Saturday, 7 November 2015

ఆమె 'శాంతి' కాదు 6

మద్రాసు లో త్యాగరాయ నగర్ లో నేను ఉన్నప్పుడే కళ్యాణ మండపాలు 
కళ కళ లాడుతుందేవి. ముహూర్తాలు ఎన్ని ఉండేవో గాని .
పెళ్లిళ్లు & రిసెప్షన్ లు అట్టహాసంగా జరుగు తుండేవీ.
వధూవరులు ఎవరు ముప్పయి లోపు వయసున్న వారు కనిపించే వారు లేదు.
ఎక్కువ మండి అరెకార నుండి , ఎకరం పోయిన వారే.
లైట్లు, పాట కచ్చేరీలు, ఊరేగిపులు .. అబ్బో ఆదొక పండగ వాతావరణం.
మరి ముఖ్యంగా ఆ బోజనాలు, ఎన్ని అయిటమ్స్ ఉండేవి. !!!!.
..
ఒక మధ్యాన్నం రోజు వెళ్ళే దగ్గరి దోవ లో గబ గబా సన్నటి వీదుల్లోంచి,నడిచి
మౌంట్ రోడ్డు పక్క నున్న .బడ్డి కొట్టు వద్దకి వచ్చాను.
అప్పటికి ఇంకా రైస్ పాకెట్లు అయిపోలేదు. ఏమాత్రం ఆలస్యం అయినా అవి వచ్చిన అరగంటలో ఖాళీ అయి పోతుంటాయి.
జేబులోంచి సిద్దంగా ఉంచుకున్న మూడు రూపాయలు తీసి పట్టుకుని,
'ఒరు తైరు శాదం, ఒరు లెమన్ రైస్ కోడూంగా "
బంకులో ఒంగి ఉన్న ఆ అమ్మాయి పైకి లేచింది.
ఆమె 'శాంతి' కాదు ..
"శాంతి ఎంగే?" అడిగాను గొంతు పెగల్చుకొని.
ఆమె చేతులతో సైగ చేసి ఏదో చెప్పింది..నాకు అర్ధం కాలేదు.
వాళ్ళు తరచూ డ్యూటీలు మారుతుంటారట ఎవరో చెప్పారు.
మొదటి సారిగా నేను మూగ వాడిని అయ్యాను.
కళ్ళు చెమ్మ గిల్లాయి.
డబ్బులు జేబులో వేసుకుని నేను తిరిగి సన్నటి దారుల్లో వెనక్కి నడిచాను. ..
**
‪#‎33grade‬

No comments: