Saturday 21 May 2016

ఏ తల్లి బిడ్డో

మొన్న మేం వైజాక్ వెళ్తుంటే జరిగింది ఈ సంఘటన.. 
(18-5-16 రాత్రి తిరుపతి పూరీ express )

***
రేజర్వేషన్ బోగీ లోకి ఒక మహిళా ఆరేడు నెలల పసిబిడ్డతో ఎక్కింది. 
ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చుంటూ ..
విజయవాడ దాటేసరికి నేలమీద పసిబిడ్డని పడుకోబెట్టుకుని నిద్ర పోతుంది. 
అర్ధ రాత్రి దాటింది.
..
భీమవరందాటేసరికి బయట వర్షం.. ..
తలుపు సందుల్లోంచి చల్లటి గాలి 
బిడ్డ ఏడుపు మొదలిట్టింది. 
సన్నగా మొదలయ్యి గుక్కపట్టి ఏడుస్తుంది. 
కంపార్టుమెంటు అంతా ఇబ్బంది వాతావరణం.
**
మాతో పాటు మా బోగీలో ఒక నడి వయసు మహిళ,ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం చేరనున్న కుమారుడుని తోడుగా తీసుకుని అరసవెల్లి దేవాలయానికి వెళుతుంది. వారి వెంట ఆమె తల్లి కూడా ఉన్నారు.
..
పసిబిడ్డ ఏడుస్తూ ఉంది. బాగా ఇబ్బందిగా ఉంది. ..
నేను పై బెర్తు నుండి అసహాయంగా చూస్తున్నాను. 
..
ఆ యువకుడి తల్లి ఆమెతో మాట్లాడుతుంది. ..
'
తల్లి పాలు లేనప్పుడు కనీసం పాల డబ్బా లేకుండా ఎలా బయలుదేరావు' అని కోప్పడుతున్నట్లు గా మాట్లాడుతుంది. 
..
ఈ లోగా పసిబిడ్డ తల్లి వాష్ రూమ్ వైపుగా వెళ్ళి రెండంటే రెండు నిమిషాల్లో వచ్చింది. బిడ్డ ఏడుపు మానేసి ఉంది. వళ్ళు తెలియకుండా నిద్ర పోతుంది. 
..
మళ్ళీ అందరూ నిద్ర లోకి జారుకోబోతున్నప్పుడు 
ఏమయిందో ఏమో ఆమె ఠక్కున లేచి కొడుకు సాయం తో TC ని పిలిపించింది...
..
సప్ష్టంగా ఈమె వైఖరి నాకు అనుమానంగా ఉంది అంది.
నేను ఆసక్తిగా లేచి కూర్చున్నాను. ..
ఈ లోగా మా శ్రీమతి కూడా..
టి సి మా శ్రీమతి బెర్త్ మీద కూర్చుని ఆమెని టికెట్ అడిగాడు. 
శ్రీకాకుళం వరకు ఉన్న జనరల్ టికెట్ అది.
..
ఆమె ..చెప్పిన సమాదానం ప్రకారం తాను చిన్న ఉద్యోగం చేస్తుంది. బిడ్డని తీసుకుని శ్రీకాకుళం బర్త దగ్గరకి వెళ్తుంది.
..
ఆమె లగేజీ చూపించమంటే ఏమి లేదు అంది 
మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చెయ్యి అన్నాడు టి సి 
నా ఫోన్ లో బెలాన్స్ లేదు. అంది నిర్లిప్తంగా...
..
ఆయన ఫోన్ నెంబరు గద్దించి అడిగి తన ఫోన్ నుండి కాల్ చేశాడు. 
అటునుండి మగమనిషి తమకి ఒకటే కుమార్తె అని ఆరేళ్ళ వయసని చెప్పటం మేమందరం విన్నాం...
..
'
నేను ఏదో చిల్లర దొంగ అని మాత్రమే అనుకున్నాను' మా ఆవిడ తోటి ఆమెతో అంది.
అయిదు నిమిషాల్లో రైల్వే పోలీస్ అక్కడికి రావటం ఆమెని వెంటబెట్టుకుని వెళ్ళటం జరిగి పోయింది.
..
ఆమె మెడ మీద నల్ల మందు(గంజాయి) తినిపించిన ఏతల్లి బిడ్డోఘాడంగా నిద్ర పోతూ ఉంది. ..
***
(20
వ తేది ఉదయం, దర్శనం అయ్యాక 'సింహాద్రి అప్పన్న' వద్ద ప్రసాదాలు కొనుక్కుంటుంటే ..మేం ఎప్పటికీ మరువలేని ఆ తల్లి కొడుకులు కనిపించారు. ఆవిడ చొరవ మరో తల్లి ని కడుపు కోత నుండి కాపాడింది. వారికి,వారి కుటుంబానికి ఆ 'సింహాద్రి అప్పన్న'కటాక్షం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. )

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...