Monday, 4 April 2016

డైట్ చార్ట్

పడక గది లోకి దోమలు రాకుండా టీపాయ్ మీద ఉంచిన సాసర్ నీళ్ళలో సగం మునిగేట్టు గా కర్పూరం ఉండ ఉంది. 
గది లో ఏసీ గాలి చల్లగా ఉంది. మెత్తటి పరుపు, 
ఈ రోజే మార్చిన , దుప్పట్లు దిండు గాలిబులు .. ఊహూ .. 
ఇవేవీ నాకు సాయం చేయటం లేదు. మంచం తగిలితే చాలు నిద్ర పోయేవాడిని. 
కానీ ఈ రోజు ..ప్చ..
***
అసలిదంతా వీళ్ళవల్లే.. అసలు నా ఆస్తి తో వీళ్ళకేం పని. 
హాయిగా ఎవడయినా ఉంటే చూస్తూ ఊరుకోరేం? 
ఏదో చిన్న బొజ్జ . నేనే కదా మోయటం. చూసేవాళ్ళకి వీళ్ళకేం బాధ? 
వేదవది మొన్నటికి మొన్న మా ఆస్థాన టైలర్ దగ్గరికి కొత్త బట్టలు కుట్టటానికి ఇస్తే.. మీ కొలతలు నా దగ్గర ఉన్నాయి సార్. ఆరు నెలలయింది కదా? పొట్ట చుట్టూ కొలత, ఫాంటు నడుము కొలత ఒక్కో అంగుళం పెంచాలి అంతె కదా అన్నాడు. 
వెదవ పైగా పక్క నే కనకం కూడా ఉన్నట్టు గుర్తు. రక్తం మరిగి పోదూ ?
***
ఇక రాష్ట్రం ఆర్దిక లోటు పూడ్చడానికి ఎవరో ఒక గన్నాయిగాడు ఖటోర నిర్ణయం తీసుకోమని మనకి చెప్పాల్నా? 
ఆమాత్రం కామన్ సెన్సు మనకి ఉంది. 
ఇక తగ్గించాలి. ఎవాళ నుండే ప్రారంభించాను. 
**
ఇంట్లో చెప్పాను. ఇక స్త్రీక్త్లీ ఫాలౌయింగ్ డైట్ చార్ట్ అని. 
ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లొచ్చాను. నాలు గంటే నాలుగు పల్చటి ఇడ్లీ కారోప్పొడి విటౌట్ నెయ్యి అండ్ పప్పు చేట్నీ తిన్నాను. 
ఒక్క గ్లాసు మజ్జిగ తాగాను. 
**
మద్యాన్నం ఒక గిన్నె తలకొట్టి అన్నం కోలిసి వడ్డించుకుని ఉప్పు తక్కువ ఆకుకూర కలుపుకుని (యాక్) తిని, పాలచటి మజ్జిగ లో అన్నం మెతుకులు వేరుకుని తిన్నాను. 
**
ఇక అప్పటి నుండి నో స్నాక్స్, ఆర్ టీ . 
బయంకరమయిన ఆరోగ్య సూత్రాలు సాయంత్రం ఇంటి కొచ్చి స్నానం చేసినప్పటి నుండి ఏదో అవుతుంది. 
వంగినప్పుడు తల జారీ కింద పడుతుంది. 
పడుకుంటే సీలింగ్ ఫాను సర్కులర్ గానే కాకుండా హారిజంటల్, డయాగ్నల్ గా కూడా తిరుగుతుంది. 
అది ఆపేసి ఏసీ వేసుకుంటే చల్లటి గాలి కూడా నిద్రని రానివ్వటం లేదు. 
కడుపులో ఉండ తిప్పినట్లు ఒక రకంగా కాసేపు, అనేక రకంగా మరికొంత సేపు .. 
***
పక్కనే గుండమ్మ కారు స్టార్ట్ చేసింది. 
ఎంత సుఖంగా నిద్ర పోతుంది. ??
అటు ఇటు దొర్లాను, కాసేపు బోర్లా పడుకున్నాను, 
రెండు మూడు యోగా బంగిమలు ట్రై చేశాను. 
ఊహూ ఏమి లాభం లేదు. 
100
నుండి వెనక్కి నంబర్స్ లెక్కేట్టాను . సరిగానే ఉన్నాయి. 
మూడువందల ముపై నాలుగుని రెండువందల అరవై ఏడు తో గుణించాను. సమాదానం తో పాటు దాహం అయింది. 
టీపాయ్ మీద వాటర్ బాటిల్ లేదు. 
**
శబ్దం చేయకుండా లేచి వంటింట్లోకి నడిచాను. 
కుండలో నీళ్ళు ముంచుకుంటుంటే డైనింగ్ టేబుల్ మీద సర్దకుండా ఉంచిన గిన్నెలు తిరగేసి ఉంచిన ప్లేటు ఉన్నాయి.
**
రైస్ కుక్కర్లో అన్నం మల్లెపువ్వుల్లా మెరుస్తుంది. 
మూత ఉంచిన గిన్నెలో పండిన కాకరకాయ, బెల్లం తో చేసిన పులుసు కూర, మరో చిన్న గిన్నె లో గడ్డ పెరుగు ఉంది. 
**
జీవితం లో సమస్యలు ఎప్పుడు సమూహంగానే వస్తాయి. 
ఆలాటప్పుడే మనం సంయమనం పాటించాలి. 
దైర్యంగా వివేకంగా ప్రవర్తించాలి. 
రేపటి నుండి ఖచ్చితంగా డైట్ చార్టు పాటించాలని ఖాళీ అయిన కాకరగాయ పులుసు మీద గట్టిగా ఒట్టేశాను. 
****
మెల్లగా వచ్చి పడుకుంటుంటే.. 
ఎందుకో అనుమానం వచ్చి చూస్తే గుండమ్మ బుజాలు చిన్నగా ఊగుతున్నాయ్. కొంపదీసి గుండమ్మ మేలుకునే ఉందా? అటుతిరిగి నవ్వుతుందా ?? 
వెయ్యి డాలర్ల కొచ్చెన్.. 
నిద్ర ముంచుకొస్తుంది ... గున్నైట్ స్వీ ఈ ఈ ఈ ట్

No comments: