుండి మిత్రుల నుండి ఒకటే ఫోన్లు. కెనడా ఎప్పుడు వెళ్తున్నారు? అని . జీవితం లో మొదటి సారి విమాన ప్రయాణం అదీ ఇప్పుడప్పుడే స్టిరపడుతున్న కొడుకు దగ్గరకి. అసలు కోడలు ఆరోనేలలో ఉండగానే వెళ్లాలనుకున్నారు. అంతలో ఇంటావిడకి అనారోగ్యం. ఫ్యామిలి హెల్త్ కార్డు తో మనకి అవసరం అయిన వైద్యం తప్ప మిగిలినవన్నీ చేస్తామంటారు. మందుల్తో లాక్కొస్తుంది ఆవిడ. ఎలాగయినా ఆర్నెళ్లలో ఆమెకి సర్జరీ చేయించాలి.
వి ఆర్ ఏ ఒకర్ని ఊరు అవతల ఉన్న డాబా హోటల్ కి పార్సిల్ బోజనాలు, నాన్ వెజ్ వంటకాల కోసం పురమాయించాడు. జోజప్ప .
సీట్లో కూర్చుని పెండింగ్ వర్కులు పూర్తి చేస్తుంటే, టైమ్ తెలియలేదు.
రెండున్నరప్పుడు యలమంద వచ్చి అయ్యా బోజనానికి అయ్యగారు లేచారు. మీరు రండి అందర్నీ పిలుస్తున్నారు. అన్నాడు. రూములో మిగిలిన అందరూ అప్పటికే బోజనాలు ఏర్పాటు చేసిన రూములో చేరారు.
చేత్తో లో ఫైల్ పూర్తి చేసి టేబుల్ మీద కాగితాలు సర్దుతుంటే వెంకట్రామయ్య లోనికి వచ్చాడు.
చొక్కా జేబులోంచి మడత బెట్టిన వంద కాగితాలు జోజయ్య కి అందించాడు. “ఎంత ?”
“మూడు వేలు “
టేబుల్ సొరుగు లాగి అందులో ఆ డబ్బు వేసి తాళం వేస్తుంటే.. అప్పటికే

వాకిలి వద్ద కి చేరిన వంకట్రామయ్య జేబులోంచి ఒక ఎర్ర రంగు కర్చీఫ్ తీసి ఎవరికో సైగ చేస్తూ నిలువుగా ఊపాడు.

No comments: