Tuesday, 1 December 2015

ఎడిటర్ ని కలిశాను -34


పల్లెటూర్లలో షామియానాలు వేసేటపుడు నాలుగు మూలలా వెదురు బొంగు ని నిలబెట్టి దానిని స్తిరంగా ఉంచడానికి తాళ్లు కడతారు. అలానే మేం ఎక్కి వచ్చిన లిఫ్ట్ ని స్తిరంగా ఉంచడం కోసం రెండు తాళ్ళు ఏటవాలుగా కట్టి ఉన్నాయి. 
నేలవైపు వెళ్తున్న సవారి శరీరం సరిగ్గా ఆ తాడుకి తాకింది. సర్కస్ లో నెట్ మీద కళాకారులు గాలిలోకి లేచినట్లు అతను తిరిగి గాల్లోకి లేచి ఈ సారి సరిగ్గా ఎటు చూసినా ఏడడుగులు మించని నీటితొట్టిలో పడ్డాడు.
మేమెవరం జరుగుతున్నది గ్రహించే స్తితిలో లేము. ఒక స్టిల్ ఫోటో లాగా అందరం ఆగిపోయి ఉన్నాం. చలనం ఎవరిలో అయినా ఉందంటే అది ‘సవారి’ లోనే.
అతను తొట్టిలోంచి బయటకి వచ్చి లిఫ్ట్ ని తానే కిందకి దించుకుని, ఆపరేటర్ కి చెప్పి పైకి వచ్ఛాడు.
“నా వైపు చూస్తూ సార్ లేటయ్యింది. కంకర పనికి వస్తుందా లేక కింద పొసెయ్యాలా ?”
అని అడిగాడు. నాకు నోటివెంట మాట రాలేదు. అతను కిందకి జారటమే గుర్తొస్తుంది.
ఏదో హాలివుడ్ సినిమా చూస్తున్నట్లు ఉంది. తడిచి ఉన్న బన్నియన్ పొడవు నిక్కరు నడుముకి వేలాడుతున్న బెల్టు ... అతన్నిభయం భయం గా చూస్తుంది పోయాను.
ముందుగా కోలుకున్న లాల్ జీ అతని చెంప చెళ్ళు మనిపించాడు. “అరె గధే బెల్ట్ క్యోమ్ నహి లగాయా?”
కింద అతని నున్న అతని బార్య పక్కన్న నిల్చున్న చిన్న పిల్లాడు తండ్రి ని చూసి నవ్వు తున్నాడు. అతని బార్య చేతులు ముడిచి కళ్ళు మూసుకుని భగవంతుని ప్రార్దిస్తుంది.
వాతావరణం నార్మల్ అయి పని తిరిగి మొదలవటానికి, పావుగంట పైగా పట్టింది.
మా వర్క్స్ మేనేజర్ ఈశ్వరమణీ తెల్లవారగట్లే వచ్చాడు అప్పటికి కాంక్రీట్ వర్క్ పూర్తయింది.
జరిగినది అంతా విని సవారిని పరామర్శించి ఎందుకయినా మంచిదని దగ్గరలోని హాస్పిటల్ కి పంపించాడు. జరిగిన ఘటన విని మా కొలిగ్స్ మాత్రమే కాకుండా మిగిలిన కంపెనీ వాళ్ళు కూడా పొగయ్యారు.
**
ఇంటివద్ద నుండి నాన్న రాసి పంపిన కవరు వచ్చింది. నాన్నే ప్పుడు కార్డు లే వ్రాసేవాడు. చిత్రంగా అనిపించి. అక్కడే ఓపెన్ చేశాను. ఆయన ఉత్తరం తో పాటు “ఉదయం వార పత్రిక” నుండి అల్లాణీ శ్రీదర్ గారి సంతకంతో వచ్చిన ఒక లెటర్ ఉంది. ఆతృతగా చదివాను.
ఉదయం వీక్లీ కి కధ పంపి యాడాది దాటింది. నేను కధలు రాయటం ఆపేసి కూడా నాలుగు నెలలయింది. ఏమి పంపానో గుర్తులేదు. నేను చాన్నాళ్లక్రితం వ్రాసి పంపిన “ఈ జన్మ కిది చాలు “ అనే కధ ‘పెద్ద కధ’ అనే శీర్షికన ప్రచురించనున్నట్లు. దానికి గాను కదా రచయిత ఫోటో తో బాటు పరిచయం పంపితే కధతో పాటు ప్రచురిస్తామని ఉంది అందులో “


నేను వెంటనే లెటర్ డేటు చూశాను. ఎప్పుడో టైమ్ అయిపోయింది. కానీ ఎందుకో నేరుగా ఆఫీసుకి వెళ్ళి కలిస్తే బాగుండు అనిపించింది.
ఈశ్వరమణి గారి వద్ద పర్మిషన్ తీసుకుని ఒక టు వీలర్ మీద పహడి శరీఫ్ వద్దకి వెళ్లను. సిటిలోకి వెళ్ళి పాస్ పోర్ట్ ఫోటోలు తీయించుకున్నాను. ఇంకా బొచ్చు పీకని బ్రాయిలర్ కోడి లాగా వచ్చింది నా ముఖం. ఉన్నది అది . మరెమి చెయ్యటం. RTC క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న ఉదయం ఆఫీసుకు వెళ్ళాను.
గేటు వద్ద సంజాయిషీలు అయ్యాక లోపలికి వారపత్రిక కార్యాలయానికి వెళ్ళాను. శ్రీ అల్లాణి శ్రీధర్ గారు ఎడిటర్ (కాంపస్.. కాంపస్ అని సీరియల్ వ్రాస్తున్నారు అప్పుడు) , నాగేంద్రదేవ్ గారు అసోసియేట్ ఎడిటర్ గా ఉన్నారు. నేను ఎడిటర్ గారి రూముకి వెళ్ళి నమస్కరించి నిలబడ్డాను.
“నేను. నన్ను అంటూ నసుగుతూ చేతిలోని ఉత్తరాన్ని చూపించాను.”
నిండా 21 ఏళ్ళు నిండని 48 కేజీల బక్కచిక్కిన నన్ను చూసి ఆయన “ఓహో సుంకర శ్రీనివాసరావు గారు పంపారా? ఏమవుతారు మీరు ఆయనకి?” అన్నాడు
“ లేదండీ నేనే సుంకర శ్రీనివాసరావు @సు శ్రీ ని “ చెప్పాను.
#33grade

No comments: