Friday, 4 December 2015

కంట్రోల్డ్ బ్లాస్టింగ్ --36

ముసురుపట్టిన దీపావళి రోజు తడిచిన తాటాకు మందు తుప్పుమని శబ్దం చేసినట్లు చిన్న శబ్దం వచ్చింది.. నాలుగయిడు ఇసుక బస్తాలు గాల్లోకి లేస్తూ పగిలి పోయాయి . ఒకటి రెండు నిమిషాలు నిశాబ్దం గా గడిచాయి. పక్కనే ఉన్న భవనం కిటికీలకి  కొత్తగా బిగించిన గాజు పలక ఒకటి జారీ నేలని తాకింది. చీమలు  పుట్టల్లోంచి బయటకి వచ్చినట్లు మేము దాక్కున్న చోటు నుండి బయటకి వచ్చాం. ఏవిదమయినా పొరపాటు లేకుండా విజయవంతంగా కంట్రోల్డ్  బ్లాసింగ్ చేసినందుకు వర్కర్స్ ని అభినంధించాం. పగిలిన రాళ్ళు అన్నిటిని తొలగించి 1010 కి మార్గం సుగమం చేశాం.
పూర్తి తెల్లవారేసరికి మా దైనందిక చర్యలు మొదలెట్టాము . 
దసరా పండగ ఎంతో దూరం లో లేదు.  
ఆరోజు మా కంపెనీ లో భారీగా వేడుకలు జరుగుతాయి.
వర్కర్స్ కి బోనస్ లు. స్టాఫ్ కి మరో నెల జీతాలు బోనస్ గా ఇస్తారని ఆఫీసు స్టాఫ్ చెప్పారు. కొత్త గా నిర్మాణం పూర్తి చేసిన ఒక భవనం లో పండగ ఏర్పాట్లు చేయాలని రెండు వారాల ముందే ఈశ్వర్ మణీ గారి ఆదేశం. పెద్ద గోడౌన్ లాటి ఆ బిల్డింగ్ పూతపని యుద్ద ప్రతిపదికన మొదలెట్టాము.
నాకు ఈశ్వర మణీ గారు ఏమి చెయ్యాలో చెబితే, మిత్రుడు మణీమారెన్ డిజైన్ ఎందుకలా చేశారో చెప్పేవాడు. నేను శ్రద్దగా విని ఒక పుస్తకంలో వ్రాసుకునే వాడిని. చాలా విషయాల పట్ల మాణీమరెన్ కు అవగాహన ఉండేది. దీర్గ చతురస్రాకారావు నిర్మాణాలు, కంటే చతురస్రాకారపు నిర్మాణాలు ఎందుకు తక్కువ ఖర్చు లో అవుతాయి. రెండు సప్పోర్ట్ల మధ్య దూరాన్ని(span) బట్టి ‘T’ బీమ్ ఎంత లోతుగా ఉండాలి. ఇటుకరాళ్ళ గోడలు నిర్మించేటప్పుడు ఎంత ఇంటెర్వెల్స్ లో కొంక్రీట్ జాయినరీ రావాలి, ఆర్‌సి‌సి కాలమ్ కి మేషనరీ వర్కి జాయినరీ ప్లాస్టరింగ్ ఎలా చేయించాలి, రూఫ్ శ్లాబ్ కింద వచ్చే సన్నటి క్రాకులు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి ఇలాటి బోలెడన్ని విషయాలు నేర్పేవాడు. నేను మూడున్నర యేండ్లు కాలేజీ లో నేర్చుకున్న దానికన్నా అనేక రేట్లు అక్కడే నేర్చుకున్నాను. సాంకేతికంగా వ్యక్తిత్వ పరంగా మణిమారెన్ నామీద వేసిన ముద్ర అసమానమయినది.
ఆ వయసులో సహజంగా స్త్రీల పట్ల ఉండే ఆసక్తిని గురించి కూడా మాణీమారెన్ స్పష్టంగా చెప్పేవాడు, ఎండలో తిరిగి పనిచేసేవాడు, చమట కోసం ఎదురుచూడఖ్ఖరలేదు. అలాగే స్త్రీలని గెలవటం కోసం కూడా. రెండో వైపు లేని నాణెం ఉండనట్టు, ప్రతి మనిషికి ఒక రాజ కుమారి ఉంటుంది. మనిషి  కన్నా వ్యక్తిత్వం బలమయినది. దానికి ఉండే ఆకర్షణ వేరు. దగ్గరి త్రోవలో   వాటిని అందుకున్నప్పుడు, తాగుడు/మత్తు  లాగా తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఒకరోజు తెలిసివస్తుంది. ఏమి తెలియక పోవటం లో చాలా గొప్పతనం ఉంది “ అని. ఆరోజు అందరికీ అనిపిస్తుంది  జీవితం లో playback బటన్ ఉంటే ఎంత బాగున్ను అని.
నాకు అతని ఫిలాసఫీ పూర్తిగా అర్ధం అయ్యేది కాదు. మరో వైపు లాల్ జి చెణుకులు వేస్తుండేవాడు.
“అరె యార్. ఆప్కా కేబుల్ చానెల్ అబ్ బి బహుత్ కామ్ ఆతా, (ఒక అర కిలోమీటరు ప్రేకాస్ట్ మూతలతో మూసి వేసి సొరంగం లాగా ఉంది అప్పటి యూనిట్ 1010 ప్రారంభం లో ) ఓ హనుమంతప్ప ఇదర్సే ఘుమేగా, ఓ లడ్కి బిస్తార్ లేకే ఉదర్ సే ఆయెగా, కేబుల్ చేనెల్ షురూ కరేగా  “ అంటుండేవాడు .
నిజానికి కరుణాకరణ్ కి తలకి గాయం అయ్యాక, ఎక్కువ భయపడింది హనుమంతప్పే. తన అలవాట్లు చాలా వరకు మార్చుకుని జాగర్తగా ఉండేవాడు. బెంగుళూరు లో మరో ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నం చేయటం మొదలెట్టాడు. ఒక మనిషి ని చేసిన తప్పు ఎలా వెంటాడు తుంది అనటానికి ఈ ఉదాహరణ చాలు.
ఓవర్ టైమ్ లు సండే ఎలవెన్సు లు కలిపి నా జీతం నాలుగంకెలకి చేరింది. ప్రతి నెలా నాన్నకి 700 లేదా 800 పంపుతుందేవాడిని.
రోజు చన్నీళ్లతో తల స్నానం, సరైన రెస్టు లేకపోవటం, ఎంతో కొంత అపరిశుబ్రమయిన నీళ్ళు తాగుతూ ఉండటం వల్ల నా ఆరోగ్యం ఎఫెక్ట్ అవటం గమనించాను. దసరా కి శెలవు తీసుకుని ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర రెండు మూడు రోజులు ఉంటే బాగుండు అని పించేది. కానీ దసరా వేడుకలు బాగా జరుతాయని ముఖ్యంగా బోనస్ ఇస్తారని ఆశతో ఉన్నాను.
అనుకున్నట్టు గానే పెద్ద భవనాన్ని సిద్దం చేశాం 40mm మెటల్ ఫ్లోరింగ్ మీద సన్న మాలు వేసి కొంత శుబ్రంగా చేయించామ్. వంటవాళ్లను పిలిపించి భారీ ఎత్తున స్వీట్స్ చేయించారు. మైసూర్ పాక్ లాటిది. మురికి పట్టి ఉన్న మెషినరీ అంతా శుభ్రం చేయించారు, సైట్ లో ఉన్న జీపులు, బండ్లు, మిల్లర్ లు అన్నిటిని ఒక చోట చేర్చి ఓవర్ ఓయిలింగ్ చేశారు. కొన్నిటికి రంగులు కూడా వేశారు.
మరి రెండు రోజుల్లోదసరా (12 అక్టోబర్ 1986) అనగా నాకు తీవ్రంగా జ్వరం వచ్చింది. కళ్ళు తిరుతున్నాయి. ఏది తినటం సాద్యపడటం లేదు. ఎవరో ఆర్‌ఎం‌పి వచ్చి ఇంజక్షన్ చేశాడు. బిళ్ళలు వేసుమని చెప్పాడు. దసరా రోజు బోనస్ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్లాలని గట్టిగా అనుకున్నాను. నేను రూములో నిస్త్రాణంగా పడుకునే ఉన్నాను. తరచూ సవారి వచ్చి ఏదో ఒకటి తింటానికో తాగటానికో ఇచ్చి వెళ్తున్నాడు. అతని బార్య ఒక నిలువు బాక్స్ లో బార్లీ కాచి తెచ్చి ఇచ్చింది. వాళ్ళు ఉండే చోటు నుండి నాకు స్నానానికి  వేడి నీళ్ళు కాచిన కుండ ని తలమీద ఉంచుకుని తెచ్చి ఇచ్చేది. ఒక స్త్రీ ప్రేమను తట్టుకోటానికి ఎవడికయినా అర్హత ఉండాలి. నాకు ఆ అర్హత అదృష్టం రెండు ఉన్నాయి. ఆ అక్కకి నా నమస్సులు (ఇది టైప్ చేస్తుంటే నా కళ్ళవెంట నీళ్ళు తిరుగుతున్నాయి)
 ఆర్ధిక, సామాజిక, స్తాయిని బట్టి మనుసులని మనం ఎప్పుడు కొలవకూడదు.

మర్నాడు “విజయ దశమి” 
#33grade 

No comments: