Wednesday 10 February 2016

పరుగో పరుగు

పని రాక్షసులారా? మీ కోసం.
ఫ్లాట్ కి వెళ్ళాక తాళం తీయకుండా ఐ‌డి కార్డు స్వీప్ చేస్తున్నారా?
స్నేహితురాలితో రెస్టారెంట్ కి వెళ్ళి బోజనమ్ చేశాక ప్లేట్ తీసుకుని వాష్ బేసిన్ వద్దకి వెళ్తున్నారా?
తండ్రి తో మాట్లాడే టప్పుడు తల్లి పక్కనే లేదని “ వీక్లీ స్టేటస్ కాల్ అటెండవాలని తెలీదా ?” అంటున్నారా?
ఎఫ్‌బి ఆకవుంటూ బ్లాక్ చేస్తారని ఇంట్లో ఉన్నప్పుడూ కూడా బయపడుతున్నారా?
మిత్రులతో మాట్లాడుతూ వీడ్కోలు అప్పుడు “in case of any issues will call you back” అంటున్నారా??
ఫోన్లో పొరపాటున డిలేట్ చేసిన మెసేజ్ లు  రీసైకిలింగ్ బిన్ లో ఉంటాయని అనిపిస్తుందా??
మెడికల్ షాపు లో ఫార్మసిస్ట్ 250 ఎం‌జి నా? 500 ఎం‌జి నా? అని అడిగితే 256 ఎం‌బి అని చెబుతున్నారా?
సినిమా చూస్తూ టైమ్ ఎంతయిందో అనిపించినపుడు తెర కుడివైపు బాటమ్ కార్నర్ వెతుకుతున్నారా?
రోడ్డు మీద ఆగి లంచ్ బాక్స్ ఖాళీ/ నిండు గా ఉండటాన్ని బట్టి ఆఫీసుకి వెళ్తున్నారో, ఆఫీసునుండి వస్తున్నారో డిసైడ్ చేసుకుంటున్నారా?
అబ్బాయిలు .. అమ్మాయిలు.. కనీసం ఒక వారం సెలవు పడేసి మీ అమ్మమ్మ దగ్గరకో , నాయినమ్మ దగ్గరకో వెళ్ళండి. స్మార్ట్ ఫోన్లు విసిరి మురికి కాలవలో వెయ్యండి.
మిమ్మల్ని మీరు కొల్పెయే లోగా కొంత చైతన్యం పొందడానికి.
60 సెకండ్స్ లో చెప్పండి ఉదయం మీ బార్య/ బర్త వేసుకున్న డ్రస్ గుర్తుందా?
కనీసం వాళ్ళని లోగడ ఎప్పుడు అబినందించారో గుర్తుందా??
మీ పిల్లలు చదివే స్కూల్ ఎక్కడ? మీ నాన్న/అమ్మ తాజాగా ఇబ్బంది పడ్డ అనారోగ్యం?
మీకు ఎన్ని బాంకు  అకౌంట్స్ ఉన్నాయి.

మనం ఎక్కడ ఉన్నాం? 
ఏం చేస్తున్నాం ?? 
ఎవరికోసం పరిగెడుతున్నం ??

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...