Thursday 26 May 2016

యోగి సందేశం

రామకృష్ణ పరమహంస అనే యోగి తన శిష్యులతో కలసి దేశాటనం చేస్తూ ఉన్నారు.
ఆ క్రమంలో వారు ఒక గ్రామం చేరారు..
గ్రామ పొలిమేరలకి గ్రామ పెద్దలు వచ్చి, సాదరంగా ఆహ్వానం పలికి, తమ వెంట తీసుకుని వెళ్ళి వారికి బస ఏర్పాట్లు , బోజనాది వసతులు కల్పించారు. రాత్రికి దేవాలయం ఆవరణలో వారి ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. పొద్దు పోయేంత వరకు పరమహంస గారి ప్రసంగం విన్నారు. సందేహ నివృత్తి చేసుకున్నారు.
ఉదయాన్నే గురు శిష్య బృందం మరో గ్రామం బయలు దేరింది. ఊరి పొలిమెర్ల వరకు మొదటి గ్రామస్తులు వెంట వచ్చి వీడ్కోలు చెప్పారు.
వారు వెళ్ళాక పరమహంస గారు భగవద్యానం చేసి “ ఈ గ్రామం లో కరువు కాటకాలు సంభవించి ప్రజలందరూ దేశ నలుమూలలకు వలస వెల్దురు గాక అని ఆశీర్వచనం చేశారు. శిష్యులు ఆశ్చర్య చకితులు అయ్యారు.
రెండో గ్రామం లో వారికి ఎలాటి ఆదరణ  లభించలేదు. ప్రజలు వీరిని పట్టించుకోలేదు. కనీసం బిక్షాటన చేసుకున్న వస్తువులని వండుకొటానికి కూడా సహకరించలేదు. గుడి మెట్ల మీద ఆ రాత్రి గడిపిన పరమహంస బృందం యదావిది గా మరో గ్రామం బయలు దేరింది.
మళ్ళీ పొలిమేర దాటేటప్పుడు పరమహంస వారు “ఈ గ్రామం సస్యశ్యామలంగా ఉండాలి. గ్రామస్తులందరికి ఇదే గ్రామంలో బుక్తి జరగాలి. ఇక్కడే వారు శేష జీవితం గడపాలి” అని దీవించారు.
ఈ సారి శిష్యులు ఇంకా ఆశ్చర్యపోయారు.
సందేహ నివృత్తి కోసం దైర్యం చేసి గురువు గారిని ప్రశ్నించారు. ఈ పూర్తి వ్యతిరేఖ ఆశీర్వచనం లోని అంతరార్ధం వివరించ మని.
“మొదటి గ్రామం లోని వారు సజ్జనులు.. వారి మంచి తనం దశదిసలా వ్యాపించాలి. వారి గొప్పమనసు తో దేశం నలుమూలలా సుగంధం ప్రభవించాలి. రెండవ గ్రామం వారి మూర్ఖత్వం వారితోనే నశించాలి” అని సందేహ నివృత్తి చేశారు.
వికసించిన మోముతో గురు శిష్య బృందం మరో గ్రామం వైపు ప్రయాణం సాగించింది.

(చిన్న వయసులో మా నాన్న గారు ఇలాటి మంచి కదలు బోలెడు చెప్పారు. మీరెప్పుడయినా మీ పిల్లలకి చెప్పారా?)

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...