Sunday, 8 November 2015

ఛాయా దేవి ఇల్లు 8

ఇంటికి/ఆఫీసుకి ఎలా వచ్చానో తెలీదు. వచ్చాను.
రూములోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను.
చమట తో చొక్కా వంటికి అతుక్కు పోయింది. 
వళ్ళంతా నొప్పి.
చొక్కా విప్పి చూసుకున్నాను. వంటి మీద వాతలు. అక్కడక్కడా వాపు. 
**
ఆఫీసు టేబుల్ మీద ఒక మూత ఉంచిన ప్లేట్ లో పోపు పెట్టిన పెరుగన్నం, 
ఒక పెద్ద ఆరటి పండు, గ్లాసు మజ్జిగ పెట్టి ఉన్నాయి. 
అమ్మ గుర్తొచ్చింది. 
ఇక నావల్ల కాలేదు . సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉండి పోయాను.
**
ఎలా నిద్ర పోయానో గుర్తు లేదు . రోజు కంటే లేటుగా లేచాను. 
..
(
ప్రస్తుతం ::ఇప్పటికీ నేను వెళ్ళిన చాలా ఫంక్షన్ ల లో భోజనం చెయ్యను. ..
ఇది నా బార్య కి మాత్రమే తలుసు. బాగా తెలిసిన వారు ఉంటే తప్ప భోజనానికి కూర్చోను. 
పోయిన నెల గుంటూరు వెళ్ళాను. అబ్బాయి తరఫున. అందరినీ పలకరించాను. పెళ్లి కుమార్తె వాళ్ళు పెళ్లి చెయ్యటం. మా బందువులు అంతా మొదటి రెండో బంతి లోనే తినేశారు. డైనింగ్ హాలు లోపలికి చూస్తే తినెవాళ్ళ కుర్చీ ని ఇద్దరు లెక్కన పట్టుకుని నిలబడి  ఉన్నారు. తెలిసిన ముఖాలు ఏమి కనబడలేదు. సాయంత్రం 4-30 కి ఇంటికి రాగానే మా ఆవిడ వడ్డించింది నా సంగతి తెలుసు కాబట్టి.)
..
కొంచెం కుదుట పడ్డాక మా బాస్ తో చెప్పాను ...
నేను సైట్ కి వెళ్తాను అని 
అనివార్య కారణాల వల్ల ఆవడి లో కంపెనీ పని ఆగి పోయింది కొన్నాళ్లు.
..
వచ్చే నెల బెంగుళూరు జయా నగర్ ఎక్స్టెన్షన్  లో మన వర్క్ ఉంది అక్కడికి పంపుతాను.
MES (
మిలట్రీ ఇంజనీరింగ్ వర్క్స్) టెండర్ వర్క్ పూర్తి చెయ్యి . ..
అక్కడ సరయిన అక్కౌంటెంట్ లేడు. నువ్వే చూడాల్సి ఉంటుంది. 
నారాయణ రావు గారి దగ్గర అక్కౌంట్స్ వర్క్ నేర్చుకో మా బాస్ చెప్పాడు. 
..
బెంగుళూరు వెళ్ళ బోతున్నట్టు మా.. నాన్న కి ఉత్తరం రాశాను. ..
..
కానీ అది అంత తొందరగా కుదరలేదు. ..
..
ఒక ఆదివారం ఛాయాదేవి గారి ఇంటి లో అద్దెకి ఉంటున్నాను అని చెప్పిన (ఒంగోలు వాసి) కొద్ది పరిచయం ఉన్న  అసిస్టెంట్ డైరెక్టర్ ని కలవటానికి వెళ్ళాను. నా పుస్తకం లో వ్రాసుకున్న ఆనవాళ్ళు (నెం 25 హాబీబుల్లా రోడ్ ) ఒక కాగితం మీద రాసుకుని బయలు దేరాను. 

ఒక సిటీ బస్సు ఎక్కి మరికొంత దూరం నడిచి, నేర్చుకుంటున్న తమిళం తో మాట్లాడుతూ ఛాయాదేవి గారి ఇంటికి చేరాను. దాదాపు 15 సెంట్లు స్థలం లో చుట్టూ కాపౌండ్ వాల్ మధ్య ఉంది ఆ ఇల్లు. 
గేటులో కొంతబాగం మనుష్యులు నడవటానికి సౌకర్యంగా ఓపెన్ చేసి ఉంది. భయం భయం గా లోపలికి వెళ్ళాను. ఇల్లు తాళం వేసి ఉంది.
ఒకసారి చుట్టూ పరికించి చూశాను.
వెనుకవైపు ఎవరో ఉన్నట్లు అనిపించింది. ఉత్తరం ముఖంగా ఉండే ఆ ఇంటి వెనుక కాంపౌండ్ వాల్ కి రేకులు దించి కొన్ని రూములు వేసి ఉన్నాయి. ఆగ్నేయం లో ఉన్న ఇల్లు మాత్రం మరికొంత ముందుకు లాగి వరండా దించి ఉంది.
"
ఎవరూ?" వరండాలో నాలుగు కాళ్ళ పీటమీద కూచున్నావిడ పెద్దగా అడిగింది.
నేను వెళ్ళక తప్పింది కాదు..
దగ్గరకి వెళ్ళాక కానీ ఆమె కల్పనా రాయ్ అని గుర్తించలేక పోయాను.
(శ్రీమతి  ఛాయాదేవి గారి ఇంటిని కొంత మార్పు చేసిన బాగం లో ఈవిడ అద్దెకి ఉంటున్నట్టు నాకు అర్ధం అయింది.) ' వినోద్ కోసం వచ్చానండి. ఇదే అడ్రెస్ చెప్పాడు"
ఆమె గోదావరి జిల్లా యాసలో పక్క నున్న గది చూపించింది. 
అది తాళం వేసి ఉంది. 
"
ఎక్కడికో వెళ్ళి నట్లున్నాడు వచ్చేస్తాడు" అంది ఆమె.
నేను ఆ మెట్ల మీద కూర్చున్నాను. ఆమె పచారి సామాను సర్దుకుంటూ నాతో మాట్లాడింది.
దాదాపు గంట దాటింది నేను వచ్చి; కానీ అతను రాలేదు. 
ఈ లోగా ఆమె కోసం నూనూగు మీసాల పిల్లాడు వచ్చాడు. విచిత్రంగా పెద్ద పూలు ఉన్న ఒకే క్లాతు తో కుట్టిన చొక్కా ఫాంటు వేసుకుని ఉన్నాడు. ఆమెతో తమిళం, తెలుగు కలిపి  కొద్దిసేపు మాట్లాడి వెళ్ళాడు.
నేను ఏదొకటి మాట్లాడాలి కదా అని
 "ఎవరమ్మా? అతను ?" అని అడిగాను. '
సీతాకొక చిలుక సినిమా చూశావా .. పంచ తడుపుకుంటాడే . ఆ పిల్లడే ఈడి పేరు ఆలీ.
చూశావుగా పిల్లోడు అటూ  ఇటూ కాకుండా ఉన్నాడు. పిల్లల వేషాలకి పనికి రాడు. పెద్ద వేషాలు ఇవ్వరు.
రాజమండ్రి తిరిగి వెళ్ళిపోమ్మంటావా అని అడగటానికి వచ్చాడు."
'
అన్నం తినయ్యా. వినోద్ వచ్చేసరికి లేటవుద్దేమో" అంది ఆమె.
"
లేదమ్మా ఉదయాన్నే భారీగా తినొచ్చాను" చెప్పాను.
టైమ్ రెండవుతుంది .. మా మిత్రుడు ఇంకా రాలేదు .
నేను మెట్లమీద చాకచక్యంగా ఎండ తప్పించుకుంటూ కూర్చుని ఉన్నాను.


No comments: