Friday, 13 November 2015

నాను బెంగళూర్ బందు (నేను బెంగుళూరు వచ్చాను ) 14

సరిగ్గా మద్యానం బోజనం టైమ్ కి బెంగుళూరు చేరింది బృదావన్ ఎక్స్ ప్రెస్ . మరో అరగంట తర్వాత తిరిగి మద్రాస్ వెళ్లిపోతుంది.


బెంగుళూరు రైల్వే స్టేషన్ , బస్ స్టాండ్ దగ్గరగా ఉంటాయి. ఒక ఫ్లై ఓవర్ మీదుగా సౌకర్యంగా స్టేషన్ నుండి బస్ స్టాండ్ కి రావోచ్చు. మొత్తం ఆ ఏరియా ని మేజేస్టిక్ సెంటర్ అంటారుట .

ముందు రోజు బుక్ చేసిన ఇంద్ సుజికి బండి పార్సిల్ ఆఫీసు నుండి తీసుకున్నాం. కొద్ది దూరం నడిపించుకు వెళ్ళి పెట్రోల్ కొట్టించాము. మద్రాసు కి బెంగుళూరు కి ఒక వ్యత్యాసం ఉంది. ఎటునుండి ఎటు వెళ్ళినా చివరకి జెర్రీ గొడ్డు లాటి మౌంట్ రోడ్డుకి చెరోచ్చు అక్కడ. బెంగుళూరు పరిస్తితి అది కాదు. ఒక్కో చౌరస్తాలో ఆరు నుండి ఎనిమిది రోడ్లు కలుస్తున్నాయి. కొత్త బైక్ మీద జూనియర్ బాస్ అలవాటయిన వీదుల్లోంచి వాయు వేగం తో దూసుకెళ్లి, వాళ్ళ అక్క బావ ఉంటున్న (రెడ్డి గారి పెద్దమ్మాయి అల్లుడు బెంగుళూరు లోనే నివాసం ) ఇంటికి చేర్చాడు.
అక్కడ బోజనం చేశాం. సాయంత్రం సైట్ కి వెళ్లొచ్చు రెస్ట్ తీసుకోమని జూనియర్ బాస్ చెప్పాడు. తెల్లటి మెత్తటి ఆ సోఫాలలో కూర్చోడానికి ఇబ్బందిగా అనిపించింది. యాంటీ  రూమ్ లో ఉన్న చక్క సోఫా లో కూర్చుని ఇంగ్లిష్ పత్రికలు కొన్ని తిప్ప సాగాను. INSIDE OUTSIDE అనే ఆర్కిటెక్టరల్  మాస పత్రికని  మొదటి సారి అక్కడే చూశాను.
పెద్ద అక్క గారి 10.12 ఏండ్ల  పిల్లలు ఇద్దరు తో కాసేపు ఆడాను. వారు ఇంగ్లిష్ లో స్ట్రాంగ్ గాను లాజిక్ లో చాలా వీక్ గాను అనిపించారు.
సాయంత్రానికి చూడగానే అడవి మృగం లా అనిపించే  మనిషి ఒకరు వచ్చారు. “ఇతను భాస్కర్ అని సైట్ లో ఉంటారు. పర్చేజెస్ అవి చూస్తుంటాడు. “ జూనియర్ బాస్ చెప్పాడు.
చిన్న బాసు ఇతను దాదాపు ఒకే ఏజ్ , దూరపు చుట్టరికం కారణం గా అవోచ్చు ఇద్దరి మద్య మంచి అండర్ స్టాండింగ్ ఉండటం గమనించాను
అతని బండి యెజ్ది 250 సి సి మీద, జయా నగర్ ఎక్స్ టెన్షన్ లో జరుగుతున్నా మిలటరీ ఇంజనీరింగ్ వర్క్స్ లో శ్రీనివాసా కంస్ట్రక్షన్ కంపెనీ సైట్ కి లాగేజీ లో సహా చేరాను. దారి లో అతనేదో మాట్లాడాడు గాని నానోక్కటే ప్రశ్న వేశాను. “గతం లో మీరు పైలెటా అని “ సైట్ కి చేరిందాకా నవ్వుతూనే ఉన్నాడు.
ఆకారానికి లోపలి మనిషికి బొత్తిగా సంబందం లేదని కొద్దిసేపు మాట్లాడాకా తెలిసింది.ఒక పెద్ద కాంపౌండ్ వాల్ లోపల సుమారు ఫర్లాంగ్ పొడవు,తగిన వెడల్పు ఉన్న ఎనిమిది అంతస్తుల నిర్మాణం లో ఉన్న భవనం అది. చూడగానే నాకు కళ్ళు  బైర్లు కమ్మాయి. మద్రాసు ఆఫీసులో కూచుని ఊహించలేని ప్రపంచం అది. చుట్టూ స్థలం లో రకరకాల బిల్డింగ్  మెటీరియల్స్, స్టాక్ చేసి ఉన్నాయి. స్థలం లో కాంపౌండ్ వాల్ లోపల ఒక మూల ఉన్న అఫీసు గది కి నన్ను తీసుకెళ్ళాడు. దాని పక్కనే మరో రూము, బాత్రూము లాటి సౌకర్యాలు ఉన్నాయి. మరో  నడివయసు వ్యక్తి కి నన్ను పరిచయం చేశాడు భాస్కర్.
“మద్రాసు నుండి వచ్చాడు” .
“సీనియర్ ఇంజనీరు వెంకట్రావు “
అతను ముభావంగా ఉన్నాడు.
“ఇక ఇక్కడే ఉండేది. పని చేసేది”. భాస్కర్  చెప్పాడు

ఎటు చూసినా పదడుగులు మించని ఆ గది లో నన్ను దిగబెట్టి అతను వెళ్ళి పోయాడు. నేను నా లగేజీ  తో ముసురు కుంటున్న చీకట్లో అలా నిలబడి ఉన్నాను.

No comments: