Wednesday 13 January 2016

అచ్చు - బొమ్మ


'అమ్మ ఉదయం నాలుగున్నర ట్రైన్ కి వస్తుంది' వేరేఉరు నుండి బర్త 
వాట్స్ అప్ లో ఉంచిన మెస్సెజ్ చదివింది బార్య.
--
"
మొన్నే కదా పోయిన అక్టోబర్ లో వచ్చింది. 
పైగా ఆదివారం. కనీసం రేపన్నా కంటి నిండా నిద్ర పోదామనుకున్నాను.
ఆదివారమే కుదిరిందా ఆమెకి. ఆ టైమ్ లో ఆటొ వాడు అక్కడి నుండి రావటానికి నెల జీతం అడుగుతాడు. సిటీ బస్సు ఆరు దాటాక కానీ రాదు. దిగిన దగ్గర నుండి ఫోన్ లు . 
మీరు అక్కడ ఉండి ఎన్నో చెబుతారు. నాకు ఆదివారం కూడా రెస్ట్ ఉండదు. ఈ వారం రోజులు నాకు చాకిరీ. పిల్లలు చదువు సాగనివ్వదు. ఎంత సేపు వాళ్ళని కూర్చో బెట్టుకుని సోది మాటలు చెబుతుంటుంది." ఆమె texting కోన సాగుతూనే ఉంది.
..
"
వస్తుంది .. మీ అమ్మ"....
..
"
నిజమా . మరి చెప్పరే మొన్నెప్పుడో డిసెంబరు లో చూశాను. 
సమయానికి మీరు కూడా లేరు. పాపం తెల్లవారు ఝామున ఇబ్బంది పడుతుందో ఏమో. తెలిసిన ఆటొ వాడి నెంబరు ఉండాలి అతని కి ఫోన్ చేసి స్టేషని కి పంపుతాను. 
ఆదివారం రావటం మంచి దయింది. ఇంటి దగ్గర ఉంటాను. ఊదయాన్నే ఏదయినా టిఫిన్ చేసి పెడతాను. పిల్లలు ఆమెతో బాగా ఆడుకుంటారు. బోలెడు కబుర్లు చెబుతుంది ఆవిడ. మనకి తెలియని మంచి మంచి కదలు బాగా వింటారు".
...
అటునుండి ఆఫ్ లైన్ సింబల్ వచ్చింది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...