Sunday 31 January 2016

ఫ్రీస్బీ


ఒక లావుగా ఉన్న పెంపుడు కుక్కని తీసుకుని ఆమె వెటర్నరీ డాక్టర్ వద్దకి వెళ్లింది.
కంప్లైంట్ చెప్పింది.
పరీక్షించిన డాక్టర్ “ ఓవర్ వైట్ అయింది. ఫిజికల్ గా వ్యాయామం అవసరం”
“ఇప్పుడు నన్నెం చెయ్యమంటారు. మందులేవయినా వాడాలా ?”
“ఏమి అక్కర్లేదు ప్రిస్బీ అదే ప్లాస్టిక్ డిస్క్ విసిరేస్తే పరిగెత్తు కెళ్ళి ఎగిరి పట్టుకురావటం. అది ఆడించండి కొన్నాళ్లు”
..
..
..

“కానీ దీనికి డిస్క్ విసరటం  రాదే?? ఎలా?? “ 

టిపినీ లో మజ్జిగ

అరచేతి లో కొబ్బరికాయ ఉంచుకుని మూడున్నర ఎకరాల పొలం లో చుట్టూ తిరిగాడు రాఘవయ్య 

అక్కడక్కడా ఆగటం విభూది పూసిన నుదుటిని చిట్లించి ఆకాశం లోకి చూడటం అనుమానంగా తలూపటం మళ్ళీ కొంత దూరం నడవటం ఇలా అరగంట నుండి పోలమంతా నీటి ధార కోసం గుండ్రంగా తిరుగుతూనే ఉన్నాడు. 
అతని తో పాటు రైతు వెంకట్రామయ్య కూడా ఆకాశం లోకి అతడి నుదుటి వైపు కి దీనంగా చూస్తూ ఉత్త కాళ్లతో తిరుగుతున్నాడు.
***
రాఘవయ్య హట్టాత్తుగా అగాడు. పెద్దగా మంత్రాలు చదివాడు. చేతిలో కొబ్బరి కాయ పక్కకి  వంగింది.
..
ఇక్కడే ..ఇక్కడే పాతాళ గంగ ఉంది .. రెపే తోవ్వించు మూడొందలు అడుగులో రెండు ఇంచులు నిళ్ళు ఉన్నాయి
..
వెంకట్రామయ్య ముఖంలో ఆనందం తొంగిచూసింది.
దానిలో చాలా బాగం ఆశ నిండి ఉంది.
ఈ ఏడాది అప్పటికే మూడు చోట్ల బోర్లు తవ్వించాడు.
చుక్క నీరు పడలేదు. ఉన్న ఒక్క బోరు వట్టి పోతూ ఉంది. .
నిమ్మ తోట ఏండి పోతూ ఉంది. నీటి తడి లేక చెట్టు కాపు లేక గిటకబారి పోతుంది.
మూడేళ్ళ నుండి కన్న బిడ్డళ్ళా పెంచుకున్న మొక్కలు. ఏండి పోతుంటే దుఖం తన్నుకు వస్తుంది.
***
రాఘవయ్య చెప్పిన చోట గుర్తుగా గడ్డపార్తో తవ్వి ఒక రాయి పాతాడు.
..
పొలం గట్టు వద్దకి వచ్చి నీడగా ఉన్న పాక దగ్గర ఆగారు ఇద్దరు...
***
వెంకట్రామయ్య బార్య అప్పటికే అక్కడికి వచ్చి ఉంది.
నిమ్మ చెట్టు మొదట్లో కలుపు మొక్కొకటి కనిపిస్తే శుభ్రం చేస్తూ ఉంది.
**
వెంకట్రామయ్య ని ఉద్దేశించి "ఆ టిపినీ లో మజ్జిగ ఉన్నాయి సాములోరికి ఇవ్వు" అంది
..
అక్కడ మూత పెట్టిన నాలుగు టీపీనీలు (మనం ఇళ్ళలో వాడే వంటింటి కాడ ఉన్న పప్పుడబ్బాలు ).. ఉన్నాయి.
..
ఎందులో ఉన్నాయే మజ్జిగ ? “ పెళ్ళాం మీద కేకేసాడు...
..
నీకు అర్ధం కాదులే మామా.. 300 అడుగుల కింద నీళ్ళు కనబడిన సాములోరికి మజ్జిగ ఎందులో ఉంది తెలుస్తుంది లే.. సాములోరిని అడుగు

Saturday 30 January 2016

గంగులు

మా ఊర్లో స్టేట్ బాంక్., మైన్ బ్రాంచ్ రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది.
ఉత్తరం తూర్పు రోడ్డు ఎడమవైపు ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఎదురుగా రోడ్డు దాటాక మండల కార్యాలయాలు, మరో పక్క సబ్ జైల్ ఉంటాయి.
***
మొన్నో రోజు సోమవారం నాడు ఉదయం స్టేట్ బాంకు లో ఒక సమస్య వచ్చింది.
ని ఆది వారాల రోజుల సెలవు మీద వరంగల్ వెళ్ళి వెచ్చిన మానేజర్ బాంకు కీస్ బదులు అదే ఆకారం లో ఉన్న మరో తాళాల గుత్తి పట్టుకురావటం, తీరా లాకర్ ఓపెన్ చేసే టప్పుడు
పొరపాటు గమనించడం జరిగింది. వరంగల్ నుండి తాళాలు మనిషి చేత పంపించమని కొడుక్కీ ఫోన్ చేశాడు. సాయంత్రానికి గాని అవి రావు.
***
అది మైన్ బ్రాంచ్ అవటం, నెల మొదటి వారం అవటం తో భారీ లావాదేవీలు జరగాల్సి ఉంది. మేనేజర్ కి ముచ్చెమటలు పోశాయి. టైమ్ పది అవుతూ ఉంది. స్టాఫ్ ఒక్కొక్కరే వచ్చి తమ సీట్ లో కూర్చుంటున్నారు.
స్ట్రాంగ్ రూము దగ్గర అంతా పొగయ్యారు.
***
సమస్య పరిష్కారానికి ఎప్పుడు రెండు మూడు మార్గాలు ఉంటాయి.
మనం ఎప్పుడు బాక్స్ లొంచే ఆలోచిస్తాం. బాక్స్ బయటనించి కూడా ఆలోచించవచ్చు
అలా ఆలోచించగలిగిన ఒక క్లర్క్ మన మేనేజర్ చెవిలో ఒక అయిడియా చెప్పాడు.
***
ఎదురుగా ఉన్న సబ్ జైల్ లో ఖైదీ గా ఉన్న ఒక ప్రొఫెషనల్ ని గార్డు సాయం తో రహస్యంగా. (?) తీసుకు వచ్చారు.  జైలర్ కి మానేజర్ కి తడి స్నేహం ఉండటం తో కొంత పని సులువయ్యింది. తడి స్నేహాలు  చాలా ఘాడం గా ఉంటాయి.
***
పదంటే పది నిమిషాలలో లాకర్ ఓపెన్ అయ్యింది.
మేనేజర్ కి సంతోషం తో మాట రాలేదు. కళ్ళు చెమ్మగిల్లాయి.
"చాలా థాంక్స్ గంగులూ ." అతని చేతులు పట్టుకున్నాడు.
***
నీకు ఎంత కావాలో చెప్పు, జేబులోంచి వాలేట్ తీశాడు మానేజర్.
..
..
..
"పోయిన సారి ఇదే పనికి 23 లక్షలా 74 వేల ఆరువందల యాబై గిట్టింది "
గంగులు గర్వంగా చెప్పాడు.



Friday 29 January 2016

సిద్దూ

మొన్నోక రోజు  పొదిలి నుండి నేను, నా కొలీగ్, ఒంగోలు లో మర్నాడు అటెండవాల్సిన ఆడిట్ కోసం కొన్ని రికార్డ్స్ తీసుకుని బస్సులో వచ్చి బై పాస్ రోడ్డు వద్ద దిగాము.
అప్పటికే తాను ఫోన్ చెయ్యటం వల్ల , ఎం.టెక్ చదివి హైదరాబాదు లో స్ట్రక్చరల్ ఇంజనీరుగా పని చేస్తూ శలవు మీద ఇంటికొచ్చిన కుమార్డు సిద్దు , ఆల్తో 800 తీసుకుని వచ్చాడు. లగేజీ అందులో వేసుకుని ఇంటికి బయలు దేరాము.
మంగమూరు రోడ్డులో జెడ్.పి కాలనీ వద్దకి వచ్చే సరికి మా దారులు  మారే చౌరస్తా వచ్చింది.
మా కొలీగ్ దిగి, అంకుల్ ని ఇంటివద్ద దించి రా నేనిక్కడే ఉంటాను” అన్నాడు కొడుకుతో.
అక్కడికి సరిగ్గా అయిదు నిమిషాలు కూడా పట్టదు.మా ఇంటివరకు రావటానికి.
“రా పి వి  .. ఇంట్లో టి తాగుదాం” నేను పిలిచాను.
ఇక్కడే ఉంటాను వెళ్ళి రండి అని మరో సారి చెప్పాడు మా వాడు.
“రా.. డాడీ నువ్వు కార్లో కూర్చో ఎంత సేపు వచ్చేస్తాం గా ??” సిద్దు అడిగాడు.
“నువ్వు పోయి రారా ఇక్కడే ఉంటాను “  మావాడు ఈ సారి గట్టిగా..
రా డాడీ “ అని 23 ఏండ్ల కొడుకు ..
ఒక తెలియని ఇబ్బంది తో కూడిన వాతావరణం.
సిద్దు అయిష్టం గానే కారు గేరు మార్చాడు.
ఆ అయిదు నిమిషాల్లో వాడితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న నాకు.. కూడా  ఏమి మాట్లాడాలనిపించలేదు.
ఇంటి ముందు కారు దిగి లాగేజీ దించుకుంటుంటే మా శ్రీమతి ఎదురొచ్చింది సాయం కోసం.
“ సిద్దు బాగున్నావా ?” తను కూడా బాబుని పలకరించింది.
వాడు “బాగున్నాను ఆంటీ” అని పేలవంగా నవ్వాడు.
నన్ను దించి వేగంగా కారు మలుపు తిప్పుకు ని వెళ్ళాడు.
కనీసం రెండో సిగిరెట్టు ముట్టించకుండా వాళ్ళ డాడీని ఆపాలని వాడి ఆరాటం.

ఆరే  పి.వి (మా మిత్రుడు).. పిల్లాడి  గొంతులో ప్రేమ ని నువ్వు గుర్తించలేదా ?? 
అంత తోలుమందం మంచిది కాదేమో ఆలోచించు..” 

Wednesday 27 January 2016

స్పీడ్ బంపర్స్

రెండు సంవత్సరాల క్రితం నేను ఒక పిల్లాడిని ఇంజినీరింగ్ (సివిల్) చేర్చడానికి ప్రకాశం జిల్లా, ఏ.పి కందుకూరు రోడ్డు లో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీ కి నా మారుతి కార్లో వెళ్ళాను.
గేటు నుండి మైన్ క్యాంపస్ వరకు ఫర్లాంగ్ దూరం పైనే ఉంది. పదినిమిషాలు కాలం పట్టింది అక్కడికి చేరటానికి. నడిచి వెళ్తే మరో రెండు నిమిషాల ముందే చేరేవాళ్లం. 
అన్నీ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి (స్పీడ్ బంపర్స్). 
JUNE 01 1906 లో మొదటిసారిగా న్యూ జెర్సీ లో ప్రారంభమయిన స్పీడ్ బ్రేకర్స్ ని అప్పట్లో స్లీపింగ్ పోలీస్ మెన్ గా భావించే వాళ్ళు.



***
వీటి నిర్మాణాన్ని ఒక్క నిమిషం పరిశీలిద్దాం. వేగంగా వెళ్ళే వాహనాల వేగాన్ని  25 కి మీ కి దిగువగా తగ్గించడానికి వీటి నిర్మాణం  ప్రారంభించారు. ఒక్కో SB రెండు మీటర్ల వెడల్పు (6'5"), 12.5 సెంటిమిటరు (5") ఎత్తు మించ కుండా ఉండాలి. రెండు వైపులా రాత్రి పుట కూడా మెరిసేలా గళ్ళ పెయింటింగ్ వెయ్యాలి. రెండు SB ల మధ్య మరో రెండు మీటర్లు దూరం ఉండాలి. ఇవి నియమాలు.

***
వాస్తవం ఏమిటి మనందరికీ తెలుసు. పర్మిషన్ లేని SB లు ఎవరికి వారే దగ్గర దగ్గర గా ఆరంగుళాల మించిన  ఎత్తు, అడుగు వెడల్పుతో అడ్డుగోడలా  వేసుకోవటం, వాహనాల వేగాన్నే కాదు, వాటి మన్నికని, చోదకుల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదం లోకి నెట్టేస్తున్నాయి. ఇక వార్నింగ్ నేమ్ బొర్డ్స్, రేడియం కలర్స్ ను ఊహించే ప్రయత్నం చేయకండి. 



ముఖ్యంగా బైకెర్స్ ఒక్క సారి ఒక SB మీద గమనించలేక  డ్రైవింగ్ చేసినప్పుడు వెన్నెముక  కనీసం అయిదు వేల  ప్రకంపనాలు చేస్తుందని మా డాక్టర్ మిత్రుడు చెబితే నోట మాట రాలేదు. ఈ లెక్కన మనన్ని ఇవి కాపాడుతున్నాయా? లేక మన వాహనాలను, మనన్ని నాశనం చేస్తున్నాయా?.

నగరాల్లో స్కూటీలు, నడిపే చిన్నారులు, పసివాళ్లని స్కూల్స్ లో దించడానికి వెళ్ళే తల్లులు, వేగాన్ని నియంత్రించుకోలేని చోదకులు ఎంత మండి ప్రమాదాల బారిన పడుతున్నారో గమనిస్తే కడుపూ తరుక్కు పోతుంది. అదికార్ల నిర్లక్షం, సహచరుల అజ్ఞానం నుండి బయట పడక పోతే ఇవి ప్రాణాలని తీయడం కొనసాగుతూనే ఉంటుంది.
**
స్పీడ్ బంప్స్ /బ్రేకేర్స్ అవసరమే. కానీ డిజైన్ ప్రకారం ఉంటే అందరికీ ఉపయోగం.
ఒక్క సారి ఆలోచించండి మన SB ల పరిస్తితి??
****
PS:
నేను ఆపిల్లాడిని ఆ కాలేజీ లో చేర్పించ లేదు. .వాళ్ళ HOD తో ఇదే చెప్పాను. ముందు మీ క్యాంపస్ లో స్పీడ్ బ్రేకర్స్ చూసిన వాడేవడూ ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చదవడు అని .

Monday 25 January 2016

ఎప్పుడొచ్చావు ?

అప్పటిదాకా క్రికెట్టు మాచ్, హైలైట్స్ విశ్లేషణలు చూసి వచ్చి
"
ఇవాళ్ళ లంచ్ లోకి ఏమి వండావు ??"
అని వేపిన కందులు విసురుకుంటున్న ఇల్లాలిని అడిగాడాయన.
..
సర్రుమంది ఆమెకి. వివేకవంతురాలు కాబట్టి ..
గొంతులోకి వీలయినంత సౌమ్యం తెచ్చి పెట్టుకుని
"
ఇవాల్టికి ఊరు వెళ్ళానను కొని మీరే వండుకోండి" అంది.
...
తమిళ తంబి లాగా లుంగీ ఎగ్గట్టి వంటింట్లోకి నడిచాడు....
..
రైస్ కుక్కర్లో బియ్యం ఎసరు, చేతికొచ్చిన కూరగాయలు తరిగి ..
వాటి ముక్కలు, ఉప్పు కారం కొద్దిగా డాల్డా వేసి స్విచ్ వేశాడు.

..
ఆకలి వల్ల 'కిచిడి' అద్బుతంగా అనిపించి గిన్నె ఖాళీ చేశాడు...
..
చేతిలో పని పూర్తి చేసుకుని ఇంట్లో కొచ్చింది ఆవిడ.
"
నాకేది ?" అంది ఖాళీ గిన్నె చూసి .
***
"
నువ్వు ఉరినుండి ఎప్పుడొచ్చావు ?" అడిగాడాయన. ..

సాయం ;)

ఆదివారం సాయంత్రం తలుపు కొట్టిన చప్పుదయింది.
**
రఘుపతి తలుపు తీశాడు.
**
పక్క ఫ్లాట్ విడాకులు తీసుకున్నావిడ 
**
"ఇంట్లో సుశీల ఉందా?"
**
లేదు ..
**
"నాకు జీవితం లో ఏమి మిస్ అయ్యానో తెలిసింది.
ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.
నాకు అందరిలాగా ఆనందంగా ఉండాలని ఉంది.
సినిమాలు, షికార్లు, పార్క్లు లు ."
**
రఘుపతి గబగబా వెళ్ళి బట్టలు మార్చుకుని తలదువ్వుకుని వచ్చాడు.
"నాకో సాయం చేస్తారా? " ఆమె అడిగింది.
**
"చెప్పండి " రఘుపతి జేబులో వాలేట్ చూసుకుంటూ అడిగాడు.
..
..
..
..
..
..
"ఇంట్లో పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూసుకుంటూ ఉంటారా? "

Saturday 23 January 2016

మాట్లాడే కుక్క

బిజినెస్ స్కూల్ లో చదివే పిల్లాడికి డబ్బు ఎన్ని రకాలుగా వినియోగించు కోవచ్చో రెండు నెలల లోనే తెలిసింది.
మూడో నెలలో తండ్రికి ఫోన్ చేశాడు. నాన్న గారు ఇక్కడ బిజినెస్ స్కూల్ లో నవీన విధ్యా విధానాలు ఎంతగా అభివృద్ది చెందాయి అంటే మీరు నమ్మ లేనంత. మన కుక్క పిల్ల పింటో కి అయినా మాట్లాడటం నేర్పించగలరు.
నిజమా . అయితే మన పింటో ని మన ఆఫీసు లో మేనేజర్ కి కిచ్చి పంపుతాను. మాటలు నేర్పించమను. దానికి అవసరమయ్యే యాబై వేలు కూడా పంపుతున్నాను
మరో నెల గడిచింది. పిల్లాడికి మళ్ళీ ఆర్ధిక అవసరాలు వచ్చాయి.
ఇంటికి ఫోన్ చేశాడు.
పింటో ఎలా ఉంది ఆతృతగా అడిగాడు తండ్రి.
ఎక్ష్లెంట్ నాన్న గారు . చాలా మాటలు వచ్చాయి దానికి. ప్రస్తుతం మా స్కూల్ లో జంతువులకి చదివటం నేర్పుతున్నారు
ఏమిటి నిజమేఆశ్చర్యపోయాడాయన.
మన పింటో ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ లో ఉంది. లాస్ట్ సండే టెస్ట్ లో టాపర్ కూడా పింటో నే
మరో యబై పంపించాడు ఈయన.
నాన్న గారు మరో యబై పంపండి. ఫాకల్టీ ఇటలీ నుండి వచ్చారు
డబ్బు జబ్బు చేసిన తండ్రి అది కూడా పంపాడు.
మొదటి యడాది గడిచింది. పింటో ఎలా ఉంది?” ఈయన ప్రశ్న.
క్లాస్ టాపర్ నాన్నగారు. మీరు నమ్మరు గాని మిగతా జంతువులకి మన పింటో నే  చదవటం లో సాయం చేస్తుంది.
ఆయన ఉప్పొంగి పోయాడు.  కొడుకి కంటే పింటో ని కలవటానికే తహ తహ లాడాడు.
సెమిస్టర్ పూర్తి అయ్యాక సెలవులకి ఇంటికొచ్చే ముందు రోజు కొడుకు ఫోన్ చేశాడు.
నాన్నగారు చిన్న బ్యాడ్  న్యూస్
ఏమయ్యింది?” అడిగాడాయన.
ఉదయం లాగేజీ సర్దుకుంటుంటే మన పింటో హల్లో సోఫాలో కూర్చుని రోజూ లాగే ఏకానామిక్ టైమ్స్ చదువుతూఅన్నట్టు మీ నాన్న ఇంకా కనకానికి లైన్ వేస్తూనే ఉన్నాడా?” అని అడిగింది.
లమ్దీ ముండ దానికేట్టా తెలిసిందిరా.. అది వచ్చి మీ అమ్మ ముందు వాగక ముందే దాన్ని రైల్ కింద వేసి చంపు
ఇప్పుడు ఆ పనే చేసి వస్తున్నాను నాన్న గారు
***
ఆ పిల్లాడు తర్వాత కాలం లో లా కూడా చదివి డిల్లీ లో పార్లెమెంటు లో ఇలాటి పనే చేస్తూ ఉన్నాడు .
ఇక నిద్ర పోండి. గుడ్ నైట్ ;)

Wednesday 20 January 2016

సందేహం

ఆడీ- క్యూ 5 కారు పార్కు చేసి, ఖరీదయిన రెస్టారెంట్ కి వెళ్లారు ఇద్దరు.
..
ఫామిలీ రూము లో కూర్చున్నాక ..
..
అతను ఆమెతో
"నీతో ఒక ముఖ్యమయిన విషయం చెప్పాలి " అన్నాడు.
..
అతని గొంతులోని సీరియస్ నెస్ ఆమె కనిపెట్టింది...
....
ఆమె అతనికి పరిచయం అయ్యి నెల కూడా దాటలేదు.
..
వీకెండ్ కి లాగ్ డ్రైవ్ లకి తీసుకెళ్లటం.. ..
డబ్బు లెక్కచూడకుండా ఖర్చు చేయటం.
పెర్ఫ్యూమ్స్, ఆశ్చర్యపరిచే బహుమతులు
గత నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఆమె.
**
"నువ్వనుకున్నట్లు ..
నేను ఆన్మారీడ్ కాదు.. పెళ్లయింది. ఇద్దరు కిడ్స్ కూడా"
మెల్లగా అయినా స్పస్టంగా చెప్పాడు. అతను.
**
..
..
..
..
..
..
..
..
..
..
..
"నా కళ్లలోకి చూసి నిజం చెప్పు కారు ని సొంతమేగా?" ఆమె సందేహం.

వాలెంటెన్స్ డే ఆఫర్


మా చైన్ హోటల్స్ కి ఫిబ్రవరి 14 న 
మీ బార్యతో రండి... ఫుడ్ ఐటం మీద 20% డిస్కౌంట్ పొందండి.
మీ గర్ల్ ఫ్రెండ్ తో రండి 30% డిస్కౌంట్ పొందండి
మీ లవర్ తో రండి...... 35% డిస్కౌంట్ పొందండి
***
లేదూ ...
..
..
..
..
పై ముగ్గురితో రండి.. ఏకమొత్తంగా 100% రాయితీ ..
పైగా సంఘమిత్ర హాస్పటల్ లో 30 రోజుల స్టే ...ఫ్రీ ....

Tuesday 19 January 2016

స్టార్ హోటల్

బాంకు లావాదేవీల్లో బాగా డబ్బు కలిసి వచ్చి 
బాబాయిలు పట్టుకెల్లో లోపు ఒక స్టార్ హోటల్ కి వెళ్ళిన రఘుపతి
టీ ఆర్డర్ ఇచ్చాడు డాబుగా..
***
అరగంట తర్వాత ఒక రాచరికపు దుస్తుల్లో ఉన్న వైటర్, 
ఒక ట్రే నెట్టుకుంటూ వచ్చాడు.
ఒక కెటిల్ లో వేడి నీళ్ళు, మరో కెటిల్ లో వేడి పాలు,
కొన్ని తేయాకు ఆకులు, పొడి , సుగర్ క్యూబ్ లు
అర్ధం కానీ పదార్ధాలు మరో అర డజను ఉన్నాయి అందులో.
***
మొత్హానికి నానా తంటాలు పడి 'టీ' లాటిది తయారు చేసుకుని తాగాననిపించాడు.
**
కాసేపటికి మళ్ళీ ఆర్డర్ తీసుకోటానికి మరొక కోటు మనిషి వచ్చాడు.
**
“ఎని థింగ్ మోర్ సర్ ?” అడిగాడు.
**
“మంచి పలావు తినాలని వచ్చానయ్యా,
ఏదో టి అంటే పర్లేదు కానీ పలావు వండటం నాకు రాదు .. బిల్లెట్టుకురా “

Monday 18 January 2016

సన్నాసులు

కుంభమేళా సన్నాసుల సంఖ్య 
ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది.
**
మీ బర్తలను కలత పెట్ట వద్దు.
ప్రేమగా చూసుకోండి.
(కనీసం పుష్కరాలు అయ్యేంత వరకు)
***
-----------హరిద్వార్ మునిసిపాలిటీ ..

Saturday 16 January 2016

సంక్రాంతి శుభాకాంక్షలు

మిత్రులందరికి , భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. .
మా ఇంటిని రంగవెల్లి చేసిన మా చిన్నమ్మాయి జీవన స్రవంతి .



Friday 15 January 2016

పీపా తో ఆమె.

తూత్తుకుడి నుండి అండమాన్ దీవులకి సాహసయాత్ర చేస్తున్న 34 ఏండ్ల నావికుడుకి పడవ దురదృష్ట వశాత్తు విరిగి పోయింది. 
లైఫ్ జాకెట్ సాయంతో దగ్గరలో ఉన్న ద్వీపానికి ఈదుకుంటూ ప్రాణాలు దక్కించుకున్నాడతను. 
కను చూపు మేరలో మనిషి జాడ లేదు, 
విశాలమయిన సముద్ర తీరం, చిక్కటి అడవి అంతే..
***
అవసరం ఏమయినా నేర్పుతుంది. 
అతను అక్కడే ప్రాణాలు దక్కించుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. 
తనతో ఉన్న బటన్ నైఫ్ తో వెదురు చెక్కి ఆయుదాలు, 
చిన్న గుడిసె లాటి ఆవాసం, పళ్ళు ఫలాలు తినటం, 
దూరాన చెలమ లో నీరు తాగటం....
**
చూస్తుండగానే కాలం గడిచిపోయినాయి. 
సముద్రం లోకి సాయం కోసం ఆశగా చూడటం కూడా మానుకున్నాడు. 
ఎవరు తోడు లేరు. ఒంటరి జీవితం.. 
నిస్సారంగా గడిచిపోతున్నప్పుడు...
**
హటాత్తుగా ఒక రోజు ఒక చెక్క పీపా సాయం తో 
ఒడ్డుకు ఈదుతూ వస్తున్న యువతిని గమనించాడు. 
పరిగెత్తి ఆమెను బయటకి లాక్కొచ్చాడు. 
నాలు గేళ్లు గా మరో మనిషిని చూడని ఒంటరి తనం అతన్ని పిచ్చి వాడిని చేసింది. తడిచి అస్తవ్యస్తంగా ఉన్న బట్టల్తో అందమయిన ఆమె .. 
తెప్పరిల్లింది. తెరుకున్నాక అతని పెరిగిన గడ్డం చూసి
ఎన్నాలయ్యింది వచ్చి ?” అంది. 
ఏమో గుర్తు లేదు 2012 లో అనుకుంటాను
మై గాడ్ ఇది 2016 ఈ రోజు సంక్రాంతి. 
మా 12 మెన్ షిప్ నికోబార్ దివికి వెళ్తుండగా పేలి పోయింది.
ఏమయిందో తెలీదు. ఎవరు ఎటు వెళ్లారో తెలీదు. 
నాకు కనిపించిన పిపాని పట్టుకుని స్ర్పుహ తప్పానుఅంది.
***
అడవిలో కొబ్బరి బోండాలు తాగటానికి ఇచ్చాడు.
కొన్ని తియ్యని పళ్ళు కూడా. కొన్ని గంటలకి ఆమె తెరుకుంది.
***
థాంక్స్ .. నేనిప్పుడు నీకు ఈ నాలుగేళ్లుగా మిస్ అయింది 
రుచి చూపిస్తాను.అంది ఆమె సిగ్గుగా.
..
...
..
..
..
..
బారెల్ లో బీరు ఉందా ? మరి చెప్పవే ??” అన్నాడతను ఆనందంగా. 

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...