Saturday 2 January 2016

అమ్మ దగ్గరకి !!

ఒకటో తేదీ హంగోవర్ తగ్గుముఖం పట్టిందో లేదో 
పెళ్ళాం బాగు సర్దుకోవటం గమనించాడు అతను.
(మనకి అర్ధమయ్యేట్టుగా సర్దుకోవటం ఒక గొప్ప కళ అని సీనియర్లు అంటుంటారు )
***
"ఏమయింది ! బంగారం .??"
"ఇఖ నావల్ల ఖాదు. నేను వెళ్ళి పోతున్నాను"
రెండు 'ఖ' ల ఉపయోగానికి మత్తు వదిలింది మనాడికి.
"ఎక్కడికి ?? "
"మా అమ్మ గారింటికి? "
***
చాటుగా సర్దుకుంటున్నా అతను చేస్తున్న పని ఆమెకి అర్ధమవుద్ది.
(మనం బాత్రూములో సెల్ లో చెక్ చేసుకునేవి కూడా వాళ్ళకు కనబడతాయి.).
"నువ్వేందుకు సర్దుకుంటున్నావు ?" ఆమె అడుగుతుంది.
"నేను మా అమ్మ దగ్గరకి" అతడి సమాదానం.
***
"మరి పిల్లలు??" ఆమె అరిచింది.
"వాళ్ళు కూడా వాళ్ళమ్మ దగ్గరకి వెళ్తారు " tongue emoticon pacman emoticon 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...