Tuesday 17 May 2016

అమ్మ కొట్టింది

1997-98 కాలం లో నేను కురిచేడు లో పని చేస్తూండే వాడిని.
దగ్గర్లో ఉన్న మా అత్తగారి ఊరు దరిశిలో ఒక మాస్టారి ఇంట్లో అద్దె కి ఉంటుండే వారిమి.
గజం పొడుగు భావన అప్పుడప్పుడే స్కూల్ కి వెలుతుండేది.
అరగజం పొడవు జీవన ఇంట్లో మా ఆవిడని ఆడుకుంటూ ఉండేది.
..
ఒకరోజు నేను నా ఉద్యోగం విదులు నిర్వహించుకుని సాయంత్రం ఆరు అవుతుండగా బజాజ్ M-80 బండి మీద ఇంటికొచ్చేసరికి మేముండే ఇంటి కు ముందు విశాలంగా ఉన్న స్థలం లో చెట్టు కింద మా చిన్నది కూర్చొని తీరిగ్గా బిస్కెట్ నములుతూ ఉంది..
..
బండి ఇంటి దగ్గరకి వచ్చేసరికి ఏదో కుట్టినట్టు పెద్దగా ఏడుపు లంకించుకుంది. 
..
వస్తున్ననవ్వు కనబడ నీయకుండా బండి కి ముందు బాగం లో ప్రత్యకంగా చేయించిన సీటు మీద కూర్చో బెట్టుకుని ఏమయిందమ్మాఅని బుజ్జగింపుగా అడిగాను. 
..
సమాదానం తెలిసిందే .. రోజు చెప్పేదే మళ్ళీ చెప్పింది.
అమ్మ కొట్టింది” 
..
నిజమా కొట్టిందా చిట్టి తల్లిని? పిలువ్ బయటకి ఇవాలా ఆటో ఇటో తేల్చేద్దాం
నేను గట్టిగా చెప్పాను. బండి పార్కింగ్ చేసి తనని దించగానే,
గబగబా వాకిలి వద్ద కెళ్ళి
అమ్మా రామాంజమ్మా నువ్వు బయటికి రామ్మా .. మా నాన్న వచ్చాడు. నన్ను కొట్టావుగాఅంది మిగిలిన బిస్కెట్ తింటూ ..
..
మా ఆవిడ మంచినీరు తేచ్చి ఇచ్చి ఎడం మోచెయ్యి దగ్గర చూపించి
చూడండి ఎట్లా కొరికిందో ?” అంది.
సన్నటి బియ్యం పళ్ళు దిగి ఎర్రగా కమిలి ఉంది.
..
ఒక్క నిమిషం బిస్కెట్ తినటం ఆపి నా రియాక్షన్ కోసం చూసింది అర గజం.
..
అయితే మా అమ్మాయిని కొడతావా? నువ్వే కోరుక్కుని ఉంటావు. చిట్టి తల్లి మీద అభాండాలు వేస్తావా?” నేను గదిమి నట్లు మాట్లాడాను.
..
ఫ్రెష్ అయిన వెంటనే దాన్ని తీసుకుని ట్యూషన్ కి వెళ్ళిన పెద్దమ్మాయి దగ్గరకు వెళ్ళి తనని కూడా బండి మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాను.
..
పిల్లలు నిద్రపోయాక దాన్ని గారాబం చేస్తున్నావు. అది నన్ను కర్రముక్కతో కొట్టింది.అంది మా ఆవిడ.
..
సర్లేవే. చిన్న దాన్ని కొప్పడితే నాకు అదే పరిస్తితి. నా జాగర్త నాది
..
(
పాత డైరీ తిరగేస్తుంటే .. ఈ ఇన్సిడెంట్ కనబడింది. )

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...