Wednesday, 30 December 2015

బస్సులో బాంబు

కాళ్ళు బార చాచి కూర్చున్నా డిపో మేనేజర్ టేబుల్ మీదున్న లాండ్ లైన్ ఫోను .
ఉదయం 9-45 కి మోగింది.
**
"మీ డిపో నుండి 9.30 కి బయలు దేరిన పొదిలి - దరిశి - వినుకొండ బస్సులో డ్రైవర్ వెనుక ఉన్న రో లో ఎనిమిదో సీటు కింద 10.40 కి పెలెట్టుగా సెట్ చేసిన బాంబు ఉంది,"
ఫోను కట్ అయ్యింది.
**
రమ్యా హోటల్ లో తిన్న సాంబారు ఇడ్లీ మత్తు వదిలింది అతనికి. 
వెంటనే లేచి డ్యూటీ షీట్ తీశాడు. .
**
బస్సు కరెక్టు టైమ్ కి డిపో నుండి వెళ్ళినట్టు ఫోర్మెన్ సంతకం 
ఫ్లాట్ ఫార్మ్ నుండి బయలు డేరుతున్నట్టు కండెక్టర్ కామేశ్వరి సంతకం ఉన్నాయి.
***
ఆయన కాళ్ళు చేతులు వణక సాగాయి. పక్కనే ఉండి రంధ్రాన్వేషణ చేయటం మినహా మరేమీ చెయ్యని యూనియన్ నాయకుడో కరు గమనించి 
" ఏం, అయింది సార్ ?" అన్నాడు. వినడానికి సార్ అన్నా అర్ధం మాత్రం 'భే' అని రావటం ఆ 
పలకటం లో ఉన్న ప్రత్యేకత . 
***
"బాంబు .. బాంబు.. దరిశి.. వినుకొండ బస్సు .." తెలుగు లో మాట్లాడే హింది విలన్ లాగా తడబడి మాట్లాడాడు. డిపో అంతా గుప్పమంది వ్యవహారం.
"పోలీస్ లకి ఫోన్ చేయండి."ఎవరో చెప్పారు.
***
అప్పటికే గ్లాసు నీళ్ళు తాగి కోలుకున్న అతను సంత నూతల పాడు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు " ఇంకా బస్సు సంతనూతలపాడు దాటి ఉండదు. వెంటనే ఆపేయండి" చెప్పాడు.
అటునుండి స్టేషన్ హౌస్ ..ఆఫీసర్ కూల్ గా అడిగాడు 
" కేటగిరీ లో వచ్చారా? మీరు?"
" అవును.బాక్ లాగ్ పోస్టులో ."
"అనుకున్నాను. ముందు డ్రైవర్ కి గాని కండెక్టర్కి గాని ఫోన్ చేసి బస్సు ఆపేయ మని చెప్పండి.ప్రయాణికులని దించి వేయమని చెప్పండి. వెంటనే .. ఈ లోగా నేను సి ఐ గారితో మాట్లాడతాను. బస్సు నెంబరు చెప్పండి."
***
ఆ ఆలోచన తనకి ఎందుకు రాలేదో అర్ధం కానీ డిపో మేనేజరు బస్సు నెంబరు చెప్పాడు 
వెంటనే కండెక్టర్ కామేశ్వరికి ఫోన్ చేశాడు...
"సార్ హాపీ న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్ గా అంది ఆమె మర్నాడు సెలవు కోసం ముందు నుండి అతన్ని సిద్దపరుస్తూ "
"నీ హాపీ న్యూ ఇయర్ మండిపోను. బస్సులో బాంబు ఉంది వెంటనే ఖాళీ చేయించు"
***
బస్సు ఇంకా ఎండ్లూరు దాటి SSN ఇంజనీరిగు కాలేజీ ముందుకు వచ్చి ఉంది. 
డ్రైవర్ చురుకయిన వాడు బస్సు లోంచి అందరినీ దించి, బస్సుని రోడ్డు వారగా ఆపేసి దూరంగా వచ్చి ఉన్నాడు.
**
పది నిమిషాలలో అక్కడికి సి ఐ గారి కారు, వచ్చింది. 
పోలీసులు ప్రజలని దూరంగా ఉండేట్టు నియంత్రణ చేస్తున్నారు. 
వెనక మరో బస్సులో డిపో మేనేజరు వచ్చాడు.
ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు విషయం ఇంట్రెస్టింగ్ గా ఉండటం తో రోడ్డు మీద కి చేరీ సెల్ ఫోన్ లు వీడియో షూటింగ్ కి రెడీ చేసుకుంటున్నారు. 
వేరొక సైరన్ జీపులో బాంబు స్వాడ్, మరికొంత మండి పోలీసు అదికారులు, ఆఘమేఘాల మీద అక్కడికి చేరారు. 
ఇక మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పనేల?
**
బుల్లెట్ ఫ్రూఫ్ దుస్తులతో బాంబు స్వాడ్ అదికారి ఒకరు తన పరికరాలతో బస్సులో కి జాగర్తగా ఎక్కారు. 'డ్రైవర్ వెనుక ఎనిమిదో సీటు' మేనేజరు మరోసారి గుర్తు చేశాడు. 
చుట్టూ జనం ఉత్సాహంగా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు.
రెండు నిమిషాల్లో ఆ అదికారి బస్సు లోంచి బయటకి వచ్చాడు. 
**
డిపో మేనేజరు తో "బాంబు డిస్ ఫ్యూజ్ చేశాను. అయినా డిపోలోంచి బస్సు బయటకి వచ్చేటప్పుడు బస్సు శుభ్రం చేస్తారు కదా వాళ్ళు గమనించలేదా, గమనించి మీకు చెప్పలేదా? అసలు శుభ్రం చేయించే అలవాటే లేదా ?" అన్నాడు .
..
మొత్తం మీడియా అంతా తనవైపే చూస్తుండగా పూల చొక్కా సర్దుకుంటూ 
" సర్ నేను దగ్గరుండి మరి శుబ్రమ్ చేయించాను సార్. నేను జాయిన్ అయ్యాక శుబ్రత మీద ప్రత్యక శ్రద్ద పెట్టాను సర్. ప్రతి బస్సు శుభ్రంగా ఉండాలని కాదు డిపో మొత్తం నా టేబుల్ అంత శుబ్రంగా ఉండాలది నా లక్షం సార్ "
****
మీరోసారి లోపలకి రండి. చెప్పడతాను.
**
బస్సులో ఎనిమిదో సీటు వద్ద ఎవరో క్రితం రోజు చేసుకున్న వాంతి ఉంది. 
పొరపాటున చూసుకోకుండా ఎవరో కూర్చున్నట్లు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి.
‪#‎susri‬ 30/12/15

No comments: