Tuesday, 8 December 2015

గోవిందా గోవిందా -37

అంతా తిరనాళ్ళ వాతావరణం అలముకుంది.
ప్లాస్టిక్ సంచుల్లో మిఠాయిలు, సెంటరింగ్ మేస్త్రీలు ఏర్పాటు చేసిన మెట్ల మీద పనుముట్ల అలంకరణ , తోరణాలు , సైట్ ఆఫీసు కి విద్యుత్ దీపాలంకరణ, అంతా చక్కటి రంగు రంగుల శుబ్రమయిన బట్టలు వేసుకుని వర్కర్లు , చిన్న మేస్త్రీలు , మేము అంధరం రడీ అయ్యాం. ఎవరు మొదలెట్టారో గాని ఈశ్వరమణి చేతికి రంగుల దారం కట్టి ఆయన దగ్గర చిల్లర పట్టేయటం మొదలెట్టారు. మరి కొందరు ఆయన బుగ్గలకి పసుపు పూశారు. క్రమీణా అంధరం ఒక చోట చేరి తారతమ్యాలు మరిచి ఒక కుటుంబం అయ్యాం.
..
అయ్యవార్లు పూజా కార్యక్రమాల తర్వాత ..'దొడ్డప్ప్' గారి చేతుల మీద మాకు కవర్లో నెల జీతం మరో బాగు లో స్వీట్స్ పంపిణీ జరిగింది.
ఈశ్వరమణీ పనివాళ్లందరికి ఒక రోజు వేతనం, స్వీట్స్ పంచారు. ఒక్క సవారికి తప్ప
....
అందరికీ బొజనాలు ఏర్పాట్లు చేశారు. ..
నేను జ్వరంతో ఉన్నప్పటికి వాళ్ళ ఉత్చాహం చూసి అన్నీ మరిచిపోయాను.
కార్యక్రమానికి ముగింపులో దొడ్డప్ప, ఆదినారాయన,ఈశ్వరమణి గారు ‘సవారి’ని అతని బార్యా ముగ్గురు పిల్లలని పిలిచి 5000 రూపాయలు నగదు పంచారు.
అందరూ చప్పట్లు కొట్టి ఆనందించారు . నేను నా బోనస్ నుండి 200 రూపాయలు ఇచ్చి తిరుపతి వెంకటేశ్వరుని వద్దకు వెళ్ళి మొక్కు తీర్చుకొమ్మని చెప్పాను. ఇది చూసి మిగిలిన మిత్రులందరు తలో వంద చెప్పున పోగుచేశారు. మరో రెండు వేలు దాకా జమ అయినాయి.
..
“బాలాజీ నుంచి నీకు పిలుపు వచ్చింది” ఈశ్వరమణి సవారి తో చెప్పాడు. ..
..
అందరూ గోవిందా గోవిందా అని భగవణ్ణామ స్మరణ చేస్తూ చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు . ఆ రాత్రి నేను హైదరాబాదు నుండి ఇంటికి బయలుదేరాను.
**
ఇంటికొచ్చాక వారం పైనే పట్టింది నేను నార్మల్ అవటం . జుట్టు బాగా పాడయి పోయింది. తలంతా మురికి. నాన్న సలహామీదా గుండు కొట్టించాను. ఏమందుల తో పని లేకుండానే నేను మళ్ళీ సాదారణ స్థితి కి రాసాగాను.
పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్ నుండి ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజి ద్వారా తాత్కాలిక వర్క్ చార్టర్డ్ సిబ్బందిగా నియామకం వచ్చిఉంది . నెలకి 500 రూపాలతో . అది నాకు చాలా తక్కువ జీతం అనిపించింది. నేను తిరస్కరించాను
కానీ ఎంతకాలం అడవిలో జీవన పోరాటం చేయటం అనే ఆలోచన మాత్రం నాలో కలిగింది. అనూష ని అక్క, అమ్మ నాన్న ల వద్దకి తీసుకు వచ్చింది. అప్పుడప్పుడే మెడ నిలబెట్టి అందరినీ చూసి నవ్వుతుంది. పిల్లల కళ్ళు స్వచ్చంగా ఉంటాయి. ఆరు బాటరీల టార్చి లైట్లు లా వాళ్ళు కళ్ళు తిప్పుతుంటే అలానే చూడాలనిపింస్తుంటుంది.
నేను నార్మల్ అయ్యాక తిరిగి రాజధానికి బయలుదేరాను..


సైటు కి వచ్చే సరికి UNIT 1010 పనులు అలానే నిలిచి పోయాయి . నేను లేక పోవటం , అది అప్పటికే మంచి ప్రోగ్రెస్ లో ఉండటం. అది ఇండిపెండెంట్ వర్క్ అవటం కారణాలు.
వాటర్ టాంక్ రెండో గ్లాస్ వర్క్ మొదలు పెట్టటానికి సిద్దమయ్యాము.
..
నేను సైట్ కి వచ్చిన  మర్నాడు ఉదయాన్నే నా రూము తలుపు తడితే కానీ నాకు మెళుకువ రాలేదు. గత రాత్రంతా బస్సు లో ప్రయాణం చేసి ఉండటం తో బాగా నిద్ర పట్టింది. లేచి తలుపు తీసే సరికి ఒక జంట, తమ ముగ్గురు పిల్లలతో బయట నిలబడి ఉన్నారు. వాళ్ళను చూడగానే గుర్తు పట్టటానికి కొద్ది టైమ్ తీసుకున్నాను. ..
..
తరువాత పెద్దగా నవ్వాను నా గుండు తడుముకుంటూ..
నున్నటి సలిబిండి ముద్దల లాగా పిల్లల తలలు. తలనీలాలు లేని సవారిని అతని బార్యని చూస్తుంటే అతని వయసు చాలా తగ్గినట్లు అనిపించింది. ఒక గిన్నెలో పొంగలి , తిరుపతి లడ్డు నాకు తెచ్చి ఇచ్చారు. మరో ప్లేట్ లో ప్రసాదాన్ని మా స్టాఫ్ అందరికీ అందించారు. ..
***
“భగవంతుడు .. బలహీనులని .. నిండు మనసుతో నమ్మిన వారిని తన వద్దకు రప్పించుకుంటాడు. వారికి స్వాంతన కలిగిస్తాడు.
సవారి కుటుంబం దానికి నిలువెత్తు నిదర్శనం ..”
గోవిందా .. గోవిందా
#33grade

No comments: