Wednesday, 2 December 2015

చెత్తబుట్టలో పాము -35

ఆయన అపనమ్మకంగా చూసి కేబిన్ బయట నాగేంద్రదేవ్ అని సబ్ ఎడిటర్ ఉంటారు కలవండి అన్నాడు. నేను ఆయన్ని కలిశాను. 
ఒక కాగితాన్ని నాకు ఇచ్చి ఏమయినా రాయండి అన్నారు. నేను అక్కడే ఆయన ఎదురుగా కూర్చుని “తెలుగువాడు” అనే చిన్న కధ రాశాను. బీరువాలోంచి ఒక పాడ్ లో కట్టిన నా చేతివ్రాత తో ఉన్న కధని తీసి నా వ్రాతతో సరి చూసుకుని “మీ ఈ జన్మకిది చాలు కధ కనీసం 40 యేళ్ళు దాటిన వ్యక్తి వ్రాసి ఉంటాడని, నేను ఎడిటర్ గారు అనుకున్నాం అన్నాడు.
ప్రక్కనే కూర్చున్నా GV రమణ అనే ఆర్టిస్ట్ ని అతన్ని కలవటానికి వచ్చిన కాదంబరి కిరణ్ కుమార్ ని పరిచయం చేశాడు.
“చాలా కాలం పాటు మీ కధ ని దాచాను నేను ఎడిటర్ అయ్యాక ప్రచురించాలని” నాగేంద్రదేవ్ చెప్పాడు. 
ఆర్టిస్ట్ జి‌వి రమణ (రమణజీవి పేరుతో కధకుడు కూడా )” మీ కధకి మా చేత బొమ్మలు వేయించకుండా, ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ “చందు” (ఆర్టిస్ట్ చందు) చేత గీయిస్తున్నారు” అన్నాడు.
..
అప్పట్లో కాలం వెడల్పులో ఒక రిబ్బన్ లాగా ఆర్టికల్ ని బ్రోమైడ్ కాపీ తీసేవాళ్ళు, ఆస్థాన ఆర్టిస్ట్ లు పేజీ సైజు లో దాన్ని అంటించి బొమ్మలు అవి గీసి ఫిల్లర్ (ఖాళీ స్తలాలు నింపటానికి చిన్న కవితలు, జోక్స్, లాటివి) వాడి పూర్తి పేజీ తయారు చేసి పేజ్ మేకింగ్ కి పంపేవాళ్లు . అలాటి పనే జి‌వి రమణ గారు చేస్తూ ఉన్నారు.
నాగేంద్ర దేవ్ నన్ను ప్రింటింగ్ యూనిట్ లో కి తీసుకువెళ్లి అధునాతనమయిన ప్రెస్ ని చూయించారు. మొత్తానికి నా కధ నాగేంద్ర దేవ్ గారికి బాగా నచ్చిందని మాత్రం అర్ధమయింది. నేను వెంట తెచ్చుకున్న ఫోటోలు, కొద్ది పరిచయం వ్రాసి ఆయన కిచ్చి బయటపడ్డాను.

.. 
వస్తుంటే “నేను మీ కధకి ఒక నెల రోజుల పాటు దినపత్రికలో ప్రకటన ఇవ్వదలుచుకున్నాను. మరో మాట ఇప్పుడు వ్రాసిన షార్ట్ స్టోరీ “తెలుగువాడు’ ని ఎక్కడో ఒక చోట ఫిల్లర్ గా వాడుకుంటాను” అన్నాడు. “మీ ఇష్టం” అని చెప్పి శెలవు తీసుకుని బయలుదేరాను. 
***
తిరిగి పహడి షరీఫ్ చేరుకునే సరికి ఛీకటి పడొస్తుంది. ప్రాజెక్ట్ లోపలికి వచ్చే ఏదో మెటీరీయల్ లారీ ఆపి ‘శరవాణా కా ఇంజనీర్ హు మై “ అని చెప్పి లిఫ్ట్ తీసుకున్నాను. 
..
నేను క్వార్టర్స్ కి వెళ్ళేసరికి కొన్ని మార్పులు జరిగి ఉన్నాయి. నా రూములో ఒక కొత్త మంచం ఉంది . రూము శుబ్రంగా ఉంది. మామూలు బల్బు స్థానంలో కొత్త ట్యూబు లైట్ వెలుగుతుంది. ఇంకా ముఖ్యంగా రూములో టి‌వి ని కామన్ వరండాలో లోకి మార్చారు. టి‌వి చూడటానికి ఎవరయినా వరండాలో కూర్చోవలసిందే.
..
ఫ్రెష్ అయ్యి మెస్ కి బోజనానికి వెళ్ళేసరికి, మెస్ లో బోయ్ చెప్పాడు. 
“సార్ మీ రూములో చెత్త వేసిన అట్టపెట్టెలో పెద్ద పాము పడుకుని ఉంది సార్.ఎన్నాళ్ల నుండి ఉందో ఏమో కుబుసం కూడా వదిలి ఉంది.”
..
నాకు నోట మాట రాలేదు. గత రెండు వారాలుగా నేను కింద నే పడుకుంటున్నాను. నా కాళ్ళకి సరిగ్గా రెండు అడుగుల దూరం లో ఉందా చెత్తబుట్ట. 

చాప మీద నేను, అట్టపెట్టెలో పాము . 
..
బోజనమ్ పూర్తి అయ్యేసరికి ఈశ్వరమణీ యెజ్ది బండి మీద మా రుముల వద్దకి వచ్చాడు.
“మిస్టర్ రావ్ . పెద్ద ప్రమాదం తప్పింది. దీనిలో మా అశ్రద్ద కూడా ఉంది మనందరి టైమ్ బాగుంది. మురుగన్ దయతో ఏమి ఇబ్బందులు జరగలేదు. మీ సవారి గురించి బెంగుళూరు మాట్లాడాను . అతని కి మురుగన్ పిలుపు వచ్చింది” అన్నాడు. నాకు పూర్తిగా అర్ధం అవలేదు.
..
మర్నాడు రెండు పూర్తయిన బిల్డింగ్ ల మద్య నుండి వెళ్తున్న కేబుల్ చానెల్ లో అడ్డొచ్చిన రాయిని తొలగించడానికి కంట్రోల్డ్ బల్స్టింగ్ ఏర్పాట్లు చేశాం. 
డిటోనేటర్లు ఉంచిన రాతి రంద్రాలను ఉప్పు తో కూరారు. సన్నటి వైర్లు ఒక చోటికి తెచ్చి ఇసుక నింపిన సిమెంటు బస్తాలు పేర్చారు బ్లాస్టింగ్ జారగాల్సిన రాతిని పూర్తిగా ఇసుక బస్తాలతో నింపాక పక్కన నిర్మాణం లో ఉన్న బిల్డింగ్స్ లోని అద్దాల కిటికీలు మధ్యలో స్పంజీలు ఉంది గట్టిగా మూసేశారు. లోపల కంపనాలకు ఎవయినా నష్టాలు జరగకుండా అంగుళం అంగుళం జాగర్తలు తీసుకున్నాం.
..
ఉదయాన్నే బ్లాసింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ‘మెకోన్’ వాళ్ళ పర్మిషన్ లేకుండా చేస్తున్న పని ఇది. మానువల్ గా రాతిని తొలగించే ఏర్పాటు చెయ్యమని వాళ్ళ సూచన. ఖర్చు చాలా అవుతుందని ఈవిదంగా ప్లాన్ చేశాం. ఆ రాత్రి చాలా భారంగా గడిచింది. ..

No comments: